అన్వేషించండి

Google AI: దగ్గితే మీ వ్యాధి ఏంటో చెప్పేస్తుంది, గూగుల్ ఏఐ అద్భుతం

Artificial intelligence | వ్యాధిని నిర్ధారించాలంటే చాలా పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే దగ్గు శబ్దంతో వ్యాధి ఏంటో తేలబోతోంది. గూగుల్ ఏఐ టెక్నాలజీ వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.

Googles HeAR AI: ఏఐ టెక్నాలజీ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. వైద్య శాస్త్రంలోనూ ఈ కొత్త టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తోంది. కేవలం దగ్గు శబ్దంతో రోగం ఏంటో క్షణాల్లో చెప్పేస్తోంది. హియర్ ఫౌండేషన్ AI మోడల్ 300 మిలియన్ల ఆడియో డేటా, 100 మిలియన్ల దగ్గు శబ్దాలను ఉపయోగించి రోగం ఏంటో చెప్పగలిగి షాకిస్తోంది. మనం దగ్గితే వచ్చే శబ్దం ద్వారా టీబీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి వ్యాధులను గుర్తించే సామర్థ్యం ఉన్న AI మోడల్ ను గూగుల్ డెవలప్ చేసింది. గూగుల్ రీసెంట్ గా హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్(HeAR)ని పరిచయం చేసింది.

క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక ఫోకస్

నిజానికి ఓ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే.. వారిని ముందుగా చెక్ చేస్తారు. అనంతరం పరీక్షలు చేసి వ్యాధి ఏంటో నిర్థారిస్తారు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఏఐ టెక్నాలజీ డాక్టర్ కంటే వేగంగా ఫలితాలను అందిస్తోంది. ఇప్పటికే, బీపీ, హార్ట్‌ బీట్‌, షుగర్‌ లెక్కలు చెప్పే యాప్‌లు ఉండగా.. ఇప్పుడు దగ్గితే రోగమేంటో చెప్పే యాప్‌ సిద్ధమవుతున్నది. దగ్గిన శబ్దం వినగానే మనం ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామో ఇట్టే చెప్పేయనుంది ఈ యాప్‌.

ఈ యాప్‌లో వివిధ రకాల వ్యాధులతో వచ్చే మిలియన్ల కొద్దీ దగ్గుకు సంబంధించిన శబ్దాలను లోడ్ చేశారు. ఈ క్రమంలో దగ్గు శబ్దాల ద్వారా రోగికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ ఇట్టే చెప్పేయనుంది. టీబీ విషయంలో ఈ యాప్ మరింత సమర్థవంతంగా పని చేయనుంది. “క్షయవ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఆలస్యంగా రోగనిర్ధారణ కావడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  హియర్ కీలక పాత్ర పోషించనుంది. ఈ టెక్నాలజీ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది” అని హియర్‌లో పనిచేస్తున్న గూగుల్ రీసెర్చ్‌ ప్రొడక్ట్ మేనేజర్ సుజయ్ కకర్మత్ వెల్లడించారు.

క్షణాల్లోనే టీబీ స్క్రీనింగ్, డిటెక్షన్‌

2030 నాటికి టీబీనీ అంతం చేయాలనే లక్ష్యంతో గూగుల్ పని చేన్నది. అందులో భాగంగానే HeARను రూపొందించింది. దగ్గు శబ్దం అనేది ఒక్కో రోగానికి ఒక్కోలా ఉంటుంది. ఆ శబ్దాన్ని బేస్ చేసుకుని రోగం ఏంటో HeAR ఇట్టే చెప్పేయనుంది. ఈ టెక్నాలజీని మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కకర్మత్ తెలిపారు. రానున్న రోజుల్లో క్షణాల్లోనే కేవలం దగ్గు శబ్దం ద్వారా రోగం ఏంటో నిర్ధారించే అవకాశం ఉందన్నారు. HeARతో టీబీ స్క్రీనింగ్, డిటెక్షన్‌ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని డిజిటల్ హెల్త్ స్పెషలిస్ట్ జి జెన్ క్విన్ తెలిపారు. అత్యంత అవసరమైన వారికి ఈ టెక్నాలజీ సాయపడుతుందని వెల్లడించారు. గూగుల్ రూపొందించిన ఈ టెక్నాలజీ వైద్య రంగంలో కీలక ముందడుగు కాబోతుందన్నారు.

Read Also: ఓ మై గాడ్.. మెదడులోకి చొచ్చుకెళ్తోన్న ప్లాస్టిక్ - గ్లోబల్ ఎమర్జెన్సీ విధించాల్సిందేనట!

Read Also: లీకీ గట్‌ గురించి ఈ విషయాలు తెలుసా? ఇదిగో సమంత ఏం చెబుతుందో చూడండి

టాప్ హెడ్ లైన్స్

Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Embed widget