By: ABP Desam | Updated at : 13 Apr 2023 06:00 AM (IST)
Image Credit: Youtube(Hebbars Kitchen)
కొన్ని కూరగాయలు ఒక్కో సీజన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఆఫ్ సీజన్ సమయంలో కూడా మనకు ఇష్టమైన కూరగాయలు కావాలని అనిపిస్తుంది. కానీ అవి మార్కెట్లో అందుబాటులో లేనప్పుడు కూడా వాటిని వంటల్లో ఉపయోగించే మార్గం ఉంది. బఠానీలు, క్యారెట్, బచ్చలికూర శీతాకాలంలో సమృద్ధిగా లభించే కొన్ని సాధారణ కూరగాయలు. కానీ ఇవి వేసవిలో దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. అలా కాకుండా మీకు నచ్చిన కూరగాయలు ఫ్రీజింగ్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. వాటిని ఆఫ్ సీజన్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. పోషకాలు పోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు ఇలా చేయండి.
బఠానీలు
తాజా ఆకుపచ్చ రంగులో ఉండే బఠానీలు మీరు ఫ్రీజింగ్ చేయాలని అనుకుంటున్నారా? రెండు కిలోల బఠానీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత మొత్తం నీటిని తీసివేయాలి. ఒక కుండలో నీటిని నింపి ఉడకబెట్టుకోండి. రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది బఠానీలను కొంచెం మృదువుగా చేస్తుంది. తర్వాత వాటిని ఐస్ వాటర్ నింపిన గిన్నెలో వాటిని వేసుకోవాలి. బఠానీలు పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక టవల్ మీద వాటిని వేసి తేమ పోయేలా చేసుకోవాలి. గాలిలో కూడా ఆరబెట్టుకోవచ్చు. జిప్ లాక్ బ్యాగ్ లో బఠానీలు వేసుకుని గాలి లేకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఫ్రీజలో ఉంచుకోవచ్చు. సుమారు 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
క్యారెట్
క్యారెట్ పై తొక్క అంచులు తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తగినంత నీరు తీసుకుని అందులో తరిగిన క్యారెట్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐస్ వాటర్ లోకి మార్చుకుని చల్లారిన తర్వాత పొడి వస్త్రం తీసుకుని తేమ లేకుండా తుడవాలి. కొన్ని గంటల తర్వాత గాలి చొరబడని కంటైనర్ లేదా జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకుని ఫ్రీజర్ లో ఉంచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడల్లా వాటిని తీసుకుని వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.
పాలకూర
కూరగాయలు మాత్రమే కాదు ఆకుకూరలు కూడా ఫ్రీజింగ్ చేసి పెట్టుకోవచ్చు. సాధరణంగా ఆకుకూరలు ఫ్రిజ్ లో పెడితే రెండు రోజులకే వడిలిపోవడం లేదంటే పాచి పట్టడం జరుగుతుంది. కానీ పాలకూర మాత్రం ఫ్రీజింగ్ చేసుకుని పెట్టుకోవచ్చు. వాటి కాడలు కత్తిరించి శుభ్రం చేసుకోవాలి. మరిగే నీటిలో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఐస్ వాటర్ లోకి మార్చుకోవాలి. చల్లారిన తర్వాత నీటిని శుభ్రంగా పిండేసి టవల్ మీద ఆరబెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే వాటి తాజాదనం, పోషకాలు తగ్గిపోవు. రుచి కూడా అద్భుతంగా ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఎక్కిళ్లు అతిగా వస్తున్నాయా? జాగ్రత్త, ఆ ప్రమాదకర వ్యాధికి అది సంకేతం!
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
Children Health: పిల్లలకి ఫీవర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు
Heatstroke: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్