News
News
వీడియోలు ఆటలు
X

Blood Pressure: జాగ్రత్త, ఈ విటమిన్ సప్లిమెంట్స్ బ్లడ్ ప్రెజర్ ని పెంచేసి ప్రాణాల మీదకు తెస్తుంది

ఆరోగ్యం కోసం సాధారణంగా తీసుకునే కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్లు ప్రాణాంతక పరిస్థితి తీసుకొస్తుంది. అధిక రక్తపోటుని పెంచేస్తుంది. మరణం సంభవించే ప్రమాదం ఉంది.

FOLLOW US: 
Share:

ఆరోగ్యాన్ని పెంచే కొన్ని మందులు, సప్లిమెంట్లు ఉన్నాయి. కానీ ఇవి గుండెకి మంచివి కాకపోవచ్చు. శరీర పనీతిరుకు ముఖ్యమైన కొన్ని విటమిన్ సప్లిమెంట్లు నేరుగా హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రక్తపోటుకి మందులు వేసుకుంటున్న వాళ్ళు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా ప్రమాదకరం అవుతుంది. అధిక రక్తపోటు గుండె పోటు లేదా మరణానికి కూడ దారితీస్తుంది. కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ అతిగా వాడితే రక్తపోటుని పెంచేస్తాయి. అవేంటంటే..

విటమిన్ ఇ

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యాంటీ ఆక్సిడెంట్ల కోసం విటమిన్ ఇ వంటి సప్లిమెంట్లు తీసుకోవద్దని హెచ్చరిస్తుంది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం రక్తపోటుని తగ్గించేందుకు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఈ విటమిన్ తీసుకుంటారు. కానీ మరికొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ ఇ అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక రక్తస్రావం కలిగిస్తుంది. రక్తం గడ్డకట్టే పరిస్థితికి కూడా తీసుకొస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

విటమిన్ కె

రక్తం గడ్డకట్టడానికి, ఎముకలని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ కె సహాయపడుతుంది. బ్లడ్ థినర్స్ కోసం మందులు తీసుకునే వాళ్ళు వీటిని కనుక తీసుకుంటే గుండె పోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్లడ్ థినర్స్ తీసుకునే వారు విటమిన్ K ని స్థిరమైన స్థాయిలో తీసుకోవడం అవసరం. మోతాదుకి మించి తీసుకుంటే ఔషధాల ప్రభావానికి ఆటంకం ఏర్పడుతుంది.

విటమిన్ డి 

విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. కానీ కొంతమంది ఎండ అనేది తగలకుండా ఉండటం వల్ల ఈ లోపంతో బాధపడతారు. దాన్ని అధిగమించేందుకు సొంతంగా విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటారు. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడే వాళ్ళు వీటిని తీసుకుంటే శరీరంలో విషపూరితం కావచ్చు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం విటమిన్ డి టాక్సిసిటీ, హైపర్ విటమినోసిస్ డి బారిన పడతారు. దీన్నే హైపర్ కాల్సమియా లేదా రక్తంలో అసాధారణంగా అధిక కాల్షియం ఏర్పడటానికి కారణమయ్యే తీవ్రమైన వైద్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం.

ఆర్నికా

ఆర్నికా అనేది విటమిన్లతో కూడిన ఉపయోగకరమైన మూలిక. ఇది సాధారణంగా గాయాలు, నొప్పులు, బెణుకులతో సంబంధం ఉన్న నొప్పి, వాపులు తగ్గించేందుకు చర్మం మీద రాసుకుంటారు. ఆహారాలలోని దీన్ని వినియోగిస్తారు. ఎక్కువగా పానీయాలు, ఫ్రీజింగ్ చేసిన డెజర్ట్, మిఠాయిలు, ఫ్రైడ్ ఫుడ్, జెలటిన్, ఫుడ్డింగ్ లో సువాసన పదార్థంగా ఉపయోగిస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆర్నికా చర్మంపై ఉపయోగించినప్పుడు సురక్షితంగా పరిగణించబడుతుంది. అయితే మాత్రలు లేదా ఇతర రూపాల్లో నోటి ద్వారా తీసుకోకూడదు. నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఇది తీవ్రమైన గుండె సమస్యలు, మైకం వంటి సమస్యలను కలిగిస్తుంది. పెద్ద మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకం కూడా కావచ్చు.

 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: విటమిన్స్ సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?

Published at : 17 May 2023 07:00 AM (IST) Tags: Blood pressure Vitamin Supplements Heart Problems Vitamin Supplements Side Effects

సంబంధిత కథనాలు

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!