Heart Disease: చర్మం, గోళ్లు ఇలా మారాయా? అవి గుండె జబ్బు సంకేతాలు కావచ్చు, జాగ్రత్త పడండి
గుండె జబ్బులు ఒక్కోసారి కొన్ని లక్షణాలను ప్రదర్శించాకే, దాడి చేస్తాయి.
గుండె జబ్బు అనేది హఠాత్తుగా కలిగేది కాదు, అది కొన్ని నెలలు, సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. పరిస్థితి చేయిదాటినప్పుడు గుండెపోటుగానో, మరో రూపంలోనే బయటపడుతుంది. కానీ అప్పటికే సమయం మించిపోయే అవకాశం ఉంది. అందుకే గుండె జబ్బులను సైలెంట్ కిల్లర్స్ అంటారు. అయినా కూడా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సంకేతాలు, లేదా లక్షణాలను చూపిస్తాయి గుండె వ్యాధులు. వీటిని గుర్తిస్తే ప్రారంభదశలోనే జాగ్రత పడొచ్చు. గుండె అనారోగ్యం చర్మం పై కూడాప ప్రభావం చూపిస్తుంది. ప్రారంభదశలో కొన్ని లక్షణాలపై చర్మం పై చూపిస్తుంది.
ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం...
1. చర్మం నీలిరంగు లేదా ఊదారంగులో లైట్ గా కనిపిస్తుంది. అది వల లాంటి ఆకారాలు చర్మంపై కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. చాలా మంది దాన్ని ఇన్ఫెక్షన్ అనో, దద్దుర్లు అనో భావించి పట్టించుకోరు. ధమనులు బ్లాక్ అయినప్పుడు ఏర్పడే కొలెస్ట్రాల్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య కారణంగా ఇలా గజిబిజి గీతలు చర్మంపై కనిపిస్తాయి.
2. చాలా మంది వ్యక్తుల చర్మంపై పసుపు, నారింజ రంగు కనిపిస్తుంది. చర్మం కింద ఉండే ఫలకాలు ఇలా రంగు మారుతాయి. అలాగే కళ్ల మూలల్లో, కాళ్ల వెనుక భాగంలో ఈ రంగులు కనపిస్తాయి. ఇవి ఎలాంటి నొప్పిని కలిగించవు. అందుకే చాలా మంది ఆ లక్షణాలను పట్టించుకోరు. కొలెస్ట్రాల్ స్థాయిలో తీవ్రంగా మారినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుంటే గుండె జబ్బుల వచ్చే అవకాశం పెరుగుతుంది.
3. చర్మం పై చిన్న చిన్న బొడిపెల్లా కనిపిస్తాయి. ఆ బొడిపెలు కొవ్వు నిక్షేపాలు. అంటే కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉందని అర్థం. వీటిని చాలా మంది దద్దుర్లు కింద కొట్టిపడేస్తారు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపైన ఈ బొడిపెల్లా వస్తాయి.
4. గోళ్లు పెచ్చులూడుతున్నట్టు, బొడిపెల్లాగా తయారువుతాయి. ఇవి నొప్పి రావు. అందుకే ఎక్కువ మంది పట్టించుకోరు. గోళ్లు ఇలా మారడం ఊపిరితిత్తులు, గుండె జబ్బులను సూచిస్తాయి.
5. గోళ్లపై ఎరుపు, ఊదా రంగు గీతలు కనిపిస్తుంటాయి, పసుపు రంగు గీతలు కూడా వస్తాయి. ఈ గీతలు శరీరంలో ఏదో అనారోగ్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్టు. గుండె జబ్బుతో పాటూ అనేక శరీర వ్యాధులను ఇది సూచిస్తుంది.
6. ఎటువంటి కారణం లేకుండా చాలా రోజుల పాటు వేళ్లు, కాలి వేళ్లలో గడ్డల్లాంటివి వస్తే అది కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్టు సూచన. ఇవి నొప్పిని కలిగిస్తాయి.
Also read: ఈ ఆక్టోపస్‌ల మధ్యలో ఒక చిన్న చేప ఇరుక్కుపోయింది, మీరు కనిపెట్టగలరా?
Also read: శరీరంలో ఉప్పు ఎక్కువైతే హైబీపీ వస్తుంది, మరి తగ్గితే ఏమవుతుంది?