No Bathing - Health Problems: 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా - స్నానం చేయకపోతే వచ్చే హెల్త్ ప్రాబ్లెమ్స్ ఇవే
No Bathing - Health Problems : ఓ పక్క మహా కుంభమేళాకు ఏర్పాటు జరుగుతుండగా.. గత 32 ఏళ్లుగా స్నానం చేయకుండా ఉన్న చోటూ బాబా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.
No Bathing - Health Problems : మహా కుంభమేళాకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎప్పుడూ లేని స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకుంటూ.. అధికారులు కుంభమేళాకు సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు. మరో పక్క కుంభమేళాకు వచ్చే సాధువుల గురించి కూడా చర్చ సాగుతోంది. ఈ సారి భారీ సంఖ్యలో భక్తులతో పాటు సాధువులు, అఘోరాలు వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అస్సాంకు చెందిన ఓ సన్యాసి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
ఒకటి, రెండు రోజులు స్నానం చేయకపోతేనే అంతా చికాకుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు. కానీ ఓ వ్యక్తి మాత్రం 32ఏళ్లుగా స్నానం చేయడం లేదు. ఛోటూ బాబాగా పిలుచుకునే గంగాపురి మహారాజ్... తాను 32 ఏళ్లుగా స్నానం చేయడం లేదని చెప్పాడు. ఇటీవల ఆయన త్వరలో ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు చేరుకున్న బాబా అస్సాంలోని కామాఖ్య పీఠానికి చెందిన వ్యక్తి. ఆయన 3 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంటాడు. ప్రస్తుతం ఆయనకు 57ఏళ్లు. అయితే ఆయన ఎందుకు ఇన్నాళ్లు స్నానం చేయకుండా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా.. "ఇది మహా కుంభమేళా. ఇక్కడ మన ఆత్మ పరమాత్మతో అనుసంధానం కావాలి. అందుకే ఇక్కడకు వచ్చాను. నాకు ఒక కోరిక ఉంది. అది తీరేవరకు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే గత 32 ఏళ్లుగా స్నానం చేయలేదు. నా కోరిక తీరిన తర్వాతే గంగలో స్నానం చేస్తాను" అని చెప్పారు.
చోటూ బాబా స్నానం చేయకపోవడానికి కారణం ఏదైనప్పటికీ రోజూ స్నానం చేయకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది అక్షర సత్యం. వీటిలో ముఖ్యంగా..
చర్మ వ్యాధులు
రోజూ స్నానం చేయకపోవడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి రోజూ స్నానం చేస్తే అతని చర్మంలో ఉండే దుమ్ము, కాలుష్యం, ఇతర కణాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. ఫలితంగా చర్మ వ్యాధులూ దరి చేరవు.
శరీరం నుంచి వాసన
రోజూ స్నానం చేయని వారి శరీరం దుర్వాసన వస్తుంది. వారి శరీరం నుండి వెలువడే చెమట, వాసన ఆరోగ్యానికి మంచిది కాదు. స్నానం చేయకపోవడం వల్ల శరీరంలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది చర్మానికి చాలా హాని చేస్తుంది. చెమట కారణంగా ఆ వ్యక్తికి దురద, చర్మంపై ఎర్రటి మచ్చలు, దురద మొదలైన సమస్యలు కూడా రావచ్చు.
చర్మం హైడ్రేటెడ్ గా ఉండదు
రోజూ స్నానం చేయకపోవడం వల్ల శరీరమంతా మురికితో నిండిపోతుంది. దీని వల్ల మొటిమల సమస్య వస్తుంది. లేదా తీవ్రమవుతుంది. చర్మం కూడా హైడ్రేటెడ్ గా ఉండదు. ఇది మన చర్మ రంధ్రాలపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా చర్మంపై మురికి క్రమంగా పేరుకుపోతుంది. అటువంటి పరిస్థితిలో, ధూళి మొటిమలకు కారణమవుతుంది. అంతే కాకుండా స్నానం చేయకపోవడం వల్ల చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
మహా కుంభమేళా
మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇందులో జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి)నషీహి స్నాన్ జరుగుతుంది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు