News
News
వీడియోలు ఆటలు
X

ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే

కొన్ని రకాల పళ్ళు చాలా అరుదుగా దొరుకుతాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

మనకు సాధారణంగా మార్కెట్లో జామ, ఆపిల్, నారింజ, అరటి, పైనాపిల్ వంటి పల్లె ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి వాటినే ఎక్కువమంది తింటూ ఉంటారు. కానీ కొన్ని అరుదైన పండ్లు కూడా మార్కెట్లో వస్తూ ఉంటాయి. వాటిని కూడా తినడం ముఖ్యమే. వాటిలో ఒకటి షాహ్‌టూట్. వీటినే మల్బరీ పండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి జ్యూసీగా, మంచి సువాసనతో ఉంటాయి.  రుచి కూడా అదిరిపోతుంది. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో శతాబ్దాలుగా వీటిని వినియోగిస్తున్నారు. ఎరుపు, నలుపు, తెలుపు వంటి రంగుల్లో లభిస్తాయి. 

మల్బరీ చెట్లు ఎక్కడపడితే అక్కడ జీవించలేరు. మోరేసే కుటుంబానికి చెందిన ఈ చెట్లు ఆసియా, యూరోప్, అమెరికాలోని సమశీతోష్ణ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. పండు చిన్నగా సున్నితంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. 

ఈ మల్బరీ పండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యకరంగా జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి. చర్మాన్ని రక్షిస్తాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడటంతో పాటు ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. అంటే ముఖంపై ముడతలు, గీతలు వంటివి రాకుండా నిరోధిస్తాయి. 

ఈ పండ్లు నేరుగా తినవచ్చు. కొంతమంది మఫిన్లు, కేకులు వంటి వాటిలో కూడా వాడతారు. తియ్యటి రొట్టె తయారీలో కూడా ఈ మల్బరీ పండ్లను ఉపయోగిస్తారు. సలాడ్లు, స్మూతీలు చేయడానికి, జాములు తయారు చేయడానికి కూడా ఈ మల్బరీ పండ్లను అధికంగా ఉపయోగిస్తారు.  

కంటి ఆరోగ్యానికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇవి వరంలాంటివి. మల్బరీ పండ్లు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి కూడా. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. 

Also read: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 30 Mar 2023 10:47 AM (IST) Tags: Mulberries Mulberry fruit benefits Mulberry fruit Uses

సంబంధిత కథనాలు

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

టాప్ స్టోరీస్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!

ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!

RGV: ఎన్టీఆర్‌‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!

RGV: ఎన్టీఆర్‌‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి