అన్వేషించండి

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే చక్కెరతో కలిపిన ఆహార పదార్థాలు తక్కువగా తినాలి.

కూల్ డ్రింకులు, స్వీట్లు, బేకరీ ఆహారాలు, ఐస్ క్రీములు, బిస్కెట్లు, చాక్లెట్లు... వీటన్నింటిలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే ఎన్నో పానీయాలలో కూడా చక్కెర తప్పనిసరిగా కలుపుతున్నారు. రోజువారి ఆహారంలో చక్కెరను అధికంగా తింటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇలా ఎవరైతే చక్కెరను అధికంగా తింటారో భవిష్యత్తులో వారికి కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం, ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం, మధుమేహం, గౌట్ వంటి వాటి వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య వస్తుంది. అలాగే చక్కెర కలిపిన ఆహారాలు తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అమెరికా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో ఎవరు ఎలాంటి ఆహారాలు తింటారో డేటాను సేకరించారు. వారిలో ఎవరైతే చక్కెర కలిపిన పదార్థాలను అధికంగా తింటున్నారో వారు 88% కిడ్నీ రాళ్ల సమస్య బారిన పడుతున్నట్టు గుర్తించారు.

చక్కెర అధికంగా తినడం వల్ల శరీరంలో క్యాల్షియం, ఆక్సలేట్ వంటి వాటి మోతాదులు పెరిగిపోతాయి. అవి మూత్రంలో పోగు పడతాయి. చివరికి చిన్న రాళ్లల్లా, స్పటికాల్లా మారతాయి. అవి కిడ్నీలో, మూత్రనాళంలో చేరి రాళ్లుగా స్థిరపడతాయి. అందుకే ఎక్కువ చక్కెర వేసిన ఆహార పదార్థాలను తినడం చాలా వరకు తగ్గించుకోవాలి. చక్కెరతో చేసిన ఆహారాలు తినకపోయినా శరీరానికి ఎలాంటి నష్టమూ లేదు. అంతగా మీకు తీపి తినాలనిపిస్తే బెల్లంతో చేసిన పదార్థాలను తినేందుకు ప్రయత్నించండి.

చక్కెరతో నిండిన ఆహారాలు అధికంగా తినడం వల్ల శరీరం బరువు కూడా పెరిగిపోతుంది. శరీరం బరువు పెరిగితే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి జబ్బులు త్వరగా వస్తాయి. వాటితో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కెర నుండి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. చక్కెర నిండిన ఆహారాలు తినడం వల్ల దంత క్షయం కూడా వస్తుంది. దంత క్షయంతో పాటు నోటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి  చక్కెరకు గుడ్ బై చెప్పి తాజా పండ్లు, కూరగాయలు తినేందుకు ఆసక్తి చూపించాలి. ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడతాయి. దీని వల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చక్కెర ఎంత తక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది. రక్తంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే చక్కెరను మానేయాలి. 

Also read: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget