అన్వేషించండి

ఈ ఆహారం తింటే అస్సలు ముసలోళ్లే కారు, ఏ వయస్సులో ఏం తీసుకోవాలంటే..

ఈ వయస్సులో తినాల్సింది ఆ వయస్సులో తినాలని పెద్దలు అంటారు. యూకేకు చెందిన వైద్య నిపుణులు కూడా అదే చెబుతున్నారు. మరి, మీరున్న వయస్సులో ఏయే ఆహారాలు తింటే వృద్ధాప్యాన్ని వాయిదా వేయొచ్చు చూడండి.

యస్సు పెరిగే కొద్ది.. శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే చర్మం క్రమేనా ముడతలు పడుతూ ఉంటుంది. నల్ల మచ్చలు, తెల్ల వెంటుకలు, కొత్త రోగాలు, కళ్లు-దంత సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. వాటిని అడ్డుకోవడం మన వల్ల కాదని మనం అనుకుంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. వయస్సు మీద పడుతున్నప్పుడు యవ్వనంగా కనిపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ పరిస్థితి రాకూడదంటే మీరు.. 20 ఏళ్ల వయస్సు నుంచే అప్రమత్తం కావాలి. క్రమం తప్పకుండా శరీరానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. మరి, ఏయే వయస్సుల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నిత్య యవ్వనంగా ఉండవచ్చో తెలుసుకుందామా. 

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. యవ్వనంగా కనిపించాలన్నా సమతుల్య ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. నడి వయస్సులో చేపలను ఎక్కువగా తినడం వల్ల చిత్తవైకల్యం (మతిమరపు) నుంచి బయటపడొచ్చని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.

20 ప్లస్ వయస్సులో ఏం తినాలంటే..

⦿ ప్రతి రోజు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి. బఠానీలు, బీన్స్, వేరుశెనగలు, డ్రై ఆప్రికాట్స్, గుడ్లు, బలవర్థకమైన అల్పాహారం, తృణధాన్యాలు, మాకేరెల్ వంటి చేపల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి.. ఈ వయస్సులో సంకోచం లేకుండా అవన్నీ తినేస్తూ ఉండండి. ముఖ్యంగా యువ్త వయస్సులో ఉండే యువతులు ఈ ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఫుడ్ వల్ల అలసట, ఒత్తిడి, ఏకాగ్రత సమస్యలు దరిచేరవు.

⦿ పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు వారంలో మూడు సార్లు  పెరుగును తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇంకా అది రోగనిరోధశక్తి, మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఎముకుల బలాన్ని ఇచ్చేందుకు తగినంత కాల్షియాన్ని అందిస్తాయి. 

⦿ వారానికి ఒకసారి బ్రెజిల్ నట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన సెలీనియం లభిస్తుంది. చికెన్, చేపలు, గుడ్లు, ఇతర నట్స్ కూడా కనిపిస్తుంది. సెలీనియం జలుబు, ఫ్లూ, కోవిడ్‌ని ప్రేరేపించే వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో కూడా పోరాడుతుంది.

30 ప్లస్ వయస్సులో..

⦿ మీకు 30 ఏళ్ల వయస్సు వచ్చాయంటే.. వృద్ధాప్యానికి ఫ్రీపాస్ వచ్చినట్లే. అంటే, మీరు అందులోకి వెళ్లాలా, లేదా అనేది మీరు తీసుకొనే ఆరోగ్య సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల వయస్సులో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వృద్ధాప్యాన్ని వాయిదా వేయొచ్చు.

⦿ ఇటీవల చాలామంది లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు. ఫలితంగా ఈ ఏజ్‌లోనే గర్భం దాల్చుతున్నారు. కాబట్టి, ఈ వయస్సుకు వచ్చిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన గర్బధారణ కోసం ఆకు కూరలు ఎక్కువగా తినాలి. పప్పులు, నారింజలు, నట్స్‌‌తోపాటు బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలు తినాలి. అవి మీకు ఫోలేట్‌ను అందిస్తాయి. ఇది గర్భం దాల్చిన మొదటి ఎనిమిది వారాలలో నాడీ వ్యవస్థను అభివృద్ధి చేసే శిశువులకు అవసరమైన బి విటమిన్‌ను అందిస్తుంది.

⦿ వైద్యుల సూచనతో మహిళలు ఫోలిక్ యాసిడ్‌ సప్లిమెంట్స్‌ను కూడా తీసుకోవచ్చు. వారానికి మూడు సార్లు బాదం పప్పులు తీసుకోవాలి. దానివల్ల వయస్సు మీద పడదు. వృద్ధాప్య ఛాయలు మీదపడవు. సన్ స్క్రీన్ లోషన్స్ కూడా తరచుగా వాడుతూ ఉండండి. లేకపోతే చర్మంపై ముడతలు ఏర్పడతాయి.

⦿ వీలైనంత వరకు గింజలు, మొలకెత్తిన విత్తనాలు తినండి. అవి మీకు విటమిన్-ఇ అందిస్తాయి. శరీరంలో ‘ఆక్సికరణ’ సక్రమంగా సాగేందుకు అవి ఉపయోగపడతాయి. ఆక్సికరణ సక్రమంగా ఉంటేనే చర్మం కూడా యవ్వనంగా ఉంటుంది. అవకాడోలు, తృణధాన్యాలు, బచ్చలికూర కూడా మనకుముఖ్యమైన యాంటీ ఏజింగ్ విటమిన్‌ను అందిస్తాయి. ఈ వయస్సులో నిద్ర చాలా ముఖ్యం. వారంలో ఒక్కసారైనా కాఫీ, టీలకు దూరంగా ఉండండి.  

40 ప్లస్ వయస్సులో.. 

⦿ ఈ వయస్సు మీ ఆయుష్షు ఎన్నేళ్లనేది నిర్ధరిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు దాడి చేసే వయస్సు కూడా ఇదే. కాబట్టి, ఈ వయస్సులో మీ ఆహారం చాలా సెలక్టివ్‌గా ఉండాలి. ముఖ్యంగా పిండి పదార్థాలను నెమ్మదిగా వదిలించుకోండి. గంజి, పాస్తా, చిలగడదుంపలు, పండ్లు, కూరగాయలతో కార్బోహైడ్రేట్‌లను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి.. వాటిని మీరు ఎక్కువగా తీసుకోండి.

⦿ మహిళల్లో హార్మోన్లు మారేప్పుడు శక్తిని స్థిరీకరించడానికి అవి సహాయపడతాయి. 40 ప్లస్ అంటే మెనోపాజ్‌ దశ. దాన్ని ఎదుర్కోవడానికి ఈస్ట్రోజెన్‌లను ఎక్కువగా తీసుకోవాలి. సోయా, పప్పులు, తృణధాన్యాలు ఈస్ట్రోజెన్‌లను అందిస్తాయి. ఇ ఈస్ట్రోజెన్-వంటి ప్రభావాన్ని కలిగి ఉండటం ద్వారా రుతువిరతి ద్వారా ప్రజలను సులభతరం చేయడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

⦿ ఈ ఏజ్‌లో ఎముకుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి, మీరు వారంలో ఒక్కసారైనా కిమ్చి, సౌర్‌క్రాట్, కేఫీర్, యోగర్ట్(పెరుగు), లీన్ రెడ్ మీట్, డైరీ ఫుడ్స్ తీసుకోవాలి. వీటి ద్వారా మీకు విటమిన్-K లభిస్తుంది. ఎందుకంటే.. ఈ వయస్సులో ఎముకలు బలహీనంగా మారి పగుళ్లు ఏర్పడతాయి. వయస్సు పెరిగే కొద్ది అవి నడవలేని స్థితికి నెట్టేస్తాయి. 

50 ప్లస్ వయస్సులో..

⦿ ఈ వయస్సులో రోజూ టమోటాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. టమోటాలు చర్మంలోని ముడతలతో పోరాడుతాయి. బ్రోకలీ, బచ్చలికూర, ఎర్ర మిరియాలు, క్యారెట్ వంటి ఎరుపు, పసుపు, నారింజ రంగు కూరగాయల్లో ఉండే లైకోపీన్, లుటీన్, బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పిగ్మెంట్ల ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లోపలి నుంచి మన చర్మాన్ని వృద్ధాప్యం నుంచి రక్షించవచ్చి నిపుణులు చెబుతున్నారు.

⦿ వారానికి కనీసం మూడు సార్లు బెర్రీస్ (ద్రాక్ష, స్ట్రాబెర్రీ, చెర్రి, ఉసిరి తదితరాలు) తీసుకోవాలి. దీనివల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కనీసం 100 గ్రాముల బెర్రీస్ తినాలి. పాలు కూడా తప్పకుండా తాగాలి. బ్లూబెర్రీస్.. ఫ్లేవనాయిడ్ సూపర్ న్యూట్రీషియన్స్‌తో నిండి ఉంటాయి. ఇది డిమెన్షియా(చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

⦿ వారానికి ఒకసారైనా ఒమేగా-3 శరీరానికి అందించే సాల్మన్ చేపలను తినాలి. దానివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు శాఖాహారులైతే.. వాల్‌నట్‌లు, చియా విత్తనాలు తినండి.  

60 ప్లస్ వయస్సులో..

⦿ 60 ఏళ్లు వస్తే.. ఇక అయిపోయాం అనుకుంటారు. కానీ, అసలైన యవ్వనాన్ని ఇక్కడే ఆస్వాదించాలి. మీ మనస్సును యవ్వనంగా ఉంచుకుంటూ చురుగ్గా కనిపించాలి. మన టాలీవుడ్ స్టార్స్ అక్కినేని నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణలు ఈ వయస్సులో కూడా అంత చురుగ్గా ఉండటానికి కారణం.. వారి మనస్తత్వమే. కాబట్టి, వృద్ధాప్యం అనే పదాన్ని మీ డిక్షనరీ నుంచి చింపేయండి.

⦿ మనస్సు యవ్వనంగా ఉంటే శరీరం కూడా యవ్వనంగా ఉంటుంది. ఇందుకు కాస్తా ఆరోగ్యకరమైన ఆహారాన్ని జోడిస్తే.. వృద్ధాప్యం మీ దగ్గరకు రావాలంటే వణికిపోతుంది. కండరాల బలం కోసం రోజూ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. పప్పులు, కూరగాయలు, పండ్లు నుంచి చికెన్, చేపలు లేదా లీన్ మీట్ వంటివి ఏదీ వదలకుండా తీసుకోండి. అవి కండరాల క్షీణత లేదా 'సార్కోపెనియా'ను తగ్గిస్తాయి. మిమ్మల్ని బలంగా నిలబెడతాయి.

⦿ వారానికి మూడు సార్లు జ్ఞాపకశక్తి కోసం గుడ్లు తినండి. గుడ్లలో నరాల ట్రాన్స్‌మిటర్ ఎసిటైల్‌కోలిన్‌ను తయారు చేయడానికి కీలకమైన పోషకం కోలిన్ ఉంటుంది. ఇది కండరాలు సంకోచించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి, ఆలోచనలో కీలక పాత్ర పోషిస్తుంది. చికెన్, చేపలు, బీన్స్, తృణధాన్యాల నుంచి కూడా మనకు కోలిన్‌ను లభిస్తుంది.

⦿ అలాగే శరీరానికి కాల్షియం, విటమిన్-డి అందించే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఇవి చెవిలోని మూడు చిన్న ఎముకులను ఆరోగ్యంగా ఉంచుతాయి. వినికిడి సమస్యల నుంచి గట్టెక్కిస్తాయి. చూశారుగా మరి, మీ వయస్సుకు తగిన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదు, రోజూ వ్యాయామలు చేస్తూ స్ట్రాంగ్‌గా ఉండండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Agriculture: వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Agriculture: వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget