అన్వేషించండి

Clay Pot Water Benefits : హాట్ సమ్మర్​లో మట్టి కుండలోని నీరు తాగుతున్నారా? అయితే మీరు వీటి​ గురించి తెలుసుకోవాల్సిందే

Clay Pot Water : సమ్మర్​లో ఏది తీసుకున్నా.. చల్లగా తినాలని, తాగాలని అనిపిస్తుంది. అందుకే చాలామంది ఫ్రిడ్జ్​ని ఉపయోగిస్తారు. అయితే ఫ్రిడ్జ్ వాటర్ తాగడం కంటే.. హాయిగా కుండ నీళ్లు తాగితే మంచిదట.

Advantages of Clay Pot Water in Summer : సమ్మర్​లో దాహం ఎక్కువగా వేస్తుంది. అందుకే బయటనుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ఫ్రిడ్జ్​నుంచి బాటిల్​ తీసుకుని గటగట తాగేస్తారు. అయితే ఇలా ఫ్రిడ్జ్ వాటర్​ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మరి చల్లని వాటర్ తాగాలంటే మనకున్న మార్గమేమిటి అని ఆలోచిస్తే.. ది బెస్ట్ ఆప్షన్ మట్టికుండ. ఇప్పుడంటే ఫ్రిడ్జ్​లు అందుబాటులోకి వచ్చాయి కానీ.. గతంలో మట్టికుండలో నీరు పోసి.. కింద ఇసుక వేసి దానిపై కుండను వచ్చి.. ఆ నీటిని తాగేవారు. అయితే మట్టికుండలోని నీరు చల్లగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది అంటున్నారు నిపుణులు. 

మట్టికుండలో నీరు తాగడంపై పలువులు శాస్త్రీయ అధ్యయనాలు కూడా చేశారు. వారు కూడా మట్టికుండలోని నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలును ధృవీకరించారు. ఇవి శరీరంలోని హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. జీర్ణక్రియకు సహాయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా పర్యావరణానికి అనుకూలమైనవి స్టడీలు తెలిపాయి. ఇంతకీ మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూసేద్దాం. 

శీతలీకరణ లక్షణాలు

మట్టికుండలు సహజంగా శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి మండుటేసవిలో కూడా నీటిని చల్లగా, ఫ్రెష్​గా ఉంచడంలో సహాయం చేస్తాయి. మట్లి అనేది పోరస్ పదార్థం. ఇది గాలిని నీటి గుండా వెళ్లేందుకు హెల్ప్ చేస్తుంది. తద్వార నీరు సహజమైన పద్ధతిలో చల్లగా మారుతుంది. నీటిలోని వేడిని కుండ తీసుకుని.. నీటిని చల్లగా, తాగడానికి అనువుగా మార్చేస్తుంది. 

మంచి టేస్ట్, అరోమా..

మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల నీటి రుచి, వాసన పెరుగుతుంది. మట్టి కుండలలో ఉపయోగించే మట్టి పదార్థం నీటికి ప్రత్యేక మట్టి రుచిని అందిస్తుంది. ఇది తాగడానికి టేస్టీగా, రిఫ్రెష్​గా ఉంటుంది. మట్టిలోని స్వభావాలు నీటిలో ఉన్న ఖనిజాలు, లవణాలు కోల్పోకుండా చేసి.. ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. 

మెరుగైన జీర్ణక్రియకై..

సమ్మర్​లో జీర్ణ సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అయితే మట్టి కుండలోని నీరు మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మట్టిలోని ఆల్కలీన్ స్వభావం నీటిలో ఆమ్లతను తటస్థం చేసింది. ఇది సులభంగా ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మట్టిలో ఉండే ఖనిజాలు, లవణాలు కూడా జీర్ణక్రియకు మేలు చేస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. 

రోగనిరోధక శక్తికై.. 

మట్టి కుండలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నీటిని శుద్ధి చేసి సురక్షితమైన నీటిని అందిస్తాయి. నీటిలోని మలినాలు, విషాన్ని గ్రహించే సామర్థ్యం మట్టికి ఉంటుంది. ఇవి తాగడానికి చాలా మంచివి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ ఇన్​ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి. 

పర్యావరణానికి మంచి చేస్తుంది..

ఫ్రిడ్జ్​లు వాడడం వల్ల కార్బన్ ఉద్గారాలు విడుదలై పర్యావరణానికి హాని చేస్తాయి. అయితే మట్టి కుండతో ఈ సమస్య ఉండదు. కేవలం నీటిని తాగడానికే కాకుండా.. వంటలు చేసుకునేందుకు కూడా కొందరు మట్టికుండలు వినియోగిస్తారు. ఇవి వంటలకు మంచి రుచిని అందిచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. సమ్మర్​లో మార్కెట్లలో మట్టికుండలను విరివిగా అమ్ముతారు. వీటిని చక్కగా ఇంటికి తీసుకెళ్లి.. నీటిని తాగేందుకు ఉపయోగిస్తే మీరు కూడా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.

Also Read : అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే అవిసెగింజల కారంపొడి.. ఇలా చేస్తే రెండునెలలు నిల్వ ఉంటుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP DesamKKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Embed widget