Sandwich Recipes : కార్తీకమాసం స్పెషల్ వెజ్ శాండ్‌విచ్ రెసిపీలు.. బ్రెడ్ లేకుండా ఇలా హెల్తీగా చేసేసుకోండి
Veg Sandwich Recipes : రుచికరమైన, ఆరోగ్యకరమైన కూరగాయలతో కూడిన శాండ్‌విచ్ తినాలనుకుంటున్నారా? అయితే బ్రెడ్ లేకుండా ఫ్రెష్‌గా, హెల్త్‌కోసం తినాలనుకుంటే ఈ టేస్టీ రెసిపీలు ట్రై చేయండి.

Breadless Sandwich Recipes : శాండ్‌విచ్‌లు చాలామంది ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి హెల్తీ స్నాక్, నైట్ డిన్నర్ వరకు ఏదొక రూపంలో తీసుకునేవాళ్లు ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దలవరకు ఎక్కువమంది దీనిని ఇష్టంగా తింటారు. చాలా కంఫర్ట్బుల్ ఫుడ్‌గా చెప్పొచ్చు. అయితే దీనిని కూరగాయలతో స్టఫ్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ ఆరోగ్యం దృష్ట్యా బ్రెడ్ లేకుండా శాండ్‌విచ్ తినాలనుకునేవారు.. కొన్ని రెసిపీలు ట్రై చేయవచ్చు. ఇవి రుచిలో రాజీ పడకుండా, పోషకమైన మార్గంలో శాండ్‌విచ్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. అలాంటి వాటిలో కొన్ని హెల్తీ రెసిపీలు ఇప్పుడు చూసేద్దాం.
లెట్యూస్ రాప్ వెజ్ శాండ్‌విచ్
క్రిస్పీ, రిఫ్రెషింగ్, క్రంచీగా ఉండే ఈ శాండ్‌విచ్ మీ చేతిలో పట్టుకోగలిగే సలాడ్‌లా అనిపిస్తుంది. పెద్ద రోమైన్ లేదా ఐస్‌బర్గ్ లెట్యూస్ ఆకుల్లో టొమాటో, దోసకాయ, అవకాడో, చీజ్ లేయర్స్‌గా వేసి.. దీనిని తయారు చేసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్, స్ప్రెడ్ క్రీము కూడా మంచి రుచిని ఇస్తుంది. కూరగాయల రుచి మరింత పెరుగుతుంది. ఇది లైట్ఫుడ్నే కానీ.. కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన స్నాక్‌గా దీనిని తీసుకోవ్చచు. .
కీరదోస శాండ్‌విచ్
చల్లగా, జ్యూసీగా, కొద్దిగా పుల్లగా ఉండే ఈ శాండ్‌విచ్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఒక పెద్ద దోసకాయను పొడవుగా కోసి, దానిలో ఉడికంచిన శనగలు, బెల్‌పెప్పర్స్, ఎర్ర ఉల్లిపాయలు కలిపి పెడతారు. దీనిని వెజ్ మాయోతో సర్వ్ చేసుకోవచ్చు. దోసకాయ క్రంచీగా ఉంటుంది. ప్రతి బైట్ క్రిస్పీగా, కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
గ్రిల్డ్ వంకాయ శాండ్‌విచ్
(Image Source: ABP LIVE AI)
టేస్టీగా శాండవిచ్ తినాలనుకునేవారికి వంకాయ శాండ్‌విచ్ మంచి ఎంపిక. దీనికోసం మందపాటి వంకాయ ముక్కలను ఆలివ్ నూనెతో బ్రష్ చేసి.. గ్రిల్ చేస్తారు. తరువాత కాల్చిన ఎర్ర మిరియాలు, బచ్చలికూర, ఫెటా చీజ్ లేయర్‌గా చేస్తారు. అంతే వంకాయ శాండ్‌విచ్ రెడీ. ఇది మీకు రుచికరమైన, హెల్తీ స్నాక్ అవుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
అవకాడో బోట్ శాండ్‌విచ్
(Image Source: ABP LIVE AI)
క్రీము, వెన్న, కాస్త పుల్లగా ఉండే ఈ శాండ్‌విచ్ బెస్ట్ రుచి ఇస్తుంది. పైగా ఇది హెల్తీ కూడా. పండిన అవకాడోను సగానికి కోసి, గుంట తీసి, చిన్న ముక్కలుగా చేసిన కూరగాయలు, చిక్‌పీస్, నిమ్మరసంతో మిక్స్ చేసి దానిలో కలుపుతారు. ఇప్పుడు అవి బయటకు రాకుండా అవకాడోను సున్నితంగా నొక్కుతారు. ఇది పిల్లలకు కూడా మంచి ఆప్షన్.
జుఖిని రోల్-అప్ శాండ్‌విచ్
(Image Source: ABP LIVE AI)
తేలికైన, క్రంచీ, ఫ్రెష్ టేస్ట్‌లతో నిండిన ఈ రోల్స్ మీకు మంచి ఫీలింగ్ ఇస్తాయి. జుఖినినీ రిబ్బన్‌లను తేలికగా కట్ చేసి.. వాటిని గ్రిల్ చేసి, హెర్బ్డ్ క్రీమ్ చీజ్‌తో స్ప్రెడ్ చేస్తారు. తురిమిన క్యారెట్లు, బెల్ పెప్పర్‌లను మధ్యలో ఉంచుతారు. ఈ రిఫ్రెంషింగ్ శాండ్ విచ్ రెసిపీలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. మీరు ట్రై చేసేయండి.






















