ఒక వ్యక్తి పట్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను తెలిపేందుకు హగ్స్ ఇస్తారు. అయితే మీకు ఇష్టమైన వ్యక్తిని వారి పర్మిషన్తో హగ్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదట. సంతోషం వచ్చినా.. బాధ వచ్చిన నచ్చిన వ్యక్తిని హగ్ చేసుకుంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు మనం పొందే హగ్ ఎంతో ఓదార్పునిస్తుంది. నచ్చిన వ్యక్తిని హగ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్లు తగ్గుతాయట. థైమస్ గ్రంధి పనితీరు మెరుగుపరిచి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. రక్తపోటును నియంత్రిస్తుంది. సెరోటోనిన్ హార్మోన్ విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుంది.