IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Sleeping Tips: ఇది ఆర్మీ టెక్నిక్.. ఇలా చేస్తే 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు

ఎప్పుడూ సరిహద్దుల్లో, ప్రతికూల వాతావరణంలో ఉండే సైనికులు ఎలా నిద్రపోతారు. వారు పాటించే టెక్నిక్ మనకు కూడా ఉపయోగపడుతుందా? ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ ఏం చెప్పారో చూడండి.

FOLLOW US: 

ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదా? నిద్ర కోసం మీరు మాత్రలు మింగుతున్నారా? వాటితో పనిలేకుండానే మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఇందుకు మీరు మిలటరీ టెక్నిక్ పాటిస్తే చాలు. ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ జస్టిన్ అగస్టిన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ టెక్నిక్.. ఇప్పుడు ఎంతమందికి ఉపయోగపడుతోంది. మీకు కూడా ఈ టెక్నిక్‌తో మాంచి నిద్ర పట్టవచ్చేమో ప్రయత్నించండి. 

మనకంటే.. ఇంట్లో ప్రత్యేకంగా బెడ్ రూమ్స్ ఉంటాయి. హాయిగా నిద్రపోవడానికి మంచాలు ఉంటాయి. ఇన్ని ఉన్నా సరే చాలామందికి నిద్ర పెద్దగా పట్టదు. కానీ, సరిహద్దుల్లో మన కోసం పహారా కాసే సైనికులు నిద్రపోవడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. కేవలం రాళ్లు, రప్పలు లేదా చెట్టు కిందే నిద్రపోవాలి. పైగా అక్కడ అసౌకర్యమైన వాతావరణం ఉంటుంది. యుద్ధాలు జరిగేప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పెద్ద శబ్దాలు, పేలుళ్లు కంటి మీద కనుకును దూరం చేస్తాయి. కానీ, రోజంతా పహారా కాసేందుకు శక్తి ఉండాలంటే తప్పకుండా కొన్ని నిమిషాలైనా నిద్రపోవాలి. అందుకే, సైనికులు షిఫ్టుల వారీగా నిద్రపోతుంటారు. అయితే, వారికి అలాంటి వాతావరణంలో నిద్ర ఎలా పడుతుంది? ఇందుకు టెక్నిక్ ఉంది. అదేంటో చూడండి.  

వాస్తవానికి సైన్యంలో.. ఫైటర్ పైలట్‌లు నిద్రపోవడం కోసం ఈ టెక్నిక్‌ను ప్రవేశ పెట్టారు. ఎందుకంటే.. వారు నిఘా, యుద్ధ సమయంలో తప్పకుండా ఫోకస్ పెట్టాలి. ఒక వేళ వారికి సరైన నిద్రలేకపోతే సమస్యల్లో పడతారు. అందుకే వీరి నిద్రపోవడానికి ముందు పూర్తిగా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. తల నుంచి కాలి వరకు శరీర సడలిస్తారు. ఆ తర్వాత ముఖంలోని నుదిటి కండరాలను కూడా రిలాక్స్ చేస్తారు. నుదిటిని బిగపడితే.. కళ్లు మూయడం కష్టం.

కళ్లు, బుగ్గలు, దవడలను కదపకుండా రిలాక్స్‌గా ఉంచండి. ఆ తర్వాత శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఆ తర్వాత మీ మెడ, భుజాల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడండి. భుజాలను బిగపట్టకుండా లూజుగా వదలండి. వాటిపై ఎలాంటి ఒత్తిడి వేయకండి. మీ చేయి, వేళ్లను కూడా వదులుగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఓ వెచ్చని అనుభూతి లభిస్తుంది. తల నుంచి చేతి వేళ్ల వరకు శరీరం ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది. లోతైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా ఊపిరి పీల్చండి. ఆ సమయంలో మీ ఛాతి, కడుపు, తొడలు, మోకాలు, పాదాలు కదలకూడదు. అలాగని వాటిని బిగపెట్టకూడదు కూడా. ఆ సమయంలో మీరు మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మరే విషయం గురించి ఆలోచించకూడదు. ఒత్తిళ్ల నుంచి మీ మనస్సును తేలికపరుచుకోవాలి. ఇందుకు మీరు రెండు దృశ్యాలను ఆలోచించండి. 

‘‘మీరు ప్రశాంతమైన సరస్సులో ఓ పడవలో పడుకున్నారు. మీ పైన నీలి ఆకాశం తప్ప మరేది లేదు’’ అని ఊహించుకోండి. లేదా.. ‘‘మీరు నల్లని గదిలో.. ఓ ఊయలలో పడుకున్నట్లు భావించండి. ఆ సమయంలో మీకు ఏదైనా ఆలోచన వస్తే.. కనీసం 10 సెకన్లపాటు ‘‘ఆలోచించవద్దు, ఆలోచించవద్దు, ఆలోచించవద్దు’’ అని అనుకోండి. ఇలా కనీసం ఆరువారాలు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటైపోతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలోకి జారుకుని రిలాక్స్ కావచ్చు. కళ్లు మూసుకున్న రెండు నిమిషాల్లోనే నిద్రాలోకంలో విహరిస్తారు. అగస్టిన్ చెప్పిన ఈ టెక్నిక్‌ను చాలామంది ఫాలో అయ్యారు. నిజంగానే అది పనిచేస్తోందని, త్వరగా నిద్రపడుతోందని చెబుతున్నారు. మీరు కూడా ప్రయత్నించి.. ఆ టెక్నిక్ పనిచేస్తుందో లేదో మాకు చెప్పండి. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఉపయోగపడవచ్చు. ఆ స్లీపింగ్ టెక్నిక్‌ను ఈ కింది వీడియోలో చూడండి. 

Published at : 21 Jan 2022 08:54 PM (IST) Tags: Sleeping Problems Sleeping Tips Army Sleeping technique Army Technique for Sleeping Sleeping Technique How to sleep నిద్రకు చిట్కాలు

సంబంధిత కథనాలు

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!