High Cholesterol: ఈ ఐదు పండ్లు మీ అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసేస్తాయ్
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోకపోతే గుండె జబ్బుల బారిన పడుతున్నట్టే.
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళ సంఖ్య రోజూ రోజుకి పెరిగిపోతోంది. అందుకు కారణం మితిమీరిన తిండి, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి కావచ్చు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత జబ్బులకి మూల కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది శరీరం మొత్తం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పొట్ట, పిరుదులు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోయి మనం బరువు పెరిగేంత వరకు అర్థం కాదు. వికారం, అధిక రక్తపోటు, ఛాతీ బరువుగా అనిపించడం, లావు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట వంటివి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనేందుకు సంకేతాలు. కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో సతమతమవుతున్న వాళ్ళు ఏవి తినాలన్నా సంకోచిస్తారు. కానీ ఈ ఐదు పండ్లను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు,
టమాటా: పండ్లు, కూరగాయల ఉత్తమ కలయిక ఇది. టమోటాలో విటమిన్స్ ఎ, బి, సి, కె ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకి మేలు చేస్తుంది.
బొప్పాయి: బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా రక్తపోటుని నియంత్రించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ పచ్చి బొప్పాయిని ఏదో ఒక రూపంలో ఆహారంలో మిళితం చేసుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటు కలిగే అవకాశాన్ని తగ్గిస్తాయి. పచ్చి బొప్పాయిలో కూడా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బి, సి, ఇ విటమిన్లు నిండుగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం కూడా లభిస్తాయి.
అవకాడో: కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి వైద్యులు ఎక్కువగా అవకాడో తినమని సిఫార్సు చేస్తుంటారు. గుండెని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీడియం సైజ్ అవకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వులు, 4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.
యాపిల్: రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి ఏంటో మేలు చేసే అద్భుత గుణాలు ఉన్న పండు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకి హాని కలిగించే అనేక వ్యాధులను దూరం చేస్తుంది.
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లు అన్నీ సిట్రస్ పండ్ల జాబితలొకే వస్తాయి. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఇవి సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదకరమైన రోగాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ ను కరిగించాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు కూరగాయల్లో క్యారెట్ ఎక్కువగా తీసుకుంటే గుండెకి చాలా మేలు చేస్తుంది. క్యారెట్ తినడం వల్ల రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తాయి. క్యారెట్ ను జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు లేదంటే పచ్చి వాటిని ఉదయం, సాయత్రం తింటే ఆరోగ్యానికి మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ ‘టీ’లు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయ్, ట్రై చేసి చూడండి
Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం