అన్వేషించండి

Twins: ఇలాంటి కారణం వల్ల కూడా కవలలు జన్మిస్తారా? సెలీనా జైట్లీ విషయంలో ఇదే జరిగింది

సెలీనా జైట్లీ రెండుసార్లు కూడా కవలలకే జన్మనిచ్చింది.

కవలలు జన్మించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వైద్యశాస్త్రం ఇప్పుడు మరొక విషయాన్ని కూడా చెబుతోంది. భారతీయ నటి సెలీనా జైట్లీ రెండుసార్లు కూడా కవలలకే జన్మనిచ్చింది. మొదటిసారి ఇద్దరూ మగ పిల్లలు పుట్టారు. ఆ తరువాత మళ్లీ కవలలే పుట్టారు. కానీ అందులో ఒకరు గుండె సంబంధిత వ్యాధి కారణంగా మరణించారు. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో Ask me any thing అని పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఒక నెటిజన్ మీకు రెండు సార్లు కవలలే పుట్టడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఐవీఎఫ్ ద్వారా కవలలను కన్నారా? అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆమె సమాధానాన్ని ఇచ్చింది. తాను అరుదైన జన్యుపరమైన పరిస్థితి వల్ల కవలలకే జన్మనిస్తున్నానని చెప్పింది. అంటే వారసత్వంగా వచ్చిన ఒక ఆరోగ్య పరిస్థితి వల్ల ఆమెకు ఎన్నిసార్లు గర్భం దాల్చినా కవలలే పుడతారు.

ఈ అరుదైన జన్యు పరిస్థితుల్లో కొందరి మహిళల్లో అండోత్సర్గము జరిగే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. అప్పుడు కవలలతో లేదా ముగ్గురు, నలుగురు పిల్లలతో గర్భం దాల్చే అవకాశం పెరుగుతుంది. ఈ పరిస్థితి వల్లే సెలీనా రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు కవలలని ప్రసవించింది. మొదటిసారి 2012లో ఆమెకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. తర్వాత 2017 లో మరోసారి ఇద్దరు మగ కవలలు జన్మించారు. 2017 లో 32 వారాలకే ఆమెకు ప్రసవం జరిగింది. ఆ ప్రసవంలో ఒక బిడ్డ గుండె వ్యాధితో జన్మించినట్లు తెలుసుకున్నారు.  అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా కూడా ఆశీస్సులు మరణించాడు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 

సెలీనాకు రెండుసార్లు ఐడెంటికల్ కవలలే పుట్టారు. అంటే ఒకే అండంతో రెండు వీర్యకణాలు కలిసినప్పుడు ఇలా జరుగుతుంది. అది రెండు పిండాలుగా విడిపోయి అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రం పుట్టబోయే పిల్లలు కచ్చితంగా ఒకటే జెండర్ అయి ఉంటారు. అంటే ఇద్దరూ ఆడపిల్లలు అయినా అవుతారు. లేదా ఇద్దరు మగ పిల్లలైనా అవుతారు. అదే రెండు అండాలతో రెండు వీర్యకణాలు కలిస్తే అప్పుడు ఆ కవలల్లో ఒకరు ఆడ లేదా ఒకరు మగ అయ్యే అవకాశం ఉంది.  అవిభక్త కవలలు కూడా పుడుతూ ఉంటారు. అంటే శరీరాలు ఎక్కడో చోట కలిసిపోయి జన్మిస్తారు. అండం, వీర్యకణం ఫలదీకరణం చెందిన 12 రోజులకు కవలల శరీరాలు విడిపోవాలి. అలా కాకుండా విడిపోవడంలో వైఫల్యం చెందితే ఆ కవలలు ఒకరికొకరు అతుక్కుని పెరుగుతారు. ఇలాంటివారు అతుక్కునే పుడతారు. కొంతమందిని శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారు. కానీ కొంతమందిని విడదీయడం వీలు కాదు. అవిభక్త కవలలను వేరు చేయాలి. అంటే వారి గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు వేరువేరుగా ఇద్దరికీ ఏర్పడి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి అయినా కలిసి ఏర్పడితే వారిని విడదీయడం వీలుకాదు. అందుకే వీణా వాణి అవిభక్త కవలలను విడదీయడం వీలు కాలేదు. వీరి మెదడు కలిసిపోయి ఉంది.

Also read: పాలు రోజూ పొంగిపోతున్నాయా? ఈ ట్రిక్స్ పాటించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget