News
News
X

Coffee and Diabetes: కాఫీ డయాబెటిస్ నుంచి రక్షిస్తుందా? ఇది కాస్త మింగుడుపడని విషయమే!

కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో కొన్ని నష్టాలను కూడా కలిగిస్తుంది. మరి, డయాబెటిస్ బాధితులపై కాఫీ ఎలాంటి ప్రభావం చూపుతుంది?

FOLLOW US: 

మీకు కాఫీ అంటే ఇష్టమా? బిందాస్‌గా తాగేయండి. ఎందుకంటే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహయపడతాయి. ఫలితంగా మనం వివిధ వ్యాధులు, వైరస్‌ల నుంచి సురక్షితంగా ఉంటాం. కాఫీలో ఇంకా విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B5(పాంటోథెనిక్ యాసిడ్), విటమిన్ B1(థయామిన్), విటమిన్ B3 (నియాసిన్), ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు కాఫీలో ఉంటాయి. కాఫీ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. కాఫీలోని కెఫిన్ నిద్రలేమి సమస్యకు కారణం కావచ్చు. ఒత్తిడిని పెంచే అవకాశం కూడా ఉంది. మరి మధుమేహం(డయాబెటిస్) బాధితులపై కాఫీ ఎలాంటి ప్రభావం చూపుతుంది? డయాబెటిస్ ఉంటే కాఫీ తాగొచ్చా? దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్: కాఫీ ఆరోగ్యానికి మంచిదేనని, కాఫీ తాగే వ్యక్తులకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలోని కెఫిన్ డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందట. అయితే, మీకు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నట్లయితే మాత్రం.. ఇది మీకు బ్యాడ్ న్యూసే. ఎందుకంటే.. డయాబెటిస్ రోగులకు కాఫీ అంత మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిస్ రాక ముందు మాత్రమే టైప్-2 రకాన్ని కంట్రోల్ చేసే శక్తి కెఫిన్‌కు ఉంటుందని వెల్లడించారు.

ఇన్సులిన్‌పై ప్రభావం: డయాబెటిస్‌తో బాధపడుతున్న బాధితులు కాఫీ తాగినట్లయితే.. అందులోని కెఫిన్ ఇన్సులిన్ చర్యపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువగా చూపించవచ్చు. కాబట్టి, డయాబెటిస్ బాధితులు వీలైనంత వరకు కాఫీని అతిగా తాగకపోవడమే ఉత్తమం. కాఫీని అతిగా తాగితే శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. చాలామంది కాఫీ మాత్రమే తాగరు. కెఫిన్ ఉన్న చాక్లెట్లు కూడా తింటారు. అవి కూడా మంచివే. కానీ, వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కేవలం శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గిపోయి కళ్లు తిరుగుతున్నాయని అనిపించినప్పుడు మాత్రమే ఆ చాక్లెట్లను తీసుకోవడం మంచిది. 

అధ్యయనంలో ఏం తేలింది?: టైప్-2 మధుమేహంతో బాధపడేవారిపై కెఫిన్ భిన్నంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచేస్తుంది. పరిశోధకులు ఇటీవల టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులను పరిశీలించింది. బ్రేక్‌ఫాస్ట్, భోజనం సమయాల్లో వారికి 250-మిల్లీగ్రాముల కెఫిన్ మాత్రలను ఇచ్చారు. కెఫిన్ తీసుకోని రోజులతో పోల్చితే.. కాఫీని తీసుకున్న రోజు వారి బ్లడ్ షుగర్ స్థాయిలు 8 శాతానికి పెరిగినట్లు గుర్తించారు. అది భోజనం తర్వాత చక్కెర స్థాయిలు పెరిగేందుకు కూడా కారణమైంది. చక్కెరను కణాల్లోకి అనుమతించి శక్తిగా మార్చే హర్మోన్‌పై కెఫిన్ నేరుగా ప్రభావం చూపడం వల్లే సుగర్ స్థాయిలు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. కెఫిన్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. దానివల్ల మీ కణాలు హార్మోన్‌కు ప్రతిస్పందించవని పేర్కొన్నారు.  

ఇలా ప్రభావం చూపుతుంది: ఒత్తిడి కలిగించే హర్మోన్ల స్థాయిలను పెంచే కెఫిన్ ఎపినెఫ్రైన్(అడ్రినలిన్ అని కూడా అంటారు) వల్ల మీ శరీరంలోని కణాలు ఎక్కువ చక్కెరను ప్రాసెస్ చేయకుండా నిరోదిస్తాయి. ఇది మీ శరీరాన్ని ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయకుండా నిరోధించవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అడెనోసిన్ అనే ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. అందుకే, కాఫీ డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి అంత మంచిది కాదు. ఇది మీ నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్ర తగ్గినా.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో సమస్యలు వస్తాయి. అయితే, కొంతమంది నిపుణులు.. శరీరం కెఫిన్‌కు అలవాటు పడితే ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించవని అంటున్నారు. 

ఏం చేస్తే బెటర్?: మీ శరీరంపై కెఫిన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోడానికి బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోండి. ఉదయాన్నే ఏ ఆహారం తీసుకోకుండా ఒకసారి టెస్ట్ చేసుకోండి. కాఫీ తాగిన గంట తర్వాత మరోసారి బ్లడ్ సుగర్ టెస్ట్ చేసుకోండి. రెండు ఫలితాల మధ్య తేడా చూడండి. దాన్ని బట్టి కెఫిన్ మీ శరీరంలో చక్కెర స్థాయిలను పెంచిందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. 
 
కాఫీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు, నష్టాలివే: 
⦿ కాఫీలోని కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. 
⦿ కెఫిన్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
⦿ కాఫీ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహకరిస్తుంది.
⦿డిజెనరేటివ్ వ్యాధుల నుండి రక్షిస్తుంది.
⦿ అల్జీమర్స్, డిమెన్షియా వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుంచి కాఫీ కాపాడుతుంది. 
⦿ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది
⦿ అయితే, కాఫీ వల్ల ఆందోళన, నిద్రలేమి వంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి.
⦿ కాఫీలోని కెఫిన్ మనల్ని లోబరుచుకుంటుంది. అది క్రమేనా వ్యసనంగా మారుతుంది. 
⦿ కాఫీ అతిగా తీసుకొవద్దు. దాని వల్ల కెఫిన్ మెదడును ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది. దాని వల్ల ఆందోళన, దడ ఏర్పడతాయి. 

Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?

గమనిక: వైద్య నిపుణులు చెప్పిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినా మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు. 

Published at : 08 Jul 2022 08:35 AM (IST) Tags: Coffee benefits Coffee side effects coffee benefits to diabetes Coffee effect on DiabetesDiabetes Coffiee Coffee side effects coffee benefits to diabetes Coffee effect on Diabetes Diabetes Coffee

సంబంధిత కథనాలు

Okinawa Town: ఎక్కువ కాలం జీవించాలని ఉందా? ఈ ప్రాంతానికి వెళ్లండి, 100 ఏళ్లు గ్యారంటీ, ఎందుకంటే..

Okinawa Town: ఎక్కువ కాలం జీవించాలని ఉందా? ఈ ప్రాంతానికి వెళ్లండి, 100 ఏళ్లు గ్యారంటీ, ఎందుకంటే..

Heart Attack: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండె ప్రమాదంలో పడినట్లే

Heart Attack: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండె ప్రమాదంలో పడినట్లే

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

Viral news: కోడి కూసిందని కోర్టుకెక్కిన జంట, వీరి కష్టం ఏ పక్కింటోడికి కూడా రాకూడదు!

Viral news: కోడి కూసిందని కోర్టుకెక్కిన జంట, వీరి కష్టం ఏ పక్కింటోడికి కూడా రాకూడదు!

Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..

Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!