అరికెలు తింటే అంతా మంచే



చిరుధాన్యాల్లో అరికెలు కూడా ఒకటి. వీటిని ఒకప్పుడు విపరీతంగా వాడేవారు.



వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ నిండుగా ఉంటుంది.



అరికెలను తరచూ తినడం వల్ల జీర్ణ సమస్యలైనా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటివి రాకుండా ఉంటాయి.



మధుమేహంతో బాధపడేవారు అరికెలను కచ్చితంగా తినాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.



మహిళలు అరికెలను తరచూ తింటూ ఉండాలి. నెలసరి సమయంలో వచ్చే కొన్ని రకాల నొప్పులు, సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.



అధిక రక్తపోటుతో బాధపడేవారు కచ్చితంగా అరికెలను తినాలి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.



కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అరికలను తినడం వల్ల ఆ కొలెస్ట్రాల్ కరిగే అవకాశం ఉంటుంది.



నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా అరికలు సహాయపడతాయి.