చలికాలంలో ఎండు కొబ్బరి తింటే... ఎండు కొబ్బరి కూడా ఒక రకమైన డ్రై ఫ్రూటే. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యమో, ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్కని తిన్నా కూడా అంతే ఆరోగ్యం. ఎండు కొబ్బరి గట్టిగా ఉంటుంది. నమలడానికి కష్టం. కాబట్టి వంటల్లో భాగం చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. దీనిలో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, కాపర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మెదడులో మైలీన్ అని అనే సమ్మేళనం ఉత్పత్తికి ఎండుకొబ్బరి సహాయపడుతుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మెదడులోని నరాలపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఎండుకొబ్బరి సహాయపడుతుంది. దీనివల్ల పక్షవాతం వంటివి రాకుండా ఉంటాయి. ఎంతో మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఎండు కొబ్బరిని తినడం వల్ల అనీమియా రాకుండా ఉంటుంది.