అన్వేషించండి

Gym Infections: జాగ్రత్త! జిమ్ వల్ల ఆరోగ్యమే కాదు అంటువ్యాధులు వస్తాయ్

అదేంటి జిమ్ కి వెళ్ళి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా అనుకుంటున్నారా? అవును మంచిదే కానీ దానితో పాటు అనేక అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రీరం మంచి ఆకృతి సంపాదించుకోవడానికి, బరువు తగ్గడానికి జిమ్ కి ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరగడమే కాదు మంచి టోనింగ్ కూడా వస్తుంది. ఒత్తిడిని తగ్గించి, శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణులు కూడా జిమ్ లో వ్యాయామం చేస్తే మంచిదేనని చెప్తుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే మీకోక విషయం తెలుసా చెమట పట్టించేలా చేసే వ్యాయామాలు అంటు వ్యాధుల్ని కూడా కలిగిస్తాయి. ఆశ్చర్యంగా ఉన్న మీరు విన్నది నిజమే. అంతే కాదు చెమట ద్వారానే ఈ అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయట.

జిమ్ లో అంటువ్యాధులు రావడానికి కారణం ఏంటి?

అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వెచ్చగా మూసిఉన్న, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. కొన్ని అంటువ్యాధులు వీటి ద్వారానే వ్యాపిస్తాయి. డంబెల్స్, కెటిల్ బెల్స్, యోగా చాపలు వంటి పరికరాలు ఒకరికి పది మంది ఉపయోగిస్తారు. వాటి మీద ఉండే సూక్ష్మక్రిములు చర్మంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. చివరికి కొన్ని చర్మ పరిస్థితులకు దారి తీస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చర్మ వ్యాధులు, అనారోగ్యాలని దారి తీసే బ్యాక్టీరియా 10-30 శాతం జిమ్ లోనే ఉంటాయి.

రింగ్వార్మ్

ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్వార్మ్ చర్మంపై గుండ్రం ఏర్పడుతుంది. ఇది దురదగా అనిపిస్తుంది. చర్మం సహా శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఒక శరీర భాగం నుంచి మరొక చోటుకి వేగంగా వ్యాపిస్తుంది. రింగ్వార్మ్ వెచ్చగా, తేమగా ఉండే ప్రదేశాలలో వృద్ధి చెందుతుంది. చెమటతో కూడిన పరికరాలు లేదా బెంచీలు వీటికి ఆవాసాలు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం రింగ్వార్మ్ శరీరంలోకి చొరబడిన తర్వాత 3-10 రోజుల్లో దాని రూపం కనిపిస్తుంది. వివిధ యాంటీ ఫంగల్ క్రీములు, లోషన్లు, స్ప్రేలతో చికిత్స చేయవచ్చు.

అథ్లెట్ ఫుట్

టేనియా పెడిస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్. దురద, పొడి, ఎరుపు చర్మం ఏర్పడుతుంది. చర్మంపై పగుళ్లు కలిగిస్తుంది. ఎక్కువగా కాళీ వేళ్ళ మధ్య  లేదంటే చుట్టు పక్కల పాదాల మొత్తం సంభవిస్తుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. చెమట కారణంగా పాదాలు తేమగా ఉన్నప్పుడు ట్రైకొఫైటన్ రబ్రమ్ అనే శిలీంధ్రాల వల్ల వస్తుంది. మంటని కలిగిస్తుంది. యాంటీ ఫంగల్ క్రీములు, జెల్స్ రాసుకోవచ్చు. అలాగే కాలి వేళ్ళని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. అప్పుడే ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

ఫోలిక్యులిటిస్

ఇది చాలా బాధకరమైన దురదతో కూడిన పరిస్థితి. మొటిమల మాదిరిగానే ఎరుపు రంగు గడ్డలు కలిగిస్తుంది. చాలా మంది వ్యక్తులు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారు. మెడ, చంకలు, తొడలపి ఏర్పడే హెయిర్ ఫోలికల్స్, రూట్స్ లో ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఎక్కువగా చెమట పట్టినా, మురికి పరికరాలు ఉపయోగించడం ద్వారా ఇది అభివృద్ధి చెందుతుంది.

పులిపిర్లు

వీటిని వెర్రూకె మొటిమలు అని కూడ పిలుస్తారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల సంభవిస్తాయి. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో దాడి చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మంది వ్యక్తుల గాయాలు తీవ్రమవుతుంటే బాధ తట్టుకోలేరు. ఈ వైరస్ శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. దీని వల్ల విపరీతమైన నొప్పిగా ఉంటుంది.

స్టాఫ్

స్టాఫ్, స్టెఫీలోకాకస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చర్మం మీద స్క్రాచ్ లేదా కట్ అయినప్పుడు ఇది తీవ్రమవుతుంది. వాపు, బాధకరమైన ఎర్రటి దద్దుర్లు కలిగిస్తుంది. షేర్డ్ జిమ్ పరికరాలు, దుస్తులు, ఖర్చిఫ్స్ కారణంగా వ్యాపిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా? ఇదే కారణం కావచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget