Hug Day Special : రోజుకో హగ్ దొరికిందంటే మీరు అదృష్టవంతులే.. కౌగిలింతల్లోని రకాలు, హర్ట్ చేసినప్పుడు ఇచ్చే హగ్ ఇదే
Hug Day 2025 : రోజుకో హగ్ దొరికితే మీకు శారీరకంగా, మానసికంగా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. ఒక్కో సందర్భానికి ఒక్కో పేరుతో ఒక్కో హగ్ ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

Benefits of Hugging : వాలెంటైన్స్ వీక్ (Valentines Week 2025)లో హగ్ డే (Hug Day)కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగానే కాదు.. ఇవేమి లేకుండా రోజుకో హగ్ మీకు వస్తే మీరు నిజంగానే అదృష్టవంతులు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రేమించే, అభిమానించే వ్యక్తుల నుంచి వచ్చే మీకు ఎన్నో సమస్యలను దూరం చేస్తుందట. శారీరక, మానిసక ప్రయోజనాలు అందించి.. మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన హగ్ డేని జరుపుకుంటారు. 2025లో హగ్ డే బుధవారం వచ్చింది. ఈ హగ్ డేని ఫిజికల్ ఎఫెక్షన్‌ని చూపించడంలో భాగంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రేమని, ధైర్యాన్ని, నేనున్నాను అనే భరోసాని అవతలి వ్యక్తికి ఇస్తూ ఈ హగ్ డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ హగ్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఒక్కో సందర్భానికి ఒక్కో హగ్‌కి ఒక్కో పేరు ఉంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
హగ్స్లోని రకాలు ఇవే..
హగ్ అంటే ఏముంది ఓ వ్యక్తిని వెళ్లి కౌగిలించుకోవడమే కదా అనుకోకండి. ఒక్కో సందర్భంలో ఈ హగ్స్ మారిపోతూ ఉంటాయి. అందుకే హగ్స్‌లో కూడా రకాలున్నాయి.
సర్ప్రైజ్ హగ్ (Surprise Hug) : అవతలి వ్యక్తికి తెలియకుండా.. సడెన్‌గా, సర్ప్రైజ్గా ఇచ్చే హగ్ ఇది.
బేర్ హగ్ (Bear Hug) : ఇది మొరటు ప్రేమను సూచిస్తుంది. అంటే హగ్ చేసుకుని.. అవతలి వ్యక్తిని హర్ట్ చేసేంత గట్టిగా హగ్ చేసుకోవడం.
పికిల్ ఇన్ ద మిడిల్ (Pickle in the Middle Hug) : ఓ వ్యక్తిని హగ్నుంచి విడిపోకుండా.. టీజ్ చేస్తూ ఒకరు లేదా ఇద్దరు ఇచ్చే హగ్ ఇది.
ఫ్యామిలీ హగ్ (Family Hug): ముగ్గురు లేదా ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు.. ఒక్కొక్కరికి సపరేట్గా కాకుండా.. అందరూ కలిసి సర్కిల్‌గా ఏర్పడి ఇచ్చుకునే హగ్‌ని ఫ్యామిలీ హగ్ అంటారు.
హరికేన్ హగ్ (Hurricane Hug) : హగ్ చేసుకుని.. రౌండ్‌గా తిరగడాన్ని ఇది సూచిస్తుంది. సంతోషంలో, సెలబ్రేషన్ సమయంలో దీనిని ఎక్కువగా ఫాలో అవుతారు.
మేక్ ఇట్ బెటర్ హగ్ (Make it Better Hug) : ఓ వ్యక్తిని హర్ట్ చేసినప్పుడు.. ఆ సమస్యను ఇంకా పెంచకుండా.. జెంటిల్‌గా ఇచ్చే హగ్‌ని మేక్ ఇట్ బెటర్ హగ్ అంటారు.
హగ్స్ వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు..
ఒత్తిడి : మీరు ప్రేమించే వ్యక్తి లేదా మిమ్మల్ని అభిమానించే వ్యక్తి ఒత్తిడి, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మీరు ఓ హగ్ ఇస్తే చాలట. ఆ సమయంలో ఆక్సిటోసిన్ విడుదలై ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేస్తుందట.
బీపీ : ఒత్తిడి ఎక్కువైనప్పుడు రక్తపోటు పెరుగుతుంది. అంతేకాకుండా వివిధ కారణాల వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రేమగా, ధైర్యాన్ని ఇచ్చే ఓ హగ్ బీపీని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్‌గా ఈ హగ్స్ ఇవ్వడం వల్ల బీపీ, గుండె సమస్యలు కూడా దూరమవుతాయట.
నొప్పి : గాయం వల్ల కలిగిన నొప్పి అయినా.. మానసికంగా వచ్చే నొప్పిని అయినా తగ్గించే లక్షణం హగ్స్కి ఉందని ఓ స్టడీ తెలిపింది. మీరు నొప్పితో బాధపడుతున్నప్పుడు పేరెంట్స్, ఫ్రెండ్స్, మీ లవ్ ఎవరైనా హగ్ ఇస్తే ఎండార్ఫిన్స్ విడుదలై.. సహజంగా నొప్పి దూరమవుతుందట. పూర్తిగా తగ్గకపోయినా.. మ్యాజికల్‌గా రిలీఫ్‌ని ఇస్తుందట.
నిద్ర : నచ్చిన వ్యక్తిని హగ్ చేసుకుని పడుకోవడం వల్ల మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. అందుకే ఎంత నిద్ర సమస్యలు ఉన్నా.. పేరెంట్స్ దగ్గర పడుకున్నప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతూ ఉంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో ఉన్నప్పుడు కూడా ఈ డిఫరెన్స్ చూడొచ్చు.
మానసిక ప్రయోజనాలు..
హగ్ చేసుకున్నప్పుడు ఫీల్ గుడ్ని ఇచ్చే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి మీ మూడ్‌ని రీసెట్ చేస్తాయి. డిప్రెషన్‌ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ప్రేమను, అవతలి వ్యక్తిపై ఫీలింగ్స్‌ని పెంచుతాయి. మీ బంధం మరింత బలపడతుంది. బంధాలు స్ట్రాంగ్ అవుతాయి. ఒత్తిడిని దూరం చేసి.. ధైర్యాన్ని అందించడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మీ మధ్య ఉన్న అపార్థాలను దూరం చేసి.. కమ్యూనికేషన్‌ని బెటర్ చేయడంలో హగ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మరిన్ని బెనిఫిట్స్ ఇవే
హగ్స్ ఒత్తిడిని తగ్గించి.. ఆక్సిటోసిన్ లెవెల్స్‌ని పెంచి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి.. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నమ్మకాన్ని పెంచి.. యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలిచ్చే హగ్ మీకు దొరికిందంటే నిజంగా మీరు అదృష్టవంతులే. పైగా ఈ హగ్‌కి ఏజ్ లిమిట్ లేదు. రొమాంటిక్‌గానే ఇచ్చేది కాదు. ఫిజికల్ టచ్‌తో ఎమోషన్ని ఇచ్చేది. పిల్లలనుంచి పెద్దల వరకు అందరికీ ఇది నిర్భయంగా ఇవ్వొచ్చు. అయితే మీరు హగ్ ఇచ్చే వ్యక్తి.. మీతో కంఫర్టబుల్ అనుకున్నప్పుడు మాత్రమే ఈ హగ్స్ ఇస్తే మంచిది. వారికి ఇష్టంలేకుండా ఇచ్చే హగ్ బెనిఫిట్స్ ఇవ్వడం కాదు.. ఇంకా స్ట్రెస్ పెంచుతుంది.
Also Read : కిస్ డే స్పెషల్, ముద్దులు ఎన్ని రకాలో తెలుసా? ఒక్కో ముద్దుకి ఒక్కో అర్థం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

