పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా బరువు పెరిగే మార్గాలను గురించి నిపుణుల సూచనలు, సలహాలు ఇక్కడ తెలుసుకుందాం.

బరువు పెరగాలంటే మనం ఖర్చు చేసే దానికంటే ఎక్కువ క్యాలరీలు కలిగిన పోషకాహారం తీసుకోవాలి.

ఇందులో పండ్లు, దుంపకూరలు, గింజధ్యాన్యాలు బ్రౌన్ రైస్, క్వినోవా వంటివి చేర్చుకోవచ్చు.

రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచేందుకు ప్రాసెస్డ్ ఫూడ్, చక్కెరలు తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా తేనే, పండ్లు చేర్చుకోవచ్చు.

కండర నిర్మాణానికి కొవ్వు తగ్గించే వ్యాయామాల మీద దృష్టి నిలపాలి. స్క్వాట్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ వంటి వంటి వర్కవుట్ చెయ్యాలి.

చేపలు, గుడ్డు, డైరీ, చిక్కుళ్ల వంటి ప్రొటీన్ రిచ్ ఫూడ్ తీసుకోవాలి. ఇవి ఆకలి నియంత్రణలో ఉంచుతాయి. కొవ్వు తగ్గిస్తాయి.

కార్డియో వర్కవుట్లు తగ్గించాలి. వీటితో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఎరొబిక్ వ్యాయామాలు ఎక్కువ చెయ్యాలి.

అవకాడో, ఆలీవ్ నూనె, గింజధాన్యాల వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులను ఆహారంలో చేర్చుకోవాలి.

కండర నిర్మాణానికి నిద్ర చాలా అవసరం. బరువు పెరగాలంటే కచ్చితంగా 7-9 గంటల నిద్ర ఉండాలి.

జీర్ణ క్రియ, పోషకాల శోషణ సమర్థవంతంగా ఉండాలంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలి.

రోజుకు 7-9 గ్లాసుల నీళ్లు తాగాలి.
Representational Image : Pexels