Boxers vs V-Cut Underwear : మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలుంటే.. V-cut అండర్వేర్ వేసుకోవాలా లేక బాక్సర్ మంచిదా? నిపుణుల సలహాలివే
Which Underwear is Better for Fertility : అండర్వేర్ ఫెర్టిలిటీ సమస్యలను పెంచుతుందా? ఎలాంటి అండర్ వేసుకుంటే సంతానోత్పత్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు? దీనిపై నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?
![Boxers vs V-Cut Underwear : మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలుంటే.. V-cut అండర్వేర్ వేసుకోవాలా లేక బాక్సర్ మంచిదా? నిపుణుల సలహాలివే Do Boxers and V Cut Underwear Affect Fertility in Men Expert Tips on Choosing the Better Option Boxers vs V-Cut Underwear : మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలుంటే.. V-cut అండర్వేర్ వేసుకోవాలా లేక బాక్సర్ మంచిదా? నిపుణుల సలహాలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/dc0c75b6d2dab0200ac459ed061e41c51738145953415874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
General Tips for Underwear and Fertility : లోదుస్తులు ఫెర్టిలిటీ సమస్యలను పెంచుతాయా? మగవారు వేసుకునే అండర్వేర్ కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? అంటే పూర్తిగా కాకపోయినా.. కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వీ కట్ అండర్వేర్, బాక్సర్ లో దుస్తుల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడిస్తూ.. ఏవి వేసుకుంటే మంచిదో సూచిస్తున్నారు. ఇంతకీ మగవారు వీ కట్ అండర్వేర్ వేసుకుంటే మంచిదా? బాక్సర్ వేసుకుంటే మంచిదా?
వీ కట్ అండర్వేర్ వేసుకుంటే..
V-cut అండర్వేర్ వేసుకోవడం వల్ల లోపలి తొడ భాగంపై ప్రెజర్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా గాలి ప్రసరణ కూడా తక్కువగా ఉంటుందట. దీనివల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువై చెమట ఎక్కువగా పడుతుందట. చెమటవల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. Jock Itch వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయట.
బాక్సర్ అండర్వేర్ వేసుకుంటే..
బాక్సర్స్ సాధారణంగా లూజ్ ఫిట్టింగ్తో ఉంటాయి. వీటిని వేసుకుంటే తొడ భాగంపై ప్రెజర్ పడకుండా.. గాలి అందేలా చేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట.
రెండిటీలో ఏది మంచిది..
వీ కట్ అండర్వేర్ వల్ల ఫెర్టిలిటీ సమస్యలు ఉండకపోవచ్చు కానీ.. లైంగిక చర్యల సమయంలో ఇబ్బంది పడేలా చేస్తుందట. పైగా వేడిని పెంచుతుంది కాబట్టి పరోక్షంగా దాని ప్రభావం స్పెర్మ్ కౌంట్‌పై పడుతుందట. అందుకే వీలైనంతవరకు వీ కట్ అండర్వేర్ వేసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు. ముఖ్యంగా సమ్మర్లో, వేడి ఎక్కువగా ఉన్న సమయంలో దీని జోలికి వెళ్లకూడదంటున్నారు. బాక్సర్స్‌తో ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. గాలి వేసే వెసులుబాటు ఎక్కువగా కాబట్టి గుడ్ స్పెర్మ్ క్వాలిటీకి ఇది హెల్ప్ చేస్తుందంటున్నారు.
Also Read : లోదుస్తుల కోసం ఏ వయసు వారు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలో తెలుసా? అది అయితే అందరికీ బెస్ట్
గుర్తించుకోవాల్సిన విషయాలివే
వీ కట్ అండర్వేర్ వేసుకున్నా.. బాక్సర్స్ వేసుకున్నా.. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూదని సూచిస్తున్నారు. సాఫ్ట్ మెటీరియల్, కాటన్ మెటీరియల్ మాత్రమే ఉపయోగించాలంటున్నారు. పాలీస్టర్, సింథటిక్‌వి వేసుకోకూడదని చెప్తున్నారు. అలాగే మీకు ఫిట్‌గా ఉండే అండర్‌వేర్‌ని మాత్రమే ఎంచుకోవాలని.. టైట్‌గా ఉండేవాటిని ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఉతికిన, శుభ్రంగా ఉన్న అండర్‌వేర్‌ని మాత్రమే వేసుకోవాలి. రోజూ వాటిని మారుస్తూ ఉండాలి. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియ పెరుగుదల ఉండదు. ఇది లైంగిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)