అన్వేషించండి

Condoms vs Birth Control Pills : సెక్స్ జీవితానికి కండోమ్స్ బెటరా? బర్త్ కంట్రోల్ పిల్స్ బెటరా?

Intimate Health Tips in Telugu : కొందరు అప్పుడే పిల్లలు వద్దు అనుకుని కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతారు. అయితే ఈ రెండిట్లో మీ లైంగిక జీవితానికి ఏది మంచిది?

Birth Control Methods : కుటుంబ సమస్యల వల్లనో.. లేదంటే కొన్ని ఆరోగ్య కారణాల వల్లనో.. లేదంటే ఆర్థిక కారణాలవల్లనో.. ఇవేమి లేకుంటే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతోనో కొందరు అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటారు. అయితే పిల్లలు మాత్రమే వద్దు అనుకుంటారు కాబట్టి లైంగికంగా దూరంగా ఉంటారా అంటే లేదు. మరి దీనికి పరిష్కారం ఎలా? అవే కండోమ్స్(Condoms), పిల్స్. ఈ రెండూ ఉపయోగిస్తూ.. లైంగిక జీవితానికి దగ్గరగా ఉంటారు. అయితే ఇవి మహిళ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. మీ సెక్స్ లైఫ్​ (Sex Life)పై కూడా ఇవి ప్రభావం చూపిస్తాయా? ఇంతకీ ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరం?

కండోమ్స్, పిల్స్​లో సరైన ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీకు తెలుసో లేదో.. ఇది మీ సెక్స్ డ్రైవ్​ (Sex Drive)పై ప్రభావం చూపిస్తుందని ఓ సర్వే తేల్చింది. గర్భం నిరోధించేందుకు కండోమ్స్, పిల్స్ రెండూ అందరికీ తెలిసిన మార్గాలు. అయితే ఇవి రెండు ప్రయోజనాలతో పాటు.. కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఇస్తాయి. ఇవి మీ లైంగిక జీవతంపై దీర్ఘకాలం ప్రభావంం చూపిస్తాయంటున్నారు నిపుణులు.
కండోమ్​లు బెటరా?

మీకు తెలుసా? కండోమ్​ల వాడకం వల్ల పురుషుల్లో లిబిడో తగ్గుతుందట. అది నపుంసకత్వానికి దారి తీస్తుందని చెప్తారు. కొందరిలో లైంగిక ఆనందాన్ని దూరం చేస్తుందని.. లేదా పూర్తిగా ఆ కోర్కిలు చంపేస్తుందట. అయితే దీనిని నిరూపించడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. కానీ చాలామంది దీనిని నమ్ముతున్నారు. 

అయితే బర్త్ కంట్రోల్ పిల్స్​ కంటే కండోమ్స్ మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పిల్స్ హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. మహిళ శరీర పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అవాంఛిత దుష్ర్పభావాలకు కారణమవుతాయి. అంతేకాదండోయ్.. కండోమ్​లు పిల్స్​ కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఇవి లైంగిక ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. STD, HIV వంటి వాటినుంచి రక్షణ కల్పిస్తాయి. 

బర్త్ కంట్రోల్ పిల్స్ బెటరా?

గర్భాధారణను నివారించడంలో బర్త్ కంట్రోల్ పిల్స్ (Birth Control Pills) చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయినప్పటికీ.. ఇవి కొన్ని దుష్ప్రాభావాలకు దారితీస్తాయి. దానిలో మొదటి లిబిడో తగ్గుదల. పిల్స్ తీసుకోవడం వల్ల కలిగే హార్మోన్లలో మార్పుల కారణంగా మహిళల్లో లిబిడో తగ్గుతుంది. సాధారణంగా మహిళల్లో లైంగిక కోర్కిలు ఏదొక రీజన్​తో తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఈ పిల్స్​ వల్ల ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అంతేకాకుండా హార్మన్లలో మార్పుల వల్ల మానసికంగా కూడా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. 

కాబట్టి మీరు గర్భాన్ని నిరోధించుకోవాలనుకున్నప్పుడు సరైనది ఎంపిక చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదొకటి కచ్చితంగా ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ వైద్యుడిని సంప్రదించండి. వారు మీ ఆరోగ్య పరిస్థితులు, మానసిక స్థితులను దృష్టిలో ఉంచుకుని.. మీకు ఏది మంచిదో చెప్తారు. లేదంటే మరేదైనా పద్ధతులు వారు సూచిస్తారు. 

Also Read : మీ ప్రైవేట్ పార్ట్స్​ను ఇన్​ఫెక్షన్ల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
World Travel Market: లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Embed widget