అన్వేషించండి

Beetroot Recipe: పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌గా బీట్‌రూట్ ఇడ్లీ, ఇన్‌స్టెంట్ రెసిపీ ఇదిగో

బీట్‌రూట్‌తో చేసే ఆరోగ్యకరమైన రెసిపీ ‘బీట్‌రూట్ ఇడ్లీ’.

బీట్‌రూట్ టేస్టు చాలా మందికి నచ్చదు. పిల్లలు తినడానికి ఇష్టపడరు. నిజానికి బీట్‌రూట్ తినాల్సింది పిల్లలు, మహిళలే. రక్త హీనత సమస్య రాకుండా ఉండాలంటే ముఖ్యంగా తినాల్సింది బీట్‌రూట్‌నే. కూరగా తినేందుకు పిల్లలు ఇష్టపడకపోతే ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెడితే తినే అవకాశం ఉంది. 

కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - రెండు కప్పులు
పెరుగు - ఒక  కప్పు
బీట్ రూట్ - మీడియం సైజుది ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడా 
 
తయారీ ఇలా
1. స్టవ్ పై కళాయి పెట్టి బొంబాయి రవ్వను కాస్త వేయించాలి. రంగు మారకుండా చూసుకోవాలి. పచ్చి వాసన రాకుండా రెండు నిమిషాలు వేయిస్తే చాలు. 

2. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ వేసి కప్పు పెరుగును వేయాలి. ఆ రెండింటినీ బాగా కలిపి రుబ్బులా రెడీ చేసుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.

3. ఇప్పుడు బీట్‌రూట్ ను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. 

4. ఇడ్లీ రుబ్బులో బీట్‌రూట్ పేస్టును వేసి బాగా కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పావుగంట సేపు అలా పక్కన వదిలేయాలి. 

5. తరువాత ఇడ్లీ ప్లేట్లకు కాస్త ఆయిల్ రాసి రుబ్బును వేయాలి. 

6. పావుగంట తరువాత ఇడ్లీ రెడీ. మీకు పచ్చిగా ఉండే బీట్ రూట్ వాడాలనిపించకపోతే, బీట్ రూట్ ముక్కలను నూనెలో కాసేపు వేయించచ్చు. పసుపు, ఉప్పు వేసి వేయిస్తే రుచి బావుంటుంది. వాటిని పేస్టులా చేసుకుని వాడుకోవచ్చు. 

బీట్రూట్ వల్ల ఎన్ని లాభాలో...
1. బీట్‌రూట్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 
2. బీట్ రూట్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఇది రక్త హీనత సమస్యను తప్పిస్తుంది. 
3. కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, సి, మెగ్నిషియం వంటివి అధికంగా ఉంటుంది. 
4. బీట్‌రూట్ రోజూ తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. 
5. మధుమేహం ఉన్న వారు బీట్ రూట్‌ను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. 
6. గర్భిణిలు దీన్ని తినడం వల్ల ఫోలిక్ ఆమ్లం బిడ్డకు అంది, ఎదుగుదల బావుంటుంది. 
7. కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచేందుకు బీట్ రూట్ సాయపడుతుంది. 
8. బీపీని నియంత్రణలో ఉంచడంలో ముందుంటుంది. 
9. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే బీట్రూట్ తరచూ తినాలి. 
10. కొలెస్ట్రాల్‌ను కరిగించే శక్తి బీట్ రూట్‌కు ఉంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు బీట్ రూట్ ను వారంలో రెండు నుంచి మూడు సార్లు తినడం ఉత్తమం. 

Also read: ముద్దు పెట్టుకునే సంస్కృతి ఏ కాలంలో మొదలైంది? ముద్దుకు అంత ప్రాధాన్యత ఎందుకు?

Also read: తనను తానే పెళ్లి చేసుకుని కొత్త ట్రెండ్ సెట్ చేసిన యువతి, అందుకు కారణాలు ఇలా చెబుతోంది

టాప్ హెడ్ లైన్స్

Tips to Manage Daily Stress : స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
Omelette Curry : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
Heart Attack vs Cardiac Arrest : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget