అన్వేషించండి

Cancer: రోజూ వీటిని తిన్నారంటే క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది

క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఆహారం చక్కని మార్గమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యానికి మంచిది. ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. మనం తినే ఆహారం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల శక్తి ఆహారానికి ఉంటుంది. మీరు తినే కొన్ని ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్ అభివృద్ధి చాలా ప్రభావితమవుతుందని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అందించమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

బ్రకోలి

బ్రకొలీ అనేది సల్ఫోరాఫేన్‌తో కూడిన క్రూసిఫెరస్ కూరగాయలు. అత్యంత శక్తివంతమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉన్న మొక్కల సమ్మేళనం. నేషనల్ లైబారీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం సల్ఫోరాఫేన్ రొమ్ము క్యాన్సర్ కణాల పరిమాణాన్ని 75 శాతం వరకు తగ్గిస్తుంది. బ్రకొలి కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ పోరాట ప్రయోజనాలు పొందటానికి వైద్యులు ప్రతివారం బ్రకొలి తినాలని సిఫార్సు చేస్తున్నారు.

కూరగాయల్లో కెరొటీనాయిడ్స్, విటమిన్ సి, గ్లూకోసినోలెట్స్, ఫోలేట్, డైటరీ ఫైబర్, ఫ్లేవనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ వాస్కులర్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.

టొమాటో

ప్రపంచ వంటకాల్లో ప్రధానమైనవి టొమాటోలు. రుచికరమైనవి అలాగే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ తో ఉంటుంది. అందుకే దానికి ఎరుపు రంగు ఉంటుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం లైకోపీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది గణనీయంగా నిరూపించాయి.

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం లైకోపీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తుంది. అలాగే కార్సినోజెనిసిస్ పెరుగుదలను నిరోధిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. శాండ్ విచ్, సలాడ్ లేదా సాస్ కి జోడించడం ద్వారా ప్రతి రోజు టొమాటోలను తీసుకోమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. వివిధ అధ్యయనాల పర్కారం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. వెల్లుల్లి క్రమం తప్పకుండా తినడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో 2-5 గ్రాముల తాజా వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

బీన్స్

ఫైబర్, ప్రోటీన్లతో కూడిన బీన్స్ కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఈ సమస్య కలిగిన చరిత్ర ఉన్న వ్యక్తులు తప్పకుండా బీన్స్ ని ఆహారంలో తీసుకోవడం వల్ల కణితి పునరావృతమయ్యే ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు. పింటో, రెడ్ కిడ్నీ బీన్స్ వంటి కొన్ని రకాల బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

బచ్చలికూర

బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్ సి ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాలని అభివృద్ధి చేయకుండా రక్షణగా పని చేస్తుంది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో సహాయపడతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఎముకల ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరిగా తినాల్సిందే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gond Katira : వేసవిలో గోంఢ్ కటిరా వల్ల కలిగే లాభాలు ఇవే.. ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు?
వేసవిలో గోంఢ్ కటిరా వల్ల కలిగే లాభాలు ఇవే.. ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు?
Blood Sugar : రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచే టాప్ 5 పండ్లు ఇవే.. జాగ్రత్తగా తినండి
రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచే టాప్ 5 పండ్లు ఇవే.. జాగ్రత్తగా తినండి
Banana Storage Tips : వేసవిలో అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి
వేసవిలో అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి
Eggs for 14 Days : వరుసగా 14 రోజులు గుడ్లు తింటే శరీరంలో జరిగే మార్పులు.. నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వరుసగా 14 రోజులు గుడ్లు తింటే శరీరంలో జరిగే మార్పులు.. నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Embed widget