అన్వేషించండి

Tomato Powder: టమాటో పొడి ఇలా చేయండి, కూరలకు కొత్త రుచి రావడం ఖాయం

Tomato Powder: ఇంట్లోనే ఇలా టమోటా పొడి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చెక్కుచెదరదు.

Tomato Powder: టమాటో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టం. ఒక్కోసారి కొండెక్కి కూర్చుంటాయి. కిలో రూ.200 వరకు ఈ ఏడాది టమోటాలు పలికాయి. టమోటా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఓసారి పొడి చేసుకుని దాచుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు. దీని రుచి కూడా బావుంటుంది. కూరల్లో వేసుకుంటే టేస్టీ ఇగురు రావడం ఖాయం. వంటకాలకు కొత్త రుచి కావాలంటే ఇలా టమోటో పొడిని ఓసారి ప్రయత్నించండి. 

చేయడం చాలా సులువు
టమోటా ధరలు ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. టమోటోలు ఎక్కువ కొని పెట్టుకుంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఎన్నిరోజులైనా ఉంటాయి. ముందుగా మూడు కిలోల టమోటాలను కొనండి. వాటిని సన్నగా కోసుకోండి. ఏ ఆకారంలో కోసినా ఫర్వాలేదు. కానీ సన్నగా తరగాలి. గుండ్రిని చక్రాల్లా కోసుకుంటే త్వరగా ఎండుతాయి. వీటిని ఎర్రటి ఎండలో ఆరబెట్టండి. ఎంతగా ఇవి ఎండాలంటే ఒక గిన్నెల్లో వేస్తే శబ్ధం రావాలి. ఆ తరువాత మిక్సీలో వేసి పౌడర్ కొట్టండి. కొంతమంది మెత్తటి పొడిలా చేసుకుంటారు. మరికొందరు బరకగా చేసుకుంటారు. ఎలా చేసిన కూరలకు ఇది మంచి రుచిని ఇస్తుంది. చికెన్, మటన్, గుడ్లు కూరలకు కాస్త ఉల్లిపాయలేసి, ఈ టమోటో పొడి వేసి కలిపితే ఇగురు ఎక్కువగా వస్తుంది. కోడి గుడ్లు, టమోటా పొడి కాంబినేషన్ రుచి అదిరిపోతుంది. 

టమోటాలను ప్యూరీగా దాచుకునే వారు ఉన్నారు. టమోటాలను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జు చేయాలి. ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి ఉప్పు కలపాలి. దీన్ని ఫ్రిజ్ లోనే దాచుకోవాలి. ఇది ఒక రెండు నెలలు ఫ్రెష్ గా ఉంటుంది. ఆ తరువాత మాత్రం వాసన మారిపోయే అవకాశం ఉంది. మీ అవసరాన్ని బట్టి పొడిగా దాచుకోవాలో, లేక ప్యూరీగా చేసి దాచుకోవాలో నిర్ణయించుకోండి. ఎలా తిన్నా టమోటాలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. మధుమేహం ఉన్న వారికి టమోటోలు ఎంతో మేలు చేస్తాయి. ఇదిలో ఉండే క్రోమియం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. టమోటోలు తినడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. టమోటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యవసరమైనది. టమోటాలను ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో అనారోగ్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. టమోటాల ధరలు ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే టమోటో పొడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.

Also read: బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకువెళుతున్నారా? భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Monsoon Stomach Infection: వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి
వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి
NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget