ఉదయాన్నే బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగితే..?

Published by: Geddam Vijaya Madhuri

హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అలాంటివాటిలో బిర్యానీ ఆకు టీ కూడా ఒకటి.

ఇది మంచి అరోమాను అందించి శారీరకంగా, మానసికంగా కూడా బెనిఫిట్స్ ఇస్తుంది.

టైప్ 2 మధుమేహమున్నవారు తాగితే మంచి ప్రయోజనాలుంటాయి. గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

జీర్ణ సమస్యలున్నవారు కూడా దీనిని తీసుకుంటే చాలా మంచిది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

క్యాన్సర్ కారకాలను దూరం చేసే యాంటీ క్యాన్సర్ లక్షణాలను ఇది కలిగి ఉంటుంది.

స్కిన్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. ర్యాష్, పింపుల్స్ సమస్యను దూరం చేస్తుంది.

హార్మోనల్ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది.

డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను బిర్యానీ ఆకు టీ దూరం చేస్తుంది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహాలు ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)