అన్వేషించండి

Old Pillow : దిండును ఎన్ని రోజులకు మార్చాలి? పాత దిండును ఎక్కువ కాలం వాడితే కలిగే నష్టాలు ఇవే

Replace Your Pillow : ఎక్కువకాలం ఒకే దిండు వాడితే ఆరోగ్యానికి అనేక నష్టాలు వస్తాయని అంటున్నారు. మరి పిల్లో ఎన్ని రోజులకు మార్చాలి? ఎలాంటి దిండు ఎంచుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాత దిండ్లు వాడటం వల్ల దుమ్ము, మైట్స్, బ్యాక్టీరియా పెరిగి అలర్జీలు వస్తాయి.
  • దిండ్లు మెడకు సరిగా సపోర్ట్ ఇవ్వక వెన్నునొప్పి, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.
  • మెమరీ ఫోమ్, సరైన ఎత్తు ఉన్న దిండ్లు మెడకు, నిద్రకు మేలు చేస్తాయి.
  • ప్రతి వారం కవర్ మార్చి, 2-3 నెలలకు ఒకసారి దిండును శుభ్రపరచాలి.

Big Problems with Old Pillow : మంచి నిద్ర కోసం చాలామంది మంచం, పరుపుపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ దిండు విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఒకే దిండును సంవత్సరాల పాటు వాడుతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. మరి దిండును ఎంతకాలానికి మార్చాలి? ఎక్కువ రోజులు వాడితే కలిగే నష్టాలు ఏంటో.. దిండు ఎంచుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దిండును ఎంతకాలానికి మార్చాలి?

దిండును 1 నుంచి 2 సంవత్సరాలకోసారి మార్చడం మంచిదని చెప్తున్నారు. పిల్లో ఆకారం మారినా మార్చేయాలంటున్నారు. సపోర్ట్ తగ్గితే వెంటనే మార్చాలని లేకుంటే అలర్జీలు, మెడ నొప్పి  సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. ఇవే కాకుండా ఎక్కువ రోజులు ఒకే దిండు వాడితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అవేంటంటే.. 

అలర్జీలు 

పాత దిండు ఉపయోగిస్తూ ఉంటే.. అలర్జీలు పెరుగుతాయి. ఎందుకంటే పిల్లో ఎక్కువకాలం వాడితే  దానిలో దుమ్ము, డస్ట్ మైట్స్, బ్యాక్టీరియా పెరుగుతాయి. దీనివల్ల తుమ్ములు, దగ్గు, అలర్జీలు వస్తాయి. 

చర్మ సమస్యలు

దిండులో పేరుకుపోయిన మురికి వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మొటిమలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 

మెడ, వెన్నునొప్పి

పాత దిండు మెడకు సరిగ్గా సపోర్ట్ ఇవ్వదు. మెడకు సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల నొప్పులు వస్తాయి. ఎక్కువకాలం వినియోగిస్తే.. ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. 

బ్యాక్టీరియా పెరుగుదల

దిండు చాలా కాలం వాడితే చెమట, నూనె, మురికి పెరిగి.. బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇది హైజీన్ సమస్యలకు దారితీస్తుంది.

నిద్ర నాణ్యత

సరైన సపోర్ట్ లేకపోతే నిద్ర సరిగా పట్టదు. దీంతో ఉదయం అలసటగా అనిపిస్తుంది. క్రమంగా నిద్ర నాణ్యత తగ్గుతుంది. 

దిండు ఎంచుకునేప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్

మెడకు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును ఎంచుకోవాలి. మెమరీ ఫోమ్, మెడకు బాగా సపోర్ట్ ఇచ్చే దిండు ఎంచుకోవాలి. కాటన్లో తీసుకుంటే సాఫ్ట్, కంఫర్ట్ ఉండేలా.. బడ్జెట్ ఫ్రెండ్లీ పిల్లోలు బెస్ట్. స్లీపింగ్ పొజిషన్‌కు సరిపోయే విధంగా ఎంచుకోవాలి. పక్కగా పడుకునేవారు.. కొంచెం ఎత్తుగా ఉండే దిండు.. వెనుకగా పడుకునేవారు మీడియం హైట్, బోర్లా పడుకునేవారు పలుచని దిండు ఎంచుకోవాలి. అలర్జీలు ఉండేవారికి హైపోఅలర్జెనిక్ దిండు ఎంచుకోవాలి.

దిండును ఎలా క్లీన్ చేయాలంటే.. 

దిండు కవర్ ప్రతి వారం మార్చండి. 2–3 నెలలకు ఒకసారి దిండు వాష్ చేయండి. సూర్యరశ్మిలో ఎండబెట్టండి. 
దిండు అనేది చిన్న విషయమే అనిపించినా.. ఇది మీ నిద్ర, ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి పాత దిండును ఎక్కువ కాలం వాడకుండా.. సరైన సమయానికి మార్చడం చాలా ముఖ్యం. మంచి దిండు ఎంచుకుంటే నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని గుర్తించుకోవాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget