అన్వేషించండి

Alia Bhatt Makeup Look : అందంగా కనిపించాలంటే.. ఆలియా భట్ మేకప్​ లుక్​ని ఫాలో అయిపోండి

Strawberry Makeup Look : మీకు మేకప్ ఎక్కువ నచ్చదా? కానీ తప్పనిసరిగా మేకప్​ వేసుకోవాల్సిన అవసరం ఉందా? అయితే మీరు ఆలియా భట్ తరహాలో స్ట్రాబెర్రీ మేకప్​ లుక్​ని ఫాలో అయిపోండి. 

New Makeup Trend 2024 : న్యూ మేకప్​ లుక్స్​ని ట్రై చేయడంలో, సింపుల్​ టిప్స్​తో ఎలిగెంట్​గా కనిపించడంలో ఆలియా భట్ ఎప్పుడూ ముందుంటుంది. ట్రై చేయడమే కాదు.. పలు వీడియోల ద్వారా వాటిని ఫ్యాన్స్​కు కూడా పరిచయం చేస్తుంది. అలా రీసెంట్​గా స్ట్రాబెర్రీ మేకప్​ లుక్​తో ఆలియా వీడియో చేసింది. ఎక్కువ సమయం తీసుకోకుండా.. తక్కువ టైమ్​లో సింపుల్, ఎలిగెంట్​గా కనిపించాలనుకుంటే మీరు కచ్చితంగా ఆలియా భట్ మేకప్​ లుక్​ని ట్రై చేయవచ్చు. 

ఆలియా మినిమల్ మేకప్, న్యూడ్ మేకప్​ లుక్​ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆమె మేకప్ లుక్స్ చూసినా ఇదే అర్థమవుతుంది. ఎక్కువ మేకప్​తో చర్మం పాడైపోతుందని.. కానీ తక్కువ మేకప్​తో అద్భుతమైన లుక్స్ పొందవచ్చు అంటుంది ఈ బీటౌన్ బ్యూటీ. అలాగే ఈ స్ట్రాబెర్రీ మేకప్​ ట్రెండ్​ని తెరపైకి తీసుకొచ్చింది. ఆమె ట్రెడీషనల్​ లుక్​కోసం ఈ స్ట్రాబెర్రీ మేకప్​ వేసుకుంది కానీ.. దీనిని మీ రెగ్యూలర్​ మేకప్​ కోసం కూడా ఫాలో అవ్వొచ్చు. ఎక్కువ మేకప్ ఇష్టపడని, మినిమల్ మేకప్​ లుక్​ కోసం ఎదురు చూసే వాళ్లంతా ఈ ట్రెండ్​ని ఫాలో అవ్వొచ్చు. ఈ స్ట్రాబెర్రీ మేకప్ అంటే ఏమిటి? దానిని ఎలా ఫాలో అవ్వాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

స్ట్రాబెర్రీ మేకప్​ లుక్​లో గోల్డెన్, స్ట్రాబెర్రీ టోన్స్ ఉంటాయి. మీరు ఫెస్టివల్​ కోసం, పార్టీలకోసం, లేదంటే మీ రోటీన్​లుక్​కి బ్రేక్ చెప్పాలనుకుంటే దీనిని ఫాలో అవ్వొచ్చు. దీనికి ఎక్కువ మేకప్​ కూడా అవసరం లేదు. అయితే కొన్ని టిప్స్ మాత్రం కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే ఈ మేకప్​ లుక్​ కచ్చితంగా మీ చేదు అనుభవాలు ఇస్తుంది. ఇంతకీ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? ఎలా అప్లై చేయాలి?

స్కిన్ టింట్​తో..

మేకప్​ అంటే ఫౌండేషన్​ను కచ్చితంగా ఉపయోగిస్తారు. మేకప్​కు బేస్​నే ఫౌండేషన్ అంటారు. అయితే ఈ స్ట్రాబెర్రీ మేకప్​ లుక్​ కోసం ఫౌండేషన్ ఉపయోగించరు. దీని స్థానాన్ని స్కిన్​ టింట్​తో భర్తీ చేయాలి. మీ స్కిన్ టోన్​కి సెట్​ అయ్యే స్కిన్​ టింట్​ని ఎంచుకోండి. ఇది మీకు హెవీ లుక్​ ఇవ్వకుండా.. సహజంగా మెరిసే, క్లిసల్ క్లియర్ చర్మాన్ని మీకు అందిస్తుంది. 

బ్లష్​తో మ్యాజిక్..

మేకప్​ అయిపోయాక ముఖం గ్లామ్​ను మరింత పెంచుకునేందుకు బ్లష్ ఉపయోగిస్తారు. అయితే ఈ మేకప్​ లుక్​లో బ్లష్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మేకప్​ లుక్​ కోసం మీరు లిక్విడ్ బ్లష్ తీసుకోవాలి. దీనిని ముక్కు, నుదిటికి రెండు వైపులా కవర్ చేసేలా.. W షేప్​లో బుగ్గల మీదుగా బ్లష్ అప్లై చేయాలి. ఇలా రాసిన తర్వాత బ్లెండర్​ను ఉపయోగించి.. బ్లష్​ను బాగా బ్లెండ్ చేయండి. 

ఐ మేకప్

బ్లష్​ను కేవలం ముఖానికే కాదు.. ఐ మేకప్​ కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. మీ కనురైప్పలపై కాస్త లిక్విడ్ బ్లష్ అప్లై చేయండి. దానిని రెండువైపులా సమానంగా అప్లై చేయండి. ఇప్పుడు బ్లష్ షేడ్​కి మ్యాచ్​ అయ్యే మెరిసే ఐ షాడోతో టాప్​ చేయండి. ఇది మీకు మెరిసే, అందమైన లుక్​ని ఇస్తుంది. 

పెదాల కోసం

పెదాలకు లిప్​ గ్లాస్​ లేదా టింట్​ను అప్లై చేయాలి. దీనికంటే ముందు మీ పెదవులకు మ్యాచ్ అయ్యే లిప్​ లైనర్​ ఉపయోగించండి. ఇది మీ పెదాలను లైన్​ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీ లుక్​ని ఎలివేట్​ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి లిప్​ గ్లాస్​ అప్లై చేసే ముందు లైనర్​ ఉపయోగించండి. 

హైలైటర్

తక్కువ మేకప్​తో సహజమైన మెరుపును పొందాలంటే కచ్చితంగా హైలైటర్​ ఉపయోగించాలి. ఇది మీరు సహజంగా గ్లో అయ్యేలా చేస్తుంది. అయితే మీరు మీ స్కిన్​ కలర్​తో హైలైటర్​ను మిక్స్ చేసి అప్లై చేయవచ్చు. 

ఈ సింపుల్ స్టెప్స్​తో మీ మేకప్​ లుక్​ రెడీ అయిపోతుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అద్దం ముందు గంటల తరబడి కూర్చొనవసరం లేదు. సింపుల్​గా, ఎలిగేంట్​గా, సహజంగా మీరు గ్లో అయ్యేలా చేస్తుంది ఈ మేకప్ లుక్. కాబట్టి మీకు నచ్చిన ఈవెంట్ల సమయంలో లేదా ఆఫీస్​ లేదా కాలేజ్​కి వెళ్లే సమయంలో ఈ ట్రెండీని ఫాలో అయిపోవచ్చు. 

Also Read : ఈ సహజమైన ప్యాక్స్​తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget