అన్వేషించండి

Tutti Frutti Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ టూటీ ఫ్రూటీ కేక్.. చాలా ఈజీగా ఇంట్లో చేసేయండిలా

Christmas Special Cake Recipe : క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్​గా ఏమైనా చేయాలనుకుంటే ఇంట్లోనే సింపుల్​గా టేస్టీ టేస్టీ టూటీ ఫ్రూటీ కేక్ చేసేయండి. రెసిపీగా చాలా ఈజీ.

Tutti Frutti Cake Recipe For Christmas : క్రిస్మస్ సమయంలో కేక్స్​కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సమయంలో డెజర్ట్​లలో కేక్​ లేకుంటే ఆ సెలబ్రేషన్స్ అసంపూర్ణంగానే ఉంటాయి. అయితే ఆ కేక్​ని ఇంట్లోనే తయారు చేసుకోగలిగితే.. దానికి మించిన పండుగ ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి చేయడం అలవాటు అయితే చాలు పండుగలకు.. పుట్టినరోజులకు.. స్పెషల్​ డేలలో దీనిని హాయిగా చేసుకుని లాగించేయవచ్చు. మరి అందరికీ నచ్చే.. ముఖ్యంగా పిల్లలు మెచ్చే టూటీ ఫ్రూటీ కేక్​ను మీరు ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

కోకో పౌడర్ - 150 గ్రాములు

మైదా - 175 గ్రాములు (చల్లుకుని పక్కన పెట్టుకోవాలి)

బాదం పొడి - 150 గ్రామములు

బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర స్పూన్

చాక్లెట్ సిరప్ - 150 ml

బటర్ - 250 గ్రాములు

పంచదార - 150 గ్రాములు

గుడ్లు - 5

మిక్స్డ్ ఫ్రూట్ జామ్ - 25 గ్రాములు

టూటీ ఫ్రూటీ - 100 గ్రాములు

ఐసింగ్ షుగర్ - 2 టేబుల్ స్పూన్స్ 

టూటీ ఫ్రూటీ కేక్ తయారీ విధానం

మీరు టూటీ ఫ్రూటీ కేక్ తయారు చేయాలనుకున్నప్పుడు.. టూటీ ఫ్రూటీని చాక్లెట్ సిరప్​లో ఒక వారం రోజుల ముందు నానబెట్టండి. బేకింగ్ చేసే రోజున మిక్సింగ్ గిన్నెలో మైదా పిండి, బాదం పొడి, కోకో పౌడర్​, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. అవి బాగా కలిసేందుకు ఫోర్క్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ఓవెన్​ను ప్రీహీట్ చేయండి.

మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో బటర్, షుగర్ వేసి బాగా కలపండి. క్రీమ్ ఆకృతిలో, లేత పసుపు రంగులోకి మారేవరకు దానిని బాగా కలుపుతూనే ఉండండి. లేత పసుపు రంగు క్రీమ్​ మాదిరిగా వచ్చిన తర్వాత దానిలో ఎగ్స్​ వేయండి. అది మరింత క్రీమిగా మారేవరకు దానిని బాగా కలపండి. మృదువైన క్రీమ్​గా మారిన తర్వాత దానిలో చాక్లెట్ సిరప్​, జామ్, నానబెట్టిన టూటీ ఫ్రూటీలు ఈ మిశ్రమంలో వేయాలి. 

ఇప్పుడు పిండిని కూడా ఇదే మిశ్రమంలో వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా బాగా కలపుకోవాలి. లేదంటే కేక్​ మధ్యలో గాలి ఉండిపోవడం, ముద్దులుగా కేక్​ మారడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేయాలి. మీకో విషయం తెలుసా? మీరు పిండిని ఎంత బాగా కలపగలిగితే మీ కేక్​ అంత పర్​ఫెక్ట్​గా వస్తుంది. దీనికోసం మీరు ఫోర్క్​ యూజ్ చేయొచ్చు. లేదంటే బ్యాటర్ మిక్సింగ్ పరికరాలు ఉపయోగించవచ్చు. 

కేక్​ బ్యాటర్​ బాగా మిక్స్ చేసిన తర్వాత.. బటర్​పేపర్​తో టిన్​ రెడీ చేసి పెట్టుకోవాలి. దానిలో పిండిని వేయాలి. గాలి బుడగలు లేకుండా దానిని సున్నితంగా ట్యాప్ చేస్తూ.. టిన్​లో సెట్​ చేయాలి. ఒకసారి నేలను ట్యాప్​ చేస్తే తెలియకుండా ఎక్కడైనా గ్యాప్​ ఉన్నా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్​ బ్యాటర్​ టిన్​ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీహీట్ చేసుకున్న ఓవెన్​లో ఉంచాలి. దీనిని 35 నుంచి 40 నిముషాలు ఉడికించాలి. కేక్ కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి దానిలో టూత్​ పిక్​ గుచ్చాలి. అది క్లీన్​గా బయటకు వస్తే కేక్​ రెడీ అయినట్లే. 

ఇలా రెడీ అయిన కేక్​ను ఓవెన్​ నుంచి బయటకు తీయాలి. దానిపై ఐసింగ్ షుగర్​తో కోటింగ్ చేయాలి. గార్నిష్ చేసుకోవడానికి మీరు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ సిరప్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని ఫ్రిజ్​లో పెట్టకుండా నార్మల్​ టెంపరేచర్​లో రెండు రోజులు ఉంచుకోవచ్చు. ఫ్రిజ్​లో వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్రిస్మస్​కు టూటీ ఫ్రూటీ కేక్ చేయాలనుకుంటే ఈ రోజే టూటీ ఫ్రూటీలు నానబెట్టేయండి. క్రిస్మస్​ రోజు హాయిగా కేక్​ వండేసి.. లాగించేయండి. 

Also Read : ఎగ్​లెస్ రవ్వ కేక్.. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే రెసిపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget