అన్వేషించండి

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికైనా టైమ్ మార్చుకోండి

వేళకు భోంచెయ్యడం, వేళకు నిద్ర పోవడం, తగినంత వ్యాయామం చెయ్యడం వంటివెపుడు ఆరోగ్యాన్నిచ్చే అలవాట్లే కానీ వేళదాటి తినడం అలవాటుగా మారితే ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

శరీర బరువు అనేది తీసుకునే ఆహారం మీదే దాదాపుగా 80 శాతం ఆధారపడి ఉంటుంది. మిగిలిన 20 శాతం వర్కవుట్ ద్వారా కంట్రోల్ లో పెట్టడం సాధ్యపడుతుంది. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, తిన్నదాన్ని ఎలా అరిగించుకుంటున్నాము అనేవి బరువు పెరిగే విషయం మీద ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఏ సమయంలో తింటున్నాము అనేది కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయని నిరూపిస్తున్నారు.

రాత్రి పూట ఆలస్యంగా భోంచెయ్యడం వల్ల బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఇప్పటికి చాలా అధ్యయనాలు రుజువులు చూపాయి. చీకటి పడిన తర్వాత మంచింగ్ చెయ్యడం వల్ల మనం ఎన్ని కెలోరీలు బర్న్ చేస్తున్నాము, ఎంత ఆకలితో ఉన్నాము, మన శరీరం నిల్వ చేసుకునే విధానం వీటన్నిటిని నేరుగా ప్రభావితం చేస్తుందని కొత్త అధ్యయనం కొత్త విషయాలను వెల్లడి చేస్తోంది.

రోజులో చివరి భోజనం ఏ సమయంలో తింటారు అనేదానికి మీరు బరువు పెరగడానికి మధ్య లింక్ ఉందని శాస్త్రవేత్తలు ఇది వరకే రుజువులు చూపారు. ఇప్పుడు ఆ విషయం గురించి అవగాహన కలిగిస్తున్నారు. అధిక బీఎంఐ ఉన్న 16 మందిని ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా చేసి సిక్స్ డే టెస్టులు చేశారు. వారు ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి విషయాల్లో చాలా కఠినంగా నియంత్రించారు.

ఒక గ్రూప్ లో వారికి రోజుకు మూడు సార్లు భోజనం ఇచ్చారు. ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గంటకు భోజనం, సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం ఇచ్చారు. మరో గ్రూప్ లో వారికి మధ్యాహ్నం 1 కి అల్పాహారం, 6 గంటలకు రాత్రి భోజన, 9 గంటలకు మరోసారి భోజనం ఇచ్చారు.

రక్త పరీక్ష ద్వారా కడుపు నిండుగా ఉన్నపుడు శరీరంలో ఉండే హార్మోన్ లెప్టిన్ స్థాయిలను పరీక్షించినపుడు ఇవి రెండో గ్రూప్ వారిలో 24 గంటల పాటు తక్కువే ఉన్నట్టు వచ్చిందట. అంటే వీరు ఎప్పుడూ ఆకలిగా ఉన్నారని అర్థం. ఈ హార్మోన్ తక్కువగా ఉంటే ఎక్కువ తినేసే ఆస్కారం ఉంటుంది. అంతేకాదు క్యాలరీలు కూడా చాలా నెమ్మదిగా ఖర్చవడాన్ని గమనించారట.

సమయం దాటిన తర్వాత తినడం వల్ల అడిపోజెనిసిస్ ద్వారా ఎక్కువ కొవ్వు నిల్వ ఉంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవ్వును విచ్ఛిన్నం చేసే లిపోసిస్ కూడా నెమ్మదించినట్టు గుర్తించారట. కేవలం భోంచేసే సమయాలు మారినందువల్ల కూడా శరీర బరువు పెంచుతాయని బరువు పెరగడం రకరకాల అనారోగ్యాలకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధ్యాహ్నం నాలుగు తర్వాత తినడం వల్ల మన ఆకలి స్థాయిలో గణనీయమైన తేడా గమనించామని తిన్న తర్వాత క్యాలరీలను బర్న్ చేసే విధానం, కొవ్వు నిల్వ చేసే విధానంలో గణనీయమైన తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా తినడం వల్ల శక్తి సమతుల్యత సరిగా లేకపోవడం వల్ల ఊబకాయం ప్రమాదం కూడా పెరిగిపోతుందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read : ఒళ్లు పెరిగితే ఆరోగ్యం గుల్ల - హెల్దీగా కనిపించినా క్యాన్సర్ ముప్పు తప్పదట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Daaku Maharaaj Pre Release Event Cancelled: 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Daaku Maharaaj Pre Release Event Cancelled: 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్... తిరుపతి ఘటన నేపథ్యంలో
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Hyderabad News: పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
Tirupati Stampede: 'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
Embed widget