Covid R-naught: కోవిడ్ కలవరం.. డెల్టా కంటే తీవ్రంగా ‘R0’ వాల్యూ.. ఇది పెరిగితే ఏమవుంది?
ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేస్తున్నారా? అయితే.. మున్ముందు ఇది ప్రమాదకారిగా మరే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతేడాది విశ్వరూపం చూపించిన ‘డెల్టా’ వేరియెంట్ కంటే వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పైగా.. ఇది డెల్టా కంటే చురుకైనది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. ఏదో ఒక రూపంలో సోకుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. కొత్తగా వేరియెంట్ ఒమిక్రాన్‌ను గుర్తించిన కొత్తలో దాన్ని చాలా తక్కువ అంచనా వేశామని WHO పేర్కొంది. దీన్ని తక్కువ అంచనా వేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించింది.
ఒమిక్రాన్‌లో తొలుత డేల్టా వేరియెంట్ కంటే తక్కువ R0 (R-naught) వాల్యూ ఉండేదని, దేశంలో నమోదవుతున్న తాజా కేసుల్లో మాత్రం డేల్టా కంటే ఎక్కువ వాల్యూ ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపిన వివరాల ప్రకారం.. ఓమిక్రాన్‌లో R0 వాల్యూ 2.69 ఉంది. గతేడాది ఏప్రిల్-మేలో రెండవ వేవ్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు నమోదు చేసిన డెల్టా R0 వాల్యూ 1.69. దీన్ని బట్టి చూస్తే.. ఒమిక్రాన్ వైరస్ ఏ స్థాయిలో R0 వాల్యూ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కోవిడ్‌తో 28 రోజులు కోమా.. వయాగ్రా ఇవ్వగానే లేచి కూర్చున్న మహిళ!
R0 వాల్యూ అంటే ఏమిటీ?: R0 అనేది వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించే రేటు. వైరస్ వేగాన్ని R0తో అంచనా వేస్తారు. దీన్నే వైరస్ పునరుత్పత్తి సంఖ్య అని కూడా అంటారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినప్పుడు.. స్వయంగా పునరుత్పత్తి చేస్తుంది. దీన్ని ఎపిడెమియాలజిస్ట్‌లు లెక్కిస్తారు. కొత్త వేరియెంట్‌ను కనుగొన్నప్పుడు ఉన్న కేసులు/ఇన్‌ఫెక్షన్ ప్రస్తుత కేసులతో దీన్ని అంచనా వేస్తారు. మరణాల రేటు, ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య, పాజిటివ్ కేసులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇన్‌ఫెక్షన్‌కు చెందిన R సంఖ్యను నిర్ణయిస్తారు. R0 వాల్యూ పెరిగిందంటే.. తక్కువ సమయంలో ఎక్కువ మంది కోవిడ్ బారిన పడతారు. వ్యాక్సిన్‌ల ద్వారా పొందిన రోగనిరోధక శక్తి కూడా R వాల్యూపై ప్రభావం చూపగలదు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని తేలిగ్గా తీసుకోకూడదని, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడేవారికి ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండండి.
గమనిక: వైద్య నిపుణులు, అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఈ కథనంలో యథావిధిగా అందించామని గమనించగలరు.
Also Read: అంటే.. పగటి వేళ కరోనా నిద్రపోతుందా సారు?.. నైట్ కర్ఫ్యూపై ఫన్నీ జోకులు!
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి