అన్వేషించండి

Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 

Water Damage Prevention: సింక్ ట్రాప్‌లు లీక్ అవ్వడానికి అత్యంత సాధారణ కారణాలు లూజ్‌గా ఉన్న కనెక్షన్‌లు, అరిగిపోయిన వాషర్‌లు, సరిగా లేని పైపు ఫిట్టింగ్‌లు లేదా విరిగిన భాగాలు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వదులైన కనెక్షన్లు, అరిగిపోయిన వాషర్లు సింక్ లీక్ కారణాలు.
  • లీక్ గుర్తించి, వదులు కనెక్షన్లు వెంటనే చేతితో బిగించాలి.
  • పాడైన వాషర్లు మార్చాలి, లేదంటే కొత్త ట్రాప్ అమర్చాలి.

How To Fix A Leaking Sink Trap: ఇంట్లోని సింక్ కింద నుంచి నీరు లీక్ అవ్వడం అనేది ఒక సాధారణ సమస్యలా అనిపించవచ్చు, కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. నెమ్మదిగా జరిగే లీక్ వల్ల వంటగది క్యాబినెట్‌లు, ఫ్లోర్‌లు, ఇతర వస్తువులు దెబ్బతినవచ్చు. అదృష్టవశాత్తూ, చాలా సందర్భాల్లో, ఈ సమస్యను పెద్దగా ఖర్చు లేకుండా సులభంగా పరిష్కరించవచ్చు. దాన్ని మీరు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 

సింక్‌ను ఎలా బాగు చేసుకోవాలి?

ప్లంబింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సింక్ ట్రాప్‌లు (వీటిని పి-ట్రాప్‌లు అని కూడా పిలుస్తారు) లీక్ అవ్వడానికి అత్యంత సాధారణ కారణాలు వదులుగా ఉన్న కనెక్షన్‌లు, అరిగిపోయిన వాషర్‌లు, సరిగా లేని పైపు ఫిట్టింగ్‌లు లేదా పాతబడిన,  విరిగిన పార్ట్స్‌ కావచ్చు. అందువల్ల, ముందుగా నీటి లీక్ కారణాలను గుర్తించాలి. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మొత్తం ట్రాప్‌ను పొడి గుడ్డతో పూర్తిగా శుభ్రం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఆ తర్వాత, సింక్ కింద ఒక బకెట్ ఉంచి, కొన్ని నిమిషాల పాటు నీటిని వదలండి. అవసరమైతే ఫ్లాష్‌లైట్ ఉపయోగించి, ప్రతి కనెక్షన్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయండి. కొన్నిసార్లు, నీరు పై ప్రదేశం నుంచి లీక్ అయి, కింద వేరే ప్రదేశం నుంచి చుక్కలుగా కారుతుంది, దీనివల్ల కారణాన్ని గుర్తించడం కష్టమవుతుంది.

ఈ విషయాన్ని గుర్తుంచుకోండి

చాలా సందర్భాలలో, స్లిప్-జాయింట్ నట్స్ దగ్గర లీకులు కనిపిస్తాయి. కనెక్షన్ వదులుగా ఉంటే, చేతితో బిగించడం సరిపోవచ్చు. అవసరమైతే, ప్లైయర్స్ ఉపయోగించి కొద్దిగా అదనంగా తిప్పవచ్చు. అయితే, అతిగా బిగించడం వల్ల ప్లాస్టిక్ ఫిట్టింగ్ విరిగిపోవచ్చని లేదా వాషర్ దెబ్బతినవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నట్స్ బిగించిన తర్వాత కూడా లీక్ కొనసాగితే, వాషర్‌ చెక్ చేయాలి. కాలక్రమేణా, వాషర్లు గట్టిపడతాయి లేదా పాడైపోతాయి. దీనివల్ల సరైన సీలింగ్ జరగదు. అటువంటి సందర్భాల్లో, కొత్త వాషర్లను అమర్చడం అత్యంత సులభమైన చౌకైన పరిష్కారంగా చెప్పవచ్చు.

Also Read: స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?

ట్రాప్ పగిలిపోతే ఏం చేయాలి? 

అయితే, ట్రాప్ పగిలిపోయినా లేదా ఐరన్ పైపు తుప్పు పట్టినా, మొత్తం ట్రాప్‌ను మార్చడమే మంచిది. మార్కెట్లో లభించే PVC పి-ట్రాప్‌లు చవకైనవి, తుప్పు పట్టకుండా కూడా ఉంటాయి. కొత్త ట్రాప్‌ను అమర్చేటప్పుడు, అన్ని వాషర్‌లు సరైన దిశలో ఉన్నాయని, పైపులు సరిగ్గా అమర్చి ఉన్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యం. ప్లంబింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తరచుగా లీకులు అవుతున్నా లేదా ఫిట్టింగ్‌ల థ్రెడ్‌లు అరిగిపోయినా, కేవలం ఒక భాగాన్ని మార్చడం కంటే మొత్తం అసెంబ్లీని మార్చడమే సురక్షితమైన, ఎక్కువ కాలం నిలిచే పరిష్కారంగా చెబుతున్నారు.         

Also Read: శరీరంలో B12 లోపం ఉందా? న్యూట్రిషనల్ ఈస్ట్​ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి.. వెజిటేరియన్స్​కి బెస్ట్ 

Frequently Asked Questions

సింక్ ట్రాప్ లీక్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

వదులుగా ఉన్న కనెక్షన్లు, అరిగిపోయిన వాషర్‌లు, సరిగా లేని పైపు ఫిట్టింగ్‌లు లేదా పాతబడిన, విరిగిన భాగాలు సింక్ ట్రాప్ లీక్‌లకు కారణం కావచ్చు.

సింక్ లీక్‌ను ఎలా గుర్తించాలి?

ముందుగా ట్రాప్‌ను శుభ్రం చేసి, దాని కింద బకెట్ ఉంచి, నీటిని వదలండి. లీక్ అయ్యే ప్రదేశాన్ని ఫ్లాష్‌లైట్‌తో జాగ్రత్తగా తనిఖీ చేయండి.

వదులుగా ఉన్న కనెక్షన్‌ల వల్ల లీక్ అయితే ఏం చేయాలి?

స్లిప్-జాయింట్ నట్‌లు వదులుగా ఉంటే, వాటిని చేతితో లేదా ప్లైయర్స్‌తో కొద్దిగా బిగించండి. అతిగా బిగించడం వల్ల ఫిట్టింగ్‌లు దెబ్బతినవచ్చు.

సింక్ ట్రాప్‌ను ఎప్పుడు మార్చాలి?

ట్రాప్ పగిలిపోయినా, ఐరన్ పైపు తుప్పు పట్టినా, లేదా తరచుగా లీకులు అవుతున్నా మొత్తం ట్రాప్‌ను మార్చడం మంచిది. PVC పి-ట్రాప్‌లు తుప్పు పట్టవు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget