అన్వేషించండి

Nutrition Food : పిల్లల ఎదుగుదలకు ఇలాంటి ఆహారం కచ్చితంగా తీసుకోవాలట

Healthy Foods for Kids : పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టడం చాలా అవసరం. ఇది వారి ఎదుగుదలకు, పోషణ అందించేందుకు బాగా హెల్ప్ అవుతుంది. 

Kids Diet : పోషకాలతో కూడిన ఆహారం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాలా మంచిది. ఇది మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. శరీరంలోని కణాలు, కండరాలు కలిసి పనిచేయడానికి అవసరమైన శక్తిని పోషకాహారం అందిస్తుంది. కాబట్టి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే.. కచ్చితంగా మీరు పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు పోషకాలతో కూడిన ఫుడ్ అందించడంలో అస్సలు కాంప్రిమైజ్ కావొద్దు అంటున్నారు. అయితే మీరు పోషకాల కోసం పిల్లలకు ఎలాంటి ఫుడ్ అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పండ్లు, కూరగాయలు..

పండ్లు, కూరగాయలు వివిధ విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లతో నిండి ఉండి ఉంటాయి. ఇవి వివిధ రూపాల్లో, వివిధ రకాలుగా మనకు లభ్యమవుతాయి. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా పిల్లలో ఎదుగుదలకు.. జుట్టుకు పోషణ అందేలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి పిల్లలు నేరుగా వీటిని తినకపోతే.. సలాడ్స్ రూపంలో, జ్యూస్​ల రూపంలో వాటిని అందించవచ్చు. స్నాక్స్​గా కూడా వీటిని మీరు పిల్లలకు వీటిని అందించవచ్చు. 

సమతుల్యమైన ఆహారం

మీ పోషకాహార అవసరాలను తీర్చడానికి మీరు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లలకు ముందు నుంచి ఇలాంటి సమతుల్యమైన ఆహారం అందించడం ద్వారా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా రావు అంటున్నారు నిపుణులు. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. అలాగే తక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. సమతుల్యమైన ఆహారం తీసుకునేందుకు మీరు పోర్షన్ కంటైనర్​లు, ఫుడ్ స్కేల్స్, కప్స్​తో మీరు పోషకాహారాన్ని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు కేలరీలను కూడా బ్యాలెన్స్ చేయవచ్చు. 

బ్రేక్​ఫాస్ట్

ప్రతి రోజూ కచ్చితంగా పిల్లలు, పెద్దలు కూడా అల్బాహారం తీసుకోవాలి అంటున్నారు. కొందరు సమయం దొరకడం లేదనో.. వండుకోలేమనో కొందరు తినడం మానేస్తారు. పిల్లలు కూడా స్కూల్​కి లేట్​ అవుతుందని సరిగ్గా తినరు. కానీ రోజు మొత్తంలో బ్రేక్​ఫాస్ట్​ అస్సలు స్కిప్ చేయవద్దు అంటున్నారు ఆహార నిపుణులు. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. పోషకమైన, సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం వల్ల నిద్రలో పోగొట్టుకున్న పోషకాలను తిరిగి శరీరానికి అందించవచ్చు. దీనివల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్​గా ఉంటారు.

షుగర్ వద్దు 

స్వీట్ క్రేవింగ్స్ ఉండడం వల్ల చాలామంది తెలియకుండా స్వీట్స్ ఎక్కువగా తినేస్తారు. అయితే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు స్వీట్స్ తీసుకోవడం తగ్గించండి. ఇవి మీ ఆరోగ్యానికి అంతమంచివి కావు. ప్రాసెస్​ చేసిన ఫుడ్ ఉదయాన్నే తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఇలాంటి ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి అంటున్నారు. 

సప్లిమెంట్స్ తీసుకోండి.. 

సమతుల్యమైన ఆహారం మీ శరీరానికి అవసరమైన అన్ని మూలకాలను సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు ఈ పోషకాహారం పొందడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పోషకాలకోసం సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అయితే మీరు ఎలాంటి సప్లిమెంట్లు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనేదానికోసం వైద్యుడిని సంప్రదించండి. 

Also Read : రోజూ ఉదయాన్నే బాదం, వాల్​నట్​ తింటున్నారా? అయితే ఇది మీకోసమే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget