Fathers Day 2022: ఫాదర్స్ డే రోజు నాన్నకి ఎలాంటి బహుమతి ఇస్తే బావుంటుంది? ఇవిగో కొన్ని ఐడియాలు
ఫాదర్స్ డే వచ్చేస్తోంది. నాన్నకి ఎలా సర్ ప్రైజ్ చేయాలో ఈపాటికే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు పిల్లలు.
పిల్లల కోసం ఏదో ఒకటి కొనేందుకు నాన్న నిత్యం తపన పడుతూనే ఉంటారు. ఎలాంటి డ్రెస్ కొనాలి, ఏ స్కూల్లో చేర్చాలి, సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికెళ్లేప్పుడు ఏం తీసుకెళ్తే వారు ఆనంద పడతారు? ఇలా వారి మనసులో నిత్యం ఆలోచనల సుడులు తిరుగుతూనే ఉన్నాయి.అలంటి నాన్నకి ఏడాదిలో ఒక్కసారైనా పిల్లలు కూడా సర్ ప్రైజ్ ఇవ్వాలిగా, మంచి బహుమతి కొనాలిగా. ఇవిగో కొన్ని గిఫ్ట్ ఐడియాలు. ఇందులో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి వారి బడ్జెట్లోనే దొరికే వస్తువులు ఇవి.
1. పిల్లో కవర్
పిల్లో కవర్ పై ఫోటోలు ప్రింట్ వేసే షాపులు అధికంగానే ఉన్నాయి. మీ డాడీతో మీరున్న ఫోటోలను తీసుకెళ్లి అలా పిల్లోపై ప్రింట్ వేయించండి. దాన్ని గిఫ్టు ప్యాక్ చేసి ఫాదర్స్ డే రోజున మీ నాన్నికి ఇవ్వండి. దీని ఖరీదు అయిదు వందల రూపాయల నుంచి వెయ్యి వరకు ఉంటుంది.
2. టీ షర్టులు
తండ్రి - కొడుకు లేదా తండ్రి - కూతురు... ఒకేలాంటి టీ షర్టులు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. బయట కూడా అందుబాటులో ఉన్నాయి. మై డాడ్ ఈజ్ మై హీరో అనే టీ షర్టులు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇలాంటి టీ షర్టులను బహుమతిగా
3. నచ్చిన వంట
నాన్నకు తన పిల్లలు వండిన ఏ వంట అయిన నచ్చుతుంది. అమ్మ సాయంతో ఆరోజు నాన్నకు మీ చేతులతో వండి పెట్టండి. అంతకన్నా మీ నాన్న కోరుకునేది ఏమీ ఉండదు.
4. గ్రీటింగ్ కార్డులు
అందమైన గ్రీటింగ్ కార్డులు బయట ఎన్నో అమ్ముతారు. కానీ మీరే స్వయంగా తయారుచేసి మీ ఫోటోలను అతికించి ఇచ్చి, మీ నాన్న చేత ‘వావ్’ అనిపించుకోండి.
5. స్క్రాప్ బుక్
మీ చిన్నప్పట్నిచి నాన్నతో ఎన్నో ఫోటోలు దిగుంటారు. మీతో పాటూ మీ తండ్రి కూడా ఎదుగుతూ వస్తుంటారు. మీ తండ్రి పెళ్లి కాక ముందు ఫోటోలు, పెళ్లి ఫోటోలు, మిమ్మల్ని తొలిసారి ఎత్తుకున్న ఫోటోలు, ఇలా అతని లైఫ్ జర్నీని స్క్రాప్ బుక్ గా మార్చి ఇవ్వండి. కచ్చితంగా ఆ జ్ఞాపకాల సమాహారాన్ని గుండెకు హత్తుకుంటారు.
పైన చెప్పినవన్నీ స్కూలు పిల్లల కోసం. ఇక ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్న వారు తమను చదివించిన తండ్రి కోసం ఏదైనా విలువైన వస్తువును కొనవచ్చు. మాటల సందర్భంలో తాను కొనుక్కోవాలనుకున్నా కూడా కుటుంబ బాధ్యతల కారణంగా వాయిదా వేసిన వస్తువులు చాలా ఉండి ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి మీరు కొని ఇవ్వండి. ఖరీదైన ఫోన్, వాచ్... ఇలా ఏదైనా కావచ్చు. మీరు ఇల్లు కొనుక్కున్నట్టయితే ఆ ఇంటికి నేమ్ బోర్డును మీ నాన్న పేరు మీదకి మార్చి చూడండి. ఆయన ఎంత ఆనందిస్తారో. మీరు చేసే చిన్నచిన్న పనులు నాన్నలో ఎంతో ఆనందానికి కారణమవుతాయి.
Also read: ఫాదర్స్ డే పుట్టుక వెనుక గుండెలు బరువెక్కే చరిత్ర, మనసు కరగాల్సిందే
Also read: యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మనమే, యోగా పితామహుడు ఎవరో తెలుసా?