By: Haritha | Updated at : 26 Nov 2022 10:09 AM (IST)
(Image credit: Pixabay)
ఉత్తరాదివారు కారం ఎక్కువ తినరు కానీ, మన దక్షిణాదిలో మాత్రం బాగా కారం దట్టించిన ఆహారాలు తినేందుకు ఇష్టపడతారు. అందులోనూ భారతీయ వంటకాలలో మసాలాకు చాలా ప్రాధాన్యత ఉంది. మసాలా ఘాటు, కారం, పచ్చిమిర్చి ఘాటు తగ్గడానికి వెంటనే నీరు తాగే వాళ్లు ఎంతో మంది. కానీ అలా నీళ్లు తాగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. నిపుణులు చెప్పిన దాని ప్రకారం కారం, మసాలా దట్టించిన ఆహారాన్ని తిన్నాక స్పైసీ ఫుడ్లో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నాలుక చివరలను అంటుకుని మంట మొదలవుతుంది. ఆ మంట మెదడుకు మండుతున్న అనుభూతిని ఇస్తున్న సంకేతాన్ని ఇస్తుంది. ఆ సంకేతం మనకు మండుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. కొన్ని రకాల ఆహారాన్ని తినడం వల్ల ఆ ఫీలింగ్ తగ్గించుకోవచ్చు.
1. స్పైసీ ఫుడ్ తిన్నాక మంట అధికంగా ఉన్నప్పుడు కాస్త పాలు తాగాలి. పాలల్లో కేసైన్ అనే పదార్థం ఉంటుంది. స్పైసీ ఫుడ్ లో ఉండే క్యాప్సైసిన్‌తో కేసైన్ చేరి నాలుగు, పొట్ట మంట ఆపుతుంది.
2. రెండు మూడు స్పూన్ల పెరుగు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగు కూడా పాలలాగే పనిచేస్తుంది. అందుకేనేమో భారతీయ భోజనం చివర్లో పెరుగున్నంతో ముగుస్తుంది. నోటికి, పొట్టకి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది పెరుగు. కారం అధికంగా ఆహారం తినేప్పడు కచ్చితంగా పక్కన పెరుగు పెట్టుకోవడం చాలా ముఖ్యం.
3. మీరు నమ్మిన నమ్మకపోయినా టీ కూడా మీ నోటి మంటని, పొట్టలోని మంటని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఉండే టీ తాగడం వల్ల మంట పెరుగుతుంది కానీ ఎలా తగ్గుతుంది? అని వాదించవచ్చు. కానీ ఒకసారి ప్రయోగాత్మకంగా ఆచరించి చూస్తే మీకే తెలుస్తుంది. కచ్చితంగా టీ పని చేస్తుంది.
4. మరీ మంట అధికంగా ఉంటే వెంటనే తియ్యటి బ్రెడ్ లేదా కేకులు తింటే మంచి ఫలితం ఉంటుంది. కేకులు ఇంట్లో లేకపోతే వెంటనే కొన్ని సోంపు గింజలు నమలండి. లేదా పొడి తెల్లన్నాని తిన్నా మంచి ఉపశమనం కలిగిస్తుంది.
కారం మీ శరీరం తట్టుకోలేకపోతున్నప్పుడు తగ్గించడమే మంచిది. అలాగే మసాలాలను కూడా మితంగా తినాలి.
Also read: అయోడిన్ లోపం ఉంటే గర్భం ధరించడం కష్టమవుతుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!
Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
Prediabetes: ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఏం తినాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?
బరువు తగ్గేందుకు అతిగా వ్యాయామం చేస్తున్నారా? అస్సలు వద్దు, బెస్ట్ వర్కవుట్ ఇదే!
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?