అన్వేషించండి

Jaggery Benefits : బెల్లంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. చవితి సమయంలో స్వీట్స్ దీనితో చేయడానికి ఇదే ప్రధాన కారణమట

Ganesha Chaturthi Traditions : గణపతి బప్పాకి బెల్లం అంటే చాలా ఇష్టమంటూ ఉంటారు. అందుకే వీటితో వంటలు చేసి నైవేద్యంగా పెడతారు. దీని వెనుక ఆరోగ్యానికి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయట.. అవేంటంటే..

Importance of Jaggery in Vinayaka Chavithi Sweets : వినాయకచవితి వచ్చేసింది. ఈ సమయంలో గణపతికి వివిధ రకాల ఫుడ్స్ చేసి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పలు రకాల స్వీట్స్ చేసి నైవేద్యంగా పెడతారు. అయితే వీటిని స్వీట్స్​తో కాకుండా బెల్లంతో చేస్తే వినాయకుడు ప్రసన్నమవుతాడని.. గణపతి బొప్పాకి బెల్లం అంటే ఇష్టమని చెప్తారు. అయితే బెల్లంతో వంటలు చేయడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. ఇంతకీ ఆ రీజన్ ఏంటి? వినాయకుడికి బెల్లంతో ఎలాంటి ప్రసాదాలు చేయొచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

బెల్లంతో చేసుకోగలిగే వంటలు ఇవే..

చవితి సమయంలో బెల్లంతో పాయసం, బొబ్బట్లు, పొంగల్, బెల్లం తాళికలు వంటి పలు రకాల ప్రసాదాలు చేయొచ్చు. అయితే ఈ వంటల వంటలను బెల్లంతో చేయడానికి ఉన్న రీజన్ ఏంటంటే.. హెల్త్ బెనిఫిట్స్. అవును వినాయక చవితి సమయంలో దాదాపు వర్షాలు వస్తుంటాయి. ఆ సమయంలో వచ్చే పలు రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో బెల్లం మంచి ప్రయోజనాలు అందిస్తుంది అంటారు. అంతేకాకుండా పలు రకాల దీర్ఘకాలిక సమస్యలను కూడా ఇది దూరం చేస్తుందట. బెల్లంతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. 

ముందు రోజే సిద్ధం చేసుకుంటే..

చాలామంది స్వీట్స్​ని చక్కెరతో చేస్తారు. సమయం లేదనో.. త్వరగా అయిపోతుందనో.. ఇలా వివిధ కారణాలతో షుగర్​తో స్వీట్స్ చేస్తారు. అయితే ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి బెల్లాన్ని మీరు వాటికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పండుగరోజు బెల్లం కోరడం, బెల్లంతో వంటలు చేయడం కష్టమనుకుంటే.. ముందు రోజే బెల్లాన్ని తురిమి పెట్టుకుని.. పండుగరోజు ఈజీగా వంటలు చేయొచ్చు. ఇవి మీకు మంచి రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందిస్తాయి. 

సీజనల్ వ్యాధులు మాయం..

వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలను బెల్లం దూరంచేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందించి.. ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే మీరు భోజనం చేసిన తర్వాత ఈ బెల్లాన్ని కాస్త నేరుగా తినొచ్చు. అలాగే మలబద్ధకం సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే.. మీ డైట్​లో బెల్లం చేర్చుకోవచ్చు. ఇది పేగు కదలికలను వేగవంతం చేసి.. సమస్యనుంచి ఉపశమనం అందిస్తుంది. ఇమ్యూనిటీని పెంచి సీజనల్ వ్యాధులను కూడా దూరం చేసే లక్షణాలను బెల్లం కలిగి ఉంటుంది. 

మహిళలకు చాలా మంచిది..

రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి బెల్లం మంచి ఆప్షన్. ఇది సమస్యను దూరం చేసి.. ఐరన్​ శాతాన్ని పెంచుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. అలాంటివారు బెల్లం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా దూరం చేయగలిగే సత్తా దీనికి ఉంది. అలాగే గొంతు నొప్పిని కూడా ఇది దూరం చేసి మెరుగైన ఫలితాలు అందిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేసి.. లోపలి నుంచి శుభ్రం చేసి.. ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా కాలేయ సమస్యలతో ఇబ్బంది పడేవారు నిపుణుల సూచనలతో బెల్లాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందిస్తుంది. 

సైడ్ ఎఫెక్ట్స్..?

బెల్లాన్ని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే.. లేవనే చెప్పాలి. కానీ.. దీనిని లిమిట్​గా తీసుకుంటే మంచిది. బరువు తగ్గేందుకు లేదా షుగర్ సమస్యతో ఇబ్బంది పడేవారు కేలరీలు, స్వీట్ విషయంలో కాస్త అవగాహనతో ఉండాలి. లేదంటే ఇది బరువు పెరగడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్​లో మార్పులు తీసుకువస్తుంది. కాబట్టి వీటిని తీసుకునే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహాలు తీసుకోండి. హాయిగా వినాయకచవితికి బెల్లం ప్రసాదాలు చేసుకుని లాగించేయండి.

Also Read :  వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు.. గారెలు, పెరుగువడలను ఇలా టేస్టీగా చేసి పెట్టేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
Embed widget