News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Fermented Rice: పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదట, ప్రయోజనాలేమిటో తెలుసా?

పూర్వీకులు వంద సంవత్సరాల వరకు ఆయుష్హుతో బతికారంటే అందుకు కారణం వాళ్ళు అవలంభించిన ఆహారపు అలవాట్లు. వాటిలో ఒకటి పులియబెట్టిన అన్నం అదేనండీ అచ్చతెలుగులో చద్దన్నం.

FOLLOW US: 
Share:

పూర్వం పెద్దవాళ్ళు పులియబెట్టిన అన్నం తిని ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇది కొన్ని శతాబ్ధాలుగా భారతీయ ఆహారంలో ఒక భాగంగా మారిపోయింది. ఎంతో మంది అల్పాహారంగా దీన్ని తీసుకుంటారు. పోయిలా భట్, గీలా భాట్, చద్దన్నం ఇలా పులియబెట్టిన అన్నానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. దీన్ని సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యం కూడా అందిస్తుంది.

పోషణ ఇస్తుంది

పులియబెట్టిన అన్నంలో మైక్రోఫ్లోరా పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్ గా పని చేస్తుంది. గట్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. మెరుగైన రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎలక్ట్రోలైట్ గా కూడా పని చేస్తుంది. అలసట, బలహీనత, నిర్జలీకరణాన్ని నయం చేస్తుంది. పులియబెట్టిన అన్నంలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, ఫినోలీక్స్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్, లీనోలెయిక్ యాసిడ్, ఆంథోసైన్సిస్ వంటి మెటాబోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి అనుకూలమైన ఈ బ్యాక్టీరియా కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పులియబెట్టిన అన్నం ఎందుకు ఆరోగ్యకరమైనది?

పులియబెట్టిన అన్నం ప్రక్రియ వల్ల అందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాల లభ్యత పెరుగుతుంది. 12 గంటల పాటు రాత్రిపూట అన్నాన్ని పులియబెట్టడం వల్ల సాధారణ అన్నంతో పోలిస్తే దీనిలో ఐరన్ కంటెంట్ 21 రేట్లు పెరుగుతుంది. అందుకే ఇది మిగిలిన వాటి కంటే ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.

ప్రయోజనాలు

పులియబెట్టిన అన్నం క్రమం తప్పకుండా తినడం వల్ల విటమిన్ బి12 లభిస్తుంది. దీని వల్ల అలసట తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. శక్తి కోసం కెఫీన్ మీద ఆధారపడే వాళ్ళకి ఇది అద్భుతమైన ఆహారం. గట్ ఫ్రెండ్లీ ఫుడ్. ప్రొ బయోటిక్స్ ఉన్నాయి. జీర్ణాశయాంతర  సమస్యల్ని నిరోధిస్తుంది.

దీని తయారీ ఎలా?

  • ముందు రోజు మిగిలిపోయిన అన్నం- రెండు కప్పులు
  • నానబెట్టడానికి కొద్దిగా నీరు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • మజ్జిగ- ఒక కప్పు
  • తురిమిన క్యారెట్, తరిగిన దోసకాయ, వేయించిన వేరుశెనగ, తరిగిన కొత్తిమీర( కావాలంటే వేసుకోవచ్చు ఆప్షనల్ మాత్రమే)

అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మజ్జిగ, నీటిని కలుపుకుని ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి.  గది ఉష్ణోగ్రత వద్ద రాత్రంతా దాన్ని నానబెట్టాలి. మరుసటి రోజు అన్నం పులిసిన వాసన, కాస్త మెత్తగా అయిపోతుంది. లేదంటే ఒక స్పూన్ తీసుకుని మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మజ్జిగ ఘాటైన రుచిని కలిగిస్తుంది. ఇందులో టాపింగ్స్ కోసం తురిమిన క్యారెట్, తరిగిన దోసకాయ, వేయించిన వేరుశెనగ, తరిగిన కొత్తిమీర వేసుకుని తినేయవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎముకలకి కావాల్సిన బలాన్ని అందిస్తుంది. ఇంకా కావాలంటే ఉల్లిపాయ, పచ్చి మిర్చి నంచుకుంటూ దీన్ని ఆరగించారంటే టేస్ట్ అదిరిపోతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మహిళల్లో మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలివే - చికిత్స విధానం ఏంటి?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 07 Jul 2023 07:09 AM (IST) Tags: Fermented Rice Chaddannam Benefits Of Fermented Rice Health Benefits Of Chaddannam

ఇవి కూడా చూడండి

Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?

Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?

Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!