Saint Nicholas Day: శాంట క్లాజ్ తాత ఎవరో తెలుసా? తన బాధను మరిచి, పేదల కన్నీళ్లు తుడిచి - గుండె బరువెక్కించే నికోలస్ కథ ఇది!
Life Story of Santa Claus: ఎరుపు టోపీ, సూట్ ధరించే శాంతా క్లాజ్ నవ్వుతూ పిల్లలకు స్వీట్లు, గిఫ్టులు అందిస్తుంటాడు. శాంతా క్లాజ్ ఎవరు?నిజంగా శాంతాక్లాజ్ ఉన్నాడా? ఆయన జీవిత చరిత్ర తెలుసుకుందాం.
Saint Nicholas Day 2023: క్రిస్మస్ (క్రిస్ట్‌మస్) రాగానే గగనవీధుల్లోంచి శాంటాక్లాజ్ దిగివస్తాడు. క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి పిల్లలకు గిఫ్టులను ఇచ్చి వెళ్తాడని నమ్ముతుంటారు. అందుకే క్రిస్మత్ తాత అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇంతకీ శాంటాక్లాజ్ ఎవరు? శాంటాక్లాజ్ ఊహాజనితమా? నిజంగానే ఉన్నాడా?
అందరి సంతోషమే ఆయన సంతోషం
శాంటా క్లాజ్ నిజంగానే ఉండేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. 4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తి మైరాలో నివసించారు. అతను చాలా శ్రీమంతుడు. నికోలస్ తన తల్లిదండ్రులను కోల్పోతాడు. దీంతో అనాథ మారాడు. తల్లిదండ్రులను తలచుకుని కుమిలిపోయేవాడు. అనాథగా తాను ఎదుర్కొన్న బాధ మరెవ్వరికీ రాకూడదని నికోలస్ భావిస్తాడు. అప్పటి నుంచి ఆయన రహస్యంగా పేదలకు సాయం చేస్తుండేవాడు. ఇతరుల సంతోషాన్ని చూసి.. తన దుఖాన్ని మరచిపోయేవాడు.
మొదటి సాయం అలా..
మైరాలో ఒక పేద వ్యక్తికి ముగ్గురు కూతుర్లు ఉండేవారు. వారికి వివాహం చేయడం చాలా కష్టంగా మారింది. నికోలస్ ఈ విషయం తెలుసుకుని.. అతడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. సాక్స్‌లో బంగారాన్ని ఉంచి ఆ ఇంటి చిమ్నీలోకి విసిరేశాడు. అలా మూసార్లు బంగారాన్ని సాక్సుల్లో పెట్టి చిమ్నీలోకి వేశాడు. ఆ సాక్సులు అమ్మాయిలపై పడ్డాయి. దీంతో వాళ్ల తండ్రి.. నికోలస్‌ను చూసేశాడు. నికోలస్ ఆ వ్యక్తి దగ్గర మాట తీసుకున్నాడు. తాను ఈ సాయం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పవద్దన్నాడు. కానీ, ఆ విషయం అందరికీ తెలిసిపోయింది.
ఆరోజు నుంచి ఎవరికైనా సీక్రెట్ బహుమతి వస్తే అది నికోలస్ ఇచ్చిన బహుమతిగా అందరూ భావించేవారు. నికోలస్ క్రమంగా శాంటా క్లాజ్ తాతాగా ప్రజాదరణ పొందారు. అందుకే క్రిస్మస్ రోజు ఆయన్ని గుర్తుచేసుకుంటూ పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. నికోలస్ కథ మొదట లండన్ లో ప్రాచుర్యం పొందింది. అతనికి ఫాదర్ క్రిస్మస్, ఓల్డ్ మ్యాన్ క్రిస్మస్ అంటూ పేరు పెట్టారు. సీక్రెట్ శాంటా వంటి సాక్స్ లో గిఫ్టులు ఇచ్చే పద్దతి క్రిస్మస్ రోజు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. చాలా మంది సీక్రెట్ శాంటాగా మారుతూ ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నారు.
నికోలస్‌పై రోమన్ చక్రవర్తి దాష్టీకం
రోమన్ చక్రవర్తి డయోక్లెటియన్ క్రైస్తవలును దారుణంగా హింసించేవాడు. జైల్లు క్రైస్తవులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా ఏసు క్రీస్తును ఆరాదించే నికోలస్‌ను బహిష్కరించాడు. నికోలస్‌ను కొన్నాళ్లు జైల్లో బంధించారు. ఆ తర్వాత క్రైస్తవ మతానికి ప్రాచుర్యం కల్పించిన చక్రవర్తి కాన్‌స్టాంటైన్ శాంటాను జైలు నుంచి విడిపించారు. నికోలస్ నాల్గవ శతాబ్దంలో డిసెంబర్ 6న మరణించాడు. అతని కేథడ్రల్ చర్చిలో ఖననం చేశారు. అక్కడ అతని సమాధిలో మన్నా అని పిలువబడే ఒక ప్రత్యేకమైన అవశేషం ఏర్పడింది. మన్నా ఒక ద్రవ పదార్ధం, ఇది వైద్యం చేసే శక్తులను కలిగి ఉంటుంది. అతని పురాణ దాతృత్వాన్ని గుర్తుంచుకోవడానికి, సెయింట్ నికోలస్ డేని ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటారు.
Also Read : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్‌తో జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.