అన్వేషించండి

Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 

Pillow Cleaning Tips: మీ దిండు శుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ, దాని నుంచి వింత వాసన రావడం చూస్తుంటాం. దానిని ప్రతిసారీ ఉతకాల్సిన అవసరం లేదు. గదిలోకి ఫ్రెష్ ఎయిర్ రాకపోయినాసరే దిండు కంపుకొడుతుంది 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దిండ్ల దుర్వాసన పోగొట్టడానికి బేకింగ్ సోడా అద్భుత పరిష్కారం.
  • ఎండలో ఆరబెట్టడం, వెనిగర్ స్ప్రే తేమ, వాసనలు తొలగిస్తాయి.
  • ఎసెన్షియల్ ఆయిల్స్ వాడి, శుభ్రత పాటిస్తే దుర్వాసన రాదు.

Pillow Cleaning Tips: మీ దిండు శుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ, దాని నుంచి వింత వాసన వస్తుంటే, దానిని ప్రతిసారీ ఉతకాల్సిన అవసరం లేదు. చెమట, హెయిర్ ఆయిల్, తేమ, సరిగా గాలి రాకపోవడం వంటివి తరచుగా దుర్వాసనకు కారణమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదే  పదే దిండ్లను ఉతకలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇంటి చిట్కాలతో వాటిని ఫ్రెష్‌గా మార్చుకోవచ్చు. 

దిండ్లను ఎలా శుభ్రం చేయవచ్చు?

అన్నిటికన్నా సులభమైన పద్ధతి బేకింగ్ సోడాను ఉపయోగించడం. దిండుకు ఇరువైపులా కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, సుమారు ఒక గంట పాటు అలానే వదిలేయండి. బేకింగ్ సోడా దుర్వాసనను పీల్చుకోవడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత, దానిని వాక్యూమ్ క్లీనర్ లేదా పొడి గుడ్డతో పూర్తిగా శుభ్రం చేయండి. దీనివల్ల కంపు చాలా వరకు తగ్గిపోతుంది.  

ఎండలో ఆరబెట్టవచ్చు

ఎండ ఉన్నట్లయితే, దిండును కొన్ని గంటలపాటు ఆరుబయట సూర్యరశ్మి తగిలేలా ఉంచండి. సూర్యరశ్మి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించి, తేమను తొలగించడంలో సహాయపడుతుంది. దిండుకు రెండు వైపులా సమానంగా సూర్యరశ్మి తగిలేలా చూడండి. అంటే అప్పుడప్పుడు దాన్ని తిప్పి ఆరబెట్టండి

వైట్‌ వెనిగర్ మరో ప్రత్యామ్నాయం

దుర్వాసనలను తొలగించడంలో వైట్‌ వెనిగర్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక స్ప్రే బాటిల్‌లో తగినంత పరిమాణంలో వైట్‌ వెనిగర్, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని దిండుపై తేలికగా స్ప్రే చేయండి. దిండు మరీ ఎక్కువగా తడవకుండా జాగ్రత్త వహించండి. ఆ తర్వాత, దానిని పూర్తిగా గాలిలో ఆరబెట్టండి. వెనిగర్ ఆరిపోయిన తర్వాత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దుర్వాసనలు పూర్తిగా తొలగిపోతుంది. 

మీ దిండుపై తేలికపాటి, తాజాగా ఉండే సువాసన కావాలంటే, లావెండర్, నిమ్మ, లేదా యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్‌ను నీటిలో కలిపి కొన్ని చుక్కలు చల్లుకోవచ్చు. ఇది మీ దిండును తాజాగా ఉంచుతూ, తేలికపాటి సువాసనను అందిస్తుంది. 

Also Read: శరీరంలో B12 లోపం ఉందా? న్యూట్రిషనల్ ఈస్ట్​ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి.. వెజిటేరియన్స్​కి బెస్ట్

భవిష్యత్తులో దిండు దుర్వాసన రాకుండా నివారించడానికి, కొన్ని విషయాలను విధిగా పాటించాలి. దిండుపై చెమట, నూనె పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. పడుకునే ముందు మీ ముఖాన్ని, జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే, పిల్లో ప్రొటెక్టర్‌ను ఉపయోగించండి. దాని కవర్‌ను వారానికి ఒకసారి ఉతకండి. అలాగే, మంచం మీద తినడం మానుకోండి. ఎందుకంటే వాటిపై పడిన మీ కంటికి కనిపించని ఆహార పదార్థాలు లాంగ్ టైంలో దుర్వాసనకు కారణమవుతాయి. 

Frequently Asked Questions

దిండు శుభ్రంగా ఉన్నా దుర్వాసన వస్తే ఏమి చేయాలి?

దిండు శుభ్రంగా కనిపించినా వాసన వస్తుంటే, దాన్ని ఉతకాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, ఎండ, వెనిగర్ వంటి ఇంటి చిట్కాలతో దానిని తాజాగా మార్చుకోవచ్చు.

దిండు దుర్వాసన పోవడానికి బేకింగ్ సోడాను ఎలా ఉపయోగించాలి?

దిండుకు ఇరువైపులా బేకింగ్ సోడా చల్లి, ఒక గంట తర్వాత వాక్యూమ్ క్లీనర్ లేదా పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఇది దుర్వాసనను పీల్చుకుని, కంపును తగ్గిస్తుంది.

దిండ్ల దుర్వాసనను తొలగించడానికి వైట్ వెనిగర్ ఎలా వాడాలి?

ఒక స్ప్రే బాటిల్‌లో వెనిగర్, నీటిని కలిపి, దిండుపై తేలికగా స్ప్రే చేయాలి. తర్వాత పూర్తిగా గాలిలో ఆరబెట్టాలి. వెనిగర్ ఆరిపోయాక దుర్వాసనలు తొలగిపోతాయి.

దిండు మళ్ళీ వాసన రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పడుకునే ముందు ముఖం, జుట్టు శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లో ప్రొటెక్టర్ వాడి, కవర్‌ను వారానికి ఒకసారి ఉతకాలి. మంచం మీద తినడం మానుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget