Viagra: పసిపాపల పాలిట వరం వయాగ్రా - నమ్మశక్యంగా లేదా? ఇది మీరు తెలుసుకోవాల్సిందే!
Viagra: వయాగ్రా.. ఈ పేరు అనగానే అదోలా చూస్తుంటారు. దాని నేపథ్యం అంటువంటిది. తాజా పరిశోధనల్లో నవజాత శిశువల్లో వచ్చే ఆక్సిజన్ అందని పరిస్థితిని వయగ్రా సక్రమంగా చేసి ప్రాణాలను కాపాడుతుందని తేలింది.
Viagra: వైద్య పరిశోధనలు ఎన్నో అద్భుతమైన చికిత్సలను, ఔషదాలను మనకు అందిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట వచ్చిన ఫ్లూ, టీబీ, మశూచీ నుంచి నిన్న మొన్నటి కోవిడ్ వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారం చూపి.. ప్రాణాలను నిలబెట్టిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఇలాంటి పరిశోధనల్లో ఎన్నో విచిత్రమైన డ్రగ్స్ కూడా బయటపడుతుంటాయి. వాటిని పద్ధతిగా ఉపయోగించినట్లయితే.. మానవజాతికి కూడా ఎంతో మేలు చేస్తుంటాయి. తాజాగా.. పురుషులు తమ పార్టనర్‌తో కలయిక కోసం ఉపయోగించే వయాగ్రాతో పిల్లలకు ఊపిరిపోయొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
వయాగ్రా అనగానే చాలా మంది ‘కలయిక’ కోసం వాడే మందు అనుకుంటారు. ఈ పేరు చెప్పడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. అలాంది ఇప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారుల పాలిట ప్రాణదాతగా మారుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఎందుకంటే కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గర్భదారణ సమయంలో ఆక్సిజన్ అందని.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే శిశువులకు సహాయపడేందుకు వయాగ్రా సాధ్యమైన పరిష్కారం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
నవజాత శిశువుల్లో ఏర్పడే నియోనాటల్ ఎన్సెఫలోపతి సమస్య పరిష్కారం కోసం వెతుకుతున్నారు పరిశోధకులు. తాజాగా మాంట్రియల్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేసిన క్లినికల్ అధ్యయనం మొదటి దశ ఒక పరిష్కారాన్ని సూచించింది. ఇది వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఈ మధ్యే ది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురించారు. వయాగ్రా వాడకం వల్ల నియోనాటల్ ఎన్సెఫలోపతి వల్ల మెదడు దెబ్బతినే సంకేతాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన ఫలితంలో ఎంతో మంది చిన్నారుల పాలిట వరంగా మారే ఛాన్స్ ఉంది. ఆక్సిజన్ కొరతతో పోరాడుతున్న నవజాతశిశువులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అంగస్తంభన సమస్యకు చికిత్స చేయడానికి వయాగ్రా సాంప్రదాయకంగా పురుషులు సెక్స్ సమయంలో ఉపయోగిస్తారు. ఇది పురుషాంగం, మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి రక్త నాళాలను విస్తరించడం ద్వారా పనిచేస్తుంది. ఇంతకుముందు అధ్యయనాలు దీని వినియోగాన్ని అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 18 శాతం తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి. ఇది గుండె జబ్బులు, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. మగవారిలో గుండెపోటును కూడా నివారించవచ్చని అంటున్నారు. అంగస్తంభన కోసం మందు తీసుకున్న పురుషులలో పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. దాదాపు 13 శాతం మంది గుండెపోటు, స్ట్రోక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రధాన ప్రతికూల కార్డియోవాస్కులర్ ఈవెంట్ తక్కువ రేట్లు చూపించారు. 39 శాతం మంది గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల రేటును తక్కువగా ఉందని తేలింది. 25 శాతం మంది సాధారణంగా తక్కువ మరణాల రేటును కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Also Read : బరువు తగ్గేందుకు రోజూ రోజ్ టీ తాగాలట.. తయారీ రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.