అన్వేషించండి

Cumin Water Benefits : 7 రోజులు జీలకర్ర నీరు తాగితే ఏం అవుతుంది? తయారు చేసే విధానం, ఆరోగ్య ప్రయోజనాలివే

Cumin Water In The Morning : జీలకర్రే కాదు.. జీలకర్ర నీరు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మరి దీనివల్ల కలిగే లాభాలు ఏంటో.. ఉదయాన్నే ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
  • యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో, ఇతర ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  • ఇది రోజువారీ జీవనశైలిలో భాగం, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Cumin Water Daily : వంటింట్లో తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. అయితే జీలకర్రను కేవలం వంటల్లోనే కాకుండా.. నీటిలో నానబెట్టి లేదా మరిగించి తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. ఉబ్బరం తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. మరి జీలకర్ర నీటితో కలిగే లాభాలు ఏంటి.. ఎలా తాగితే మంచిదో చూసేద్దాం. 

జీలకర్రలో థైమోల్ సహా కొన్ని మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు కొంత మద్దతు ఇవ్వవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే 7 రోజులు లేదా వారం రోజుల్లోనే అన్ని ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెప్పే ఆధారాలు లేవు. అలాగే శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుందని కూడా చెప్పలేము. కానీ శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో మాత్రం చూసేద్దాం. 

Also Read : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు

జీలకర్ర నీరు తయారీ..

ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. అందులో 1 టీస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. లేదా ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి కొన్ని నిమిషాలు మరిగించి, గోరువెచ్చగా అయిన తర్వాత తాగవచ్చు. అయితే జీలకర్ర నీటిని కేవలం ఖాళీ కడుపుతో తీసుకోవాలని ఏమి లేదు. మీ భోజనం తర్వాత కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు.

వారం రోజులు జీలకర్ర నీరు తాగితే కలిగే లాభాలు 

జీలకర్రలోని కొన్ని సహజ సమ్మేళనాలు జీర్ణక్రియకు మద్దతు ఇవ్వవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనివల్ల భోజనం జీర్ణం కావడంలో కొంత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కొందరికి జీలకర్ర తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. భోజనం తర్వాత కడుపు బరువుగా లేదా అసౌకర్యంగా అనిపించే వారికి జీలకర్ర నీరు ఒక తేలికపాటి పానీయంగా ఉపయోగపడవచ్చు. కానీ తరచుగా అజీర్ణం ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. 

Also Read : జీర్ణక్రియ నుంచి వెయిట్ లాస్ వరకు.. జీలకర్ర మంచిదా? సోంపు మంచిదా? రెండింటి మధ్య తేడాలు ఇవే

బరువు తగ్గుతారా?

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కొన్ని మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. జీలకర్ర నీరు స్వయంగా కొవ్వును కరిగించే లేదా బరువును వేగంగా తగ్గించే పానీయం కాదు. కానీ టీ, కాఫీలు లేదా షుగర్ డ్రింక్స్ బదులుగా దీనిని తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడవచ్చు.

డయాబెటిస్ ఉంటే..

జీలకర్రలోని కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర నియంత్రణపై ప్రభావం చూపుతాయా అనే దానిపై పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. అయితే జీలకర్ర నీరు డయాబెటిస్‌కు చికిత్స అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. డయాబెటిస్ మందులు వాడేవారు వాటిని ఆపి జీలకర్ర నీటిపై ఆధారపడకూడదు. రొటీన్లో భాగంగా తగిన మోతాదులో తీసుకోవాలి. 

Also Read : ఉదయాన్నే జీలకర్ర నీరు తాగితే మంచిదా? చియా సీడ్స్ నీరు తాగితే బరువు తగ్గుతారా? ఏది బెస్ట్

రోజూ ఎంత తాగాలి?

సాధారణంగా ఒక గ్లాసు నీటిలో సుమారు 1 టీస్పూన్ జీలకర్ర వేసుకుని తయారు చేసుకున్న నీటిని తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తాగితే ఎక్కువ ప్రయోజనాలు వస్తాయి అనుకోకూడదు. అలాగే 7 రోజులు తాగినంత మాత్రాన ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయని చెప్పలేం. రెగ్యులర్గా తీసుకుంటూ.. ఆరోగ్యంపై ప్రభావం చూపే మొత్తం ఆహారం, వ్యాయామం, నిద్ర, జీవనశైలి వంటి అనేక అంశాలు మీ పూర్తి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. 

Also Read : ఉదయాన్నే జీలకర్ర నీళ్లు తాగితే కలిగే లాభాలు.. వేసవిలో ఈ ప్రయోజనాల కోసం తాగేయండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget