Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Surviving Extreme Cold : చలి పెరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Extreme Cold Weather Survival Tips : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పర్లేదు అనేసరికి వర్షం కూడా తోడై.. చలిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ సమయంలో బయటికి వెళ్తే.. అంతే సంగతులు. ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్లేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చలిని అధిగమించేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?
చలి ఎక్కువగా ఉన్నప్పుడు హైపోథెర్మియా వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే బ్రీతింగ్ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హార్ట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. చర్మం కందిపోవడం, పాలిపోవడం జరుగుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే చలి పెరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కూల్ డ్రింక్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. చలిని అధిగమించేందుకు చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. లేదా శరీరానికి ఎక్కువ పని చెప్పాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై వేడి పుడుతుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
నీటిని తాగాలి
చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు నీటిని తక్కువ తాగుతారు ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే చల్లని వాతావరణం మిమ్మల్ని డీహైడ్రేట్ చేసి.. గుండె సమస్యలు పెంచుతుంది. కాబట్టి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగేలా చూసుకోండి. నీటికి బదులుగా హెర్బల్ టీలు, గ్రీన్ టీ, లెమన్ టీ, సూప్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు వెచ్చదనాన్ని, హైడ్రేషన్‌ని అందిస్తాయి.
ఫుడ్ విషయంలో
చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీని, మెటబాలీజంని పెంచే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. పండ్లు, కూరగాయల్లో ఈ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా కూడా హెల్ప్ చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. జీర్ణ సమస్యలు రాకుండా.. వాటిలోని ఫైబర్, విటమిన్స్, మినరల్స్ హెల్ప్ చేస్తాయి. సరిగ్గా కుక్ చేయని నాన్‌వెజ్ తింటే జీర్ణ సమస్యలు, కడుపులో మంట ఎక్కువ అవుతాయి. ఇవి చలి ఎఫెక్ట్‌ని మరింత పెంచుతాయి.
స్టీమ్ బెస్ట్ ఆప్షన్
దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా స్టీమ్ తీసుకోవచ్చు. దీనివల్ల చలి కూడా తగ్గుతుంది. వెచ్చని అనుభూతి మీ సొంతమవుతుంది. అయితే కంఫర్ట్‌గా ఉంటుందని ఎక్కువసేపు స్టీమ్ తీసుకోకపోవడమే మంచిది. దీనివల్ల ముక్కు, గొంతులో సమస్యలు వచ్చే అవకాశముంది.
దుస్తుల విషయంలో..
చలికాలంలో బాడీ రివిల్ చేయడం కాకుండా.. ఫుల్‌గా కవర్ చేసుకుంటే మంచిది. అలా అని పెద్ద పెద్ద స్వెటర్స్ వేసుకోవాలని కాదు.. కంఫర్ట్‌బుల్‌గా ఉండే దుస్తులను లేయరింగ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. ఇలా శరీరాన్ని కప్పుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే.. వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశలు ఎక్కువగా ఉంటాయి.
ఇంటి నుంచి బయటకు వెళ్తే..
చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. కానీ అత్యవసర, తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీని ఫుల్‌గా కవర్ చేసేలా దుస్తులను వేసుకోవాలి. ముఖానికి మాస్క్, తలకు స్కార్ఫ్, చేతులకు గ్లౌవ్‌లు వేసుకోవాలి. దుస్తులు తడిస్తే వాటిని వీలైనంత త్వరగా మార్చేసుకోండి. లేదంటే చలి ఎక్కువైపోతుంది. శరీరానికి రక్తప్రసరణ పెంచేలా.. వాకింగ్, స్ట్రెచ్‌లు వంటివి చేయండి. ఇవన్నీ మిమ్మల్ని కోల్డ్ వెదర్ నుంచి కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి.
Also Read : మహిళల్లో పొట్ట పెరగడానికి కారణాలివే.. ఫ్లాట్ బెల్లీ కోసం ఈ డ్రింక్స్ తాగేయండి