అన్వేషించండి

Eating on Bed: మంచంపై కూర్చొని ఫుడ్ తింటున్నారా? ఆ యువకుడికి ఏమైందో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది!

సింగపూర్ కు చెందిన డాక్టర్ సామ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫాలోవర్స్ తో లైవ్ షేర్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఈసారి కొన్ని ఆసక్తికర విషయాలను గురించి మాట్లాడారు. ఆ వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం

ఇది వరకు రోజుల్లో భోజనానికి ఒక ప్రత్యేక సమయం, తినేందుకు ఒక డైనింగ్ టేబుల్ వంటి వాటన్నింటిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు చాలా మంది పని చేసుకోవడం నుంచి తినడం నిద్రపోవడం వరకు అన్నీమంచంపైనే. పాండమిక్ తర్వాత మనుషుల ఆలోచనలో, అలవాట్లలో, పనివేళల్లో అన్నింటిలో విపరీతమైన తేడాలు వచ్చాయి. వాటిలో ఒకటి ఇలా మంచాన్ని అన్ని పనులకు వాడెయ్యడం. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ డాక్టర్ సామ్ ఒక చైనా యువకుడి కథను పంచుకున్నారు.

చైనాలోని గ్వాంగ్డాంగ్ కు చెందిన 24 సంవత్సరాల Mr LV ఇలా మంచం మీదే స్నాకింగ్ చెయ్యడం, తిన్న తర్వాత ఖాళీ రెపర్లను మంచం చుట్టూ పడెయ్యడం అలవాటైపోయింది. ఒక రోజు అకస్మాత్తుగా చెవిలో తీవ్రమైన నొప్పితో మేల్కొన్నాడు. ఇంట్లోవారు అతడి చెవిలోకి చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతడి చెవిలో బొద్దింక నివాసిస్తోందట. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు మరో షాకింగ్ విషయం తెలిసింది. అతడి చెవిలో ఉన్నది కేవలం ఒక్క బొద్దింక కాదట. ఏకంగా బొద్దింక ఫ్యామిలీయే చెవిలో కాపురం పెట్టేశాయట. అయితే, ఆ బొద్దింక పొరపాటున అతడికి చెవిలోకి వెళ్లిందనుకుంటే పొరపాటే. దీనికి.. అతడు మంచం మీద భోజనం చేయడానికి మధ్య లింక్ ఉంది.

డాక్టర్లు అతడి చెవిలో సుమారు 10 బొద్దింకలను కనుగొన్నారట. అయితే, ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురుకావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. బొద్దింకలు తెలియకుండా చెవిలోకి దూరవచ్చు. ఇయర్ వాక్స్ వాసన బొద్దింకలను ఆకర్శిస్తుందట. అంతేకాదు ఇయర్ కెనాల్ తేమగా, చీకటిగా ఉంటుంది. అదీ కాకుండా అతడికి మంచం మీదే స్నాకింగ్ చేసే అలవాటు ఉండడం వల్ల మంచంపై తినుబండారాల అవశేషాలు, ముక్కలు ఉండడం వల్ల.. బొద్దింకలు అక్కడే తిష్ట వేశాయట. పెద్దగా కష్టపడకుండా మంచంలోనే ఉంటూ.. అతడు వదిలిపెట్టిన ఆహారాన్ని తింటూ.. అతడికి తెలియకుండానే అవి పెట్స్‌గా మారిపోయాయి. చివరికి.. అతడి చేవినే ఆవాసంగా చేసుకున్నాయి. ఇంత చదివాక కూడా మీరు మంచం మీదే తిండి తింటాం.. పంటాం.. అనుకుంటే మాత్రం మీ ఇష్టం.

చెవిలోకి కీటకాలు దూరితే ఏం చేయాలి?

  • ముందు కంగారు తగ్గించుకోవాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇయర్ కెనాల్ నేరుగా మెదడుకు కనెక్ట్ అయ్యి ఉండదు. కాబట్టి కంగారు అక్కర్లేదు.
  • చెవిలో దూరిన కీటకాన్ని మీరే స్వయంగా తీసేందుకు ప్రయత్నం చెయ్యకూడదు. ఏదో ఒక పొడవైన వస్తువు చెవిలో దూర్చడం వల్ల చెవిలో ఉన్న కీటకం కంటే మీకే ఎక్కువ హాని కలగవచ్చు.
  • చెవిలోంచి కీటకాన్ని బయటికి తియ్యడం కంటే దాన్ని చెవిలోనే ముంచెయ్యడం మంచిదట. తక్కువ కాన్సెట్రెటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిలో వెయ్యడం లేదా ఆలివ్ ఆయిల్ తో చెవి నింపడం వల్ల కూడా ఆ కీటకం బయటికి రావచ్చు అని చిట్కా డాక్టర్ తన ఫాలోవర్స్ తో పంచుచుకున్నారు.

అంతేకాదు వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించడం కూడా అవసరమే అని సూచించారు. ఎందుకంటే చెవిలో కీటకపు అవశేషాలు మిగిలిపోకూడదు కనుక డాక్టర్ ను సంప్రదించి ఆ విషయాన్ని నిర్ధారించుకోవడం అవసరం. ఇంతకీ ఆ బాధితుడి పరిస్థితి ఎలా ఉందో చెప్పేనేలేదు కదూ. డాక్టర్లు అతడి చెవిలో బొద్దింకలను తీసేసి.. శుభ్రంగా క్లీన్ చేసి పంపించేశారు. లక్కీగా అతడికి ఎలాంటి హాని కలుగలేదు. కానీ, నిర్లక్ష్యం చేసి ఉంటే మాత్రం అతడు భయానక వ్యాధులకు గురయ్యేవాడని డాక్టర్లు తెలిపారు. కాబట్టి, బీ కేర్ ఫుల్. ఎందుకంటే.. మంచంపై పిల్లలు కూడా నిద్రపోతుంటారు. మీ నిర్లక్ష్యం వారికి శాపంగా మారొచ్చు. ఈ కథనాన్ని మీ బంధుమిత్రులతో కూడా పంచుకుని అప్రమత్తం చేయండి.

Also read : మీరు ఇలాంటి టూత్ బ్రష్ వాడుతున్నారా? జాగ్రత్త, చిక్కుల్లో పడతారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

టాప్ హెడ్ లైన్స్

Gym Beginners : జిమ్ చేసిన తర్వాత ఒళ్లు నొప్పిగా ఉందా? మొదట్లో బాడీ పెయిన్స్ రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
జిమ్ చేసిన తర్వాత ఒళ్లు నొప్పిగా ఉందా? మొదట్లో బాడీ పెయిన్స్ రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Hair Oil After Shampoo : తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Glowing Skin Hacks : పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget