టీ తాగితే మంచిది కాదు అనుకునేవారు బ్లాక్ టీ తాగొచ్చు. ఇది మీ శరీరానికి కావాల్సిన ఔషద గుణాలు అందిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులనుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, ఊబకాయం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహం నియంత్రణకై మీరు బ్లాక్ టీ తాగొచ్చు. Image Source : Unsplash