అన్వేషించండి

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

డ్రై ఫ్రూట్స్ చాలా రుచిగా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో కీలక పోషకాలు ఆరోగ్యానికి అందిస్తాయి. అందుకే ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి లభిస్తుంది. డెజర్ట్, స్మూతీస్, ఓట్ మీల్స్ కి జోడించుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. అనేక వంటకాలకి అదనపు రుచి ఇవ్వడం కోసం కూడా వీటిని వేస్తారు. స్నాక్స్ గా వీటిని తీసుకోవడం వల్ల అదనపు చిరుతిండి తినాలనే ఫీలింగ్ కూడా రాకుండా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు కొన్ని తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టకుండా తీసుకోవచ్చు. కానీ బాదం, వాల్ నట్స్, కిస్ మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందాలంటే మాత్రం అవి నానబెట్టుకుని తినాలి.

బాదంపప్పు

విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలతో నిండిన బాదం ప్రపంచంలోని అత్యుత్తమ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి. చాలా మంది వాటిని పచ్చిగా లేదా కాల్చుకుని తింటారు. బదమ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. బాదం పప్పు నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే వాటిని నాయబెట్టి పొత్తు తీసుకుని తినాలి. కనీసం 6-8 గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలి. అప్పుడు వాటిని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు.

వాల్ నట్స్

దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే వాల్ నట్స్ తింటే చాలా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. వాల్ నట్స్ రోజువారీ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వీటిని పాలు లేదా నీటిలో నానబెట్టుకుని తినడం ఉత్తమమైన మార్గం. ఒత్తిడిని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

కిస్ మిస్ లేదా ఎండు ద్రాక్ష

నానబెట్టిన ఎండుద్రాక్ష మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత తీసుకునే మంచి ఫలితం ఉంటుంది. పేగులను శుభ్రం చేస్తుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల కొన్ని ఆహారపదార్థాల వల్ల వచ్చే ఆమ్లాలు తగ్గించడంలో సహాయపడుతుంది.

అంజీరా

అంజీరా లేదా అంజూరా పండ్లు రుచికరమైన డ్రై ఫ్రూట్స్. ఫైబర్ అధిక మొత్తంలో ఉండటం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది. కొలెస్ట్రాల్, పిండి పదార్థాలు ఇందులో సమతుల్యంగా ఉంటాయి.  అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్లో ఇది ఒకటి. మధుమేహం ఉన్న రోగులు వీటిని రాత్రి పూట నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పీసీఓడి సమస్యతో బాధపడే వారికి ఇది మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎండు ఖర్జూరం

పోషకాల పవర్ హౌస్, ఖనిజాలు, విటమిన్స్ ఎండు ఖర్జూరంలో పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరాల్లో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ సీజనల్ అలర్జీలను నివారించడంలో సహాయపడుతుంది. వీటిని నానబెట్టుకుని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాదులని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు వెల్లడించారు. గర్భిణీలకు కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అందుకే రక్తహీనతతో బాధపడే వాళ్ళని ఎండు ఖర్జూరం నానబెట్టుకుని తినమని వైద్యులు సూచిస్తారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నానబెట్టిన ఖర్జూరాలు ఉత్తమ హ్యాంగోవర్ ఆహారంగా పనిచేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు

 Also Read: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Embed widget