అన్వేషించండి

Bay Leaves Under Pillow : తలగడ కింద బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఇన్ని లాభాలా? కోరికలు కూడా నెరవేరుతాయా?

Bay Leaf Under Your Pillow : దిండుకింద బిర్యానీ ఆకు పెడితే నిజంగా లాభాలున్నాయా? వైరల్ ట్రెండ్ వెనుక నిజం ఏంటి? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూసేద్దాం.

Bay Leaf Under the Pillow : బిర్యానీని చాలామంది ఇష్టంగా తింటారు. దానినే పేరుగా పెట్టుకున్న బిర్యానీ ఆకును ఎన్నో వంటకాల్లో, మసాలాల్లో ఉపయోగిస్తారు. ఇది వంటకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది. అయితే ఇది కేవాలం వంటింటికే పరిమితం కాకుండా ఎన్నో నమ్మకాలు, ఆచారాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దీని గురించిన ఓ విషయం తెగ వైరల్ అవుతుంది. అదే దిండు కింద బిర్యానీ ఆకు పెట్టుకోవడం. మరి ఇది ఎంతవరకు మంచి విషయమో ఇప్పుడు చూసేద్దాం. 

బిర్యానీ ఆకును రాత్రుళ్లు దిండుకింద పెట్టి నిద్రపోతే మంచి నిద్ర వస్తుందని.. మంచి కలలు వస్తాయని.. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని చెప్తూ రీల్స్ చేస్తున్నారు. ఏఐ వీడియోల్లో భాగంగా బిర్యానీ ఆకును హైలెట్స్ చేస్తూ ఎన్నో రీల్స్ వస్తున్నాయి. బాగా వైరల్ కూడా అవుతున్నాయి. మరి ఇది శాస్త్రీయంగా ఎంతవరకు నిజం? బిర్యానీ ఆకు దిండు కింద పెట్టి పడుకోవడం వల్ల ఎలాంటి లాభాలుంటాయో చూసేద్దాం. 

బే లీఫ్ ఆచారం వెనకున్న చరిత్ర

గ్రీకు, రోమన్ సంస్కృతుల్లో బిర్యానీ ఆకును రక్షణకు, జ్ఞానానికి, మార్గదర్శకత్వానికి ప్రతీకగా భావించేవారు. అందుకే నిద్రపోయే సమయంలో మంచం దగ్గర బే లీఫ్ ఉంచితే నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయని నమ్మేవారు. మనసుకు స్పష్టత వస్తుందనుకునేవారు. అలాగే వీటి వాసన వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుందని.. మంచి కలలు వస్తాయని భావించేవారు. బిర్యానీ ఆకు అనే కాదు.. పాత కాలంలో నిద్రకు ముందు ఇలాంటి మూలికలు వాడటం సాధారణంగా ఉండేది. అవి మనసును శాంతింపజేస్తాయని భావించేవారు. ఇప్పుడు ఇదే ట్రెండ్లోకి వచ్చింది. 

సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందంటే..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ బాగా వైరల్ అవుతుంది. దీంతో కొందరు ముందు వెనుక ఆలోచించకుండా ఫాలో అయిపోతున్నారు. ఎందుకంటే దీని వాసన వల్ల మంచి నిద్ర వస్తుందనే విషయం చెప్పడం మానేసి.. కోరికలు నెరవేర్చే సాధనంగా, పాజిటివ్ ఫలితాలను ఆకర్షించే వస్తువుగా చెప్తున్నారు. రాత్రి నిద్రకు ముందు ఏదైనా కోరిక అనుకుని దిండుకింద బిర్యానీ ఆకు పెడితే.. ఆ కోరిక నెరవేరుతుందంటూ వైరల్ చేస్తున్నారు. 

ఇది ఎంతవరకు నిజం?

బిర్యానీ ఆకు మంచి నిద్ర ఇస్తుంది అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే పాజిటివ్ కలలను వస్తాయని కూడా లేదు. కానీ రాత్రి నిద్రకు ముందు చేసే చిన్న అలవాట్లు, ఆచారాలు మనసుకు భద్రత, ప్రశాంతతను కలిగిస్తాయి. దాంతో మనసు రిలాక్స్ అయి నిద్ర బాగా రావచ్చు. మంచి జరుగుతుంది అనే పాజిటివ్ కోరికతో పడుకోవడం వల్ల నిద్ర శరీరం రిలాక్స్ నిద్ర వస్తుంది. పాజిటివ్ హోప్ కోసం ట్రై చేస్తే పర్లేదు కానీ అది మూఢ నమ్మకంగా మారకూడదని నిపుణులు చెప్తున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget