అన్వేషించండి

తరచూ కళ్లు తిరుగుతున్నాయా? అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయేమో?

కళ్ల తిరగడం, అకస్మాత్తుగా కిందపడిపోవడం జరుగుతున్నప్పుడు కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేయించుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా కూడా అంతే ప్రమాదం. ఎవరైనా కళ్లు తిరిగి పడిపోయినప్పుడు ఎక్కువ మంది చూసేది రక్తపోటు. రక్తపోటు తగ్గిందేమో, లేక అధికంగా పెరిగిందేమో అనుకుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను పట్టించుకోరు. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం కచ్చితంగా తరచూ కళ్లు తిరుగుతున్నా, కింద పడిపోతున్నట్టు అనిపిస్తున్నా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చెక్ చేసుకోవాలి. 

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు ఏమవుతుంది?
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడాన్ని ‘తక్కువ బ్లడ్ షుగర్ లేదా హైపోగ్లైసీమియా’ అంటారు. ఇది ప్రధానంగా మధుమేహం ఉన్నవారిలోనే కనిపిస్తుంది. డయాబెటిస్ లేని వారిలో ఈ సమస్య కలగడం చాలా అరుదు. దీనికి సకాలంలో చికిత్స అందకపోతే రక్తంలో చక్కెర శాతం ఇంకా తగ్గి మరణం సంభవిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు అందుకే తమ దగ్గర కచ్చితంగా ఓ తీపి పదార్థం ఉంచుకోవాలని చెబుతారు. ఎప్పుడైనా కళ్లు మసకగా మారి, తిరుగుతున్నట్టు అయితే చిన్న చాక్లెట్ ముక్క తినమని చెబుతారు.

తగ్గడానికి కారణాలు ఏమిటి?
డయాబెటిస్ ఉన్న వారిలో హఠాత్తుగా రక్తంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయిలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. 
1. భోజనం తినకుండా ఎక్కువ కాలం పాటూ ఖాళీ పొట్టతో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అల్పాహారం దాటవేయడం, మధ్యాహ్నం భోజనం దాటవేయడం వంటివి చేయకూడదు. 
2. ఇన్సులిన్ అధికంగా తీసుకున్నా లేక హెపటైటిస్ సి వ్యాధి కోసం వాడే యాంటీ వైరల్ మందుల వల్ల కూడా ఇలా జరగవచ్చు. 
3.బంగాళాదుంపలు, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. 
4. వ్యాయామాలు చేయడం మంచిదే, కానీ తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. 
5. ఆల్కహాల్ అతిగా తాగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. 
6. కిడ్నీ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా జరుగుతుంది. 
7. తగినంత నీరు తాగకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. 
8. క్షయ, క్యాన్సర్,  కాలేయ సమస్యలు ఉన్న వారిలో కూడా జరుగుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. 
1. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గగానే ఒళ్లంతా అకారణంగా చెమటలు పడతాయి. 
2. తీవ్ర అలసటగా అనిపిస్తుంది, తల తిరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది. 
3. విపరీతమైన ఆకలి వేస్తుంది. పెదవుల్లో వణుకు కనిపిస్తుంది. 
4. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. 
5. ఏడుపు త్వరగా వచ్చేస్తుంది. ఆత్రుత పెరుగుతుంది. 
6. చర్మం రంగు మారుతుంది. 
7. చూపు మసకబారుతుంది. 
8. మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది. 

వెంటనే ఏం చేయాలి?
పై లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని అర్థం. వెంటనే గ్లాసుడు పండ్ల రసం తాగాలి.లేదా చాక్కెట్ తినాలి. బిస్కెట్లు, పాలు వంటివి వెంటనే తిన్నా ఫర్వలేదు. ఎదురుగా కూల్ డ్రింక్ కనిపిస్తే సగం తాగేయండి. వెంటనే అంతా సరి అయిపోతుంది. 

Also read: ఈ ఆకులను అన్నంలో కలిపి వండితే బాస్మతి బియ్యంలా ఘుమఘుమలే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
Crime News: మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!
మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!
Man Eater: ఆ  పులి కడుపులో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు - మరో క్రూర మృగం దాడిలోనే మ్యాన్ ఈటర్ మృతి?
ఆ పులి కడుపులో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు - మరో క్రూర మృగం దాడిలోనే మ్యాన్ ఈటర్ మృతి?
SSMB29 Funny Memes: రాజమౌళి పోస్ట్‌, మహేష్‌ రిప్లై - పుట్టుకొచ్చిన మీమ్స్‌.. ఇవి చూస్తే నవ్వకుండ ఉండలేరు
రాజమౌళి పోస్ట్‌, మహేష్‌ రిప్లై - పుట్టుకొచ్చిన మీమ్స్‌.. ఇవి చూస్తే నవ్వకుండ ఉండలేరు
Embed widget