అన్వేషించండి

Heart Attack Risk : జిమ్‌లలో పెరుగుతోన్న యువకుల ఆకస్మిక మరణాలు.. నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ICMR నివేదిక 

Heart Attacks Young People : ICMR అధ్యయనం ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ లేదా వ్యాయామం చేసే సమయంలో యువతలో జరుగుతున్న ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాలు తెలిపింది. అవేంటంటే...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యువతలో అకస్మాత్తు మరణాలపై ICMR విస్తృత అధ్యయనం చేపట్టింది.
  • జన్యు, పూర్వపు వ్యాధులు, ధూమపానం గుండెపోటు, గడ్డలకు కారణాలు.
  • మునుపటి గడ్డల చరిత్ర 60 రెట్లు ప్రమాదం; టీకాలతో హానిలేదు.

Heart Attacks and Blood Clots Rising Among Young Adults : ఇటీవలి కాలంలో జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు చాలామంది యువకులు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న కేసులు పెరిగాయి. ఈ మరణాలకు గల మూల కారణాలను అర్థం చేసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. జన్యుపరమైన హిస్టరీ, ముందు నుంచే ఉన్న అనారోగ్య పరిస్థితులు, ధూమపానం వంటి అలవాట్లు చిన్న వయసులోనే గుండెపోటు, రక్తపు గడ్డలు ఏర్పడటానికి ప్రాథమిక కారకాలని ఈ అధ్యయనం వెల్లడించింది. 

అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ఐసీఎంఆర్, జాతీయ అంటువ్యాధుల సంస్థ పరిశోధకులు దేశవ్యాప్తంగా 25 ప్రధాన ఆసుపత్రులలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సకాలంలో చికిత్స పొందడం వల్ల ప్రాణాలతో బయటపడిన రోగులను ఈ స్టడీలో చేర్చారు. చిన్న వయసులో గుండెపోటు, రక్తపు గడ్డలకు కారణమయ్యే కారకాలను అర్థం చేసుకోవడమే ఈ అధ్యయనం లక్ష్యంగా నిర్వహించారు. దీని కోసం 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల 767 మందిపై అధ్యయనం చేశారు.

Also Read : ఉదయాన్నే కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. గుండెపోటు హెచ్చరికలు కావచ్చు

వీరిలో 432 మంది అంటే సుమారు 56.3 శాతం మంది గుండెపోటుకు గురి కాగా.. సుమారు 25.8 శాతం మంది పక్షవాతానికి గురయ్యారు. మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఈ రెండు రకాల కేసులను కలిపితే మొత్తం కేసులలో సుమారు 82 శాతంగా ఉంది. ముఖ్యంగా ఈ రోగులలో 614 మంది అంటే సుమారు 80.1 శాతం మంది.. 31 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే.

ప్రమాదం పెరగడానికి గల కారణాలు ఏమిటి?

గుండెపోటు, రక్తపు గడ్డల ప్రమాదాన్ని గణనీయంగా పెంచే నిర్దిష్ట ప్రమాద కారకాలను ఈ అధ్యయనం గుర్తించింది. సాధారణ జనాభాతో పోలిస్తే.. గతంలో రక్తపు గడ్డలు ఏర్పడిన చరిత్ర ఉన్న రోగులకు గుండెపోటు వచ్చే ప్రమాదం 60 రెట్లు ఎక్కువగా ఉందట. ముందు నుంచే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఈ ప్రమాదం 4.6 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. ధూమపానం చేసేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 3.5 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కుటుంబంలో రక్తపు గడ్డలు ఏర్పడిన చరిత్ర ఉన్న రోగులకు ఈ ప్రమాదం 3.3 రెట్లు ఎక్కువగా ఉంది. 

Also Read : రోజులో 2 నిమిషాల ఈ పని చేస్తే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

కోవిడ్ వ్యాక్సిన్‌ ప్రభావం

కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కూడా వారి జీవిత చరమాంకంలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని ఈ అధ్యయనంలో తేలింది. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి అదనపు హాని కనిపించకపోవడం ఈ అధ్యయనంలో అత్యంత భరోసా ఇచ్చే విషయంగా చెప్తున్నారు. అయితే చిన్న వయసులోనే గుండెపోటు లేదా రక్తపు గడ్డలు కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు జిమ్‌లో చేరడానికి లేదా తీవ్రమైన వ్యాయామం చేయడానికి ముందు వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : గుండెపోటు రిస్క్ పెంచేస్తోన్న ప్రధాన కారకం.. కొలెస్ట్రాల్ కాదంటోన్న నిపుణులు, జాగ్రత్త సుమీ

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
HYROX Fitness Race : HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే
HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget