![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
మహిళలకు నరకం చూపే వ్యాధులివే - ఈ జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ బిందాస్!
స్త్రీలు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండలి. ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి అవసరమయ్యే మార్పులు జీవన శైలిలో చేసుకుంటూ ఉండడం అవసరం.
![మహిళలకు నరకం చూపే వ్యాధులివే - ఈ జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ బిందాస్! From eating disorders to pcos diseases that affect women's health మహిళలకు నరకం చూపే వ్యాధులివే - ఈ జాగ్రత్తలు పాటిస్తే లైఫ్ బిందాస్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/08/adf60207fac83ec608f0ed791427bc6c1691482679291560_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జీవితంలో ఒక్కో స్టేజ్ లో ఒక్కో రకమైన అనారోగ్యాలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీల జీవితంలో ఇది మరీ ఎక్కువ. ఒకసారి హార్మోనల్ మార్పులు, మరోసారి మెటాబోలిక్ మార్పులు.. ఇలా రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. మహిళల ఆరోగ్యానికి హాని కలిగించే ఆ సమస్యలేమిటో చూడండి.
పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ (పీసీఓడి)
పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ వల్ల స్త్రీల ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే పరిస్థితి దీని వల్ల బరువు పెరుగుతారు. నెలసరి క్రమం తప్పుతుంది. నెలసరి సమయంలో చాలా తీవ్రమైన కడుపునొప్పి కూడా ఉంటుంది. ఈపరిస్థితిని నివారించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి, క్రమం తప్పకుండా తగినంత వ్యాయామం చెయ్యాలి.
రక్త హీనత
ఇది భారతీయ మహిళల్లో చాలా సాధారణం. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది అనీమియాకు కారణం అవుతుంది. స్త్రీలు కచ్చితంగా ఐరన్ ఎక్కువగా కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం.
మెనోపాజ్
ఈస్ట్రోజన్ తగ్గడం వంటి హార్మోన్ల మార్పు మెనోపాజ్ లో తప్పకుండా ఏర్పడే పరిస్థితి. ఈస్ట్రోజన్ గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. నిరోధకవ్యవస్థ పనితీరు కూడా ఈస్ట్రోజన్ తగిన స్థాయిలో ఉన్నపుడు బావుంటుంది. మెనోపాజ్ స్టేజ్ లో త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
గుండె జబ్బులు
మనోపాజ్ స్థాయిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు, చిక్కుళ్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తప్పకుండా భోజనంలో భాగం చేసుకోవాలి. ఫలితంగా కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా నిరోధించవచ్చు.
బరువు పెరగడం
మెనోపాజ్ స్టేజ్ లో చాలా మంది స్త్రీలు బరువు పెరుగుతారు. ఇలా బరువు పెరగడం వల్ల బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి హెల్దీ డైట్ తో పాటు తగినంత వర్కవుట్ కూడా అవసరం.
మానసిక ఆరోగ్యం
చాలా మంది మహిళలు రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. ప్రసవం తర్వాత వచ్చే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అందులో ఒకటి. ఇలాంటివి రాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం.
టీనేజ్ అమ్మాయిలు తాము ఎలా కనిపిస్తున్నామనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. శరీరాకృతి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. బరువు పెరగకూడదని తినే తిండి చాలా తగ్గించేస్తారు. ఇది వారిలో పోషకాహార లోపాలకు కారణం అవుతుంది. టీనేజ్ లో ఉన్నపుడు ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం అవసరం. కచ్చితంగా ఆరోగ్యాన్ని ఇచ్చే సమతుల పోషకాహారం తీసుకోవడం అవసరం.
ఎముకల ఆరోగ్యం
వయసు 30 దశకం చివరకు చేరినప్పటి నుంచి కూడా మహిళలల్లో ఎముకలు బలహీన పడడం మొదలవుతుంది. అందుకే ఆ వయసు తర్వాత నుంచి మహిళలు తప్పకుండా కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఆహారం మీద దృష్టి పెట్టాలి. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమయ్యే పోషకాలు. లేదంటే ఎముకల సాంద్రత తగ్గిపోయ్యే ప్రమాదం ఉంటంది.
Also read : నిద్ర పట్టడం లేదా, మీ జుట్టు ఇలా మారుతోందా? ప్రోటీన్ లోపం కావచ్చు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)