By: ABP Desam | Updated at : 28 Mar 2023 08:44 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
వేడి వాతావరణం చర్మం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అమ్మాయిలు ఎండ వేడి తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మగవాళ్ళు మాత్రం ఏముందిలే అని పట్టించుకోకుండా ఉంటారు. దీని వల్ల చర్మం పొడిగా, చికాకు పెడుతూ ఉంటుంది. అందుకే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చర్మాన్ని రక్షించుకోవచ్చు. సీజన్ మొత్తం మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పురుషులు వేసవిలో చర్మ సంరక్షణ చర్యలు ఈ విధంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సూర్యుని హానికరమైన యూవీ కిరణాలు వేసవిలో బలంగా ఉంటాయి. వడదెబ్బ, చర్మం ముడుచుకుపోవడం వంటి అనేక చర్మ సమస్యలకు కారణం కావచ్చు. వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. చర్మాన్ని రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ ధరించడం చాలా అవసరం. కనీసం 30 SPF ఉన్న సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. మొహం, చేతులు, కాళ్ళకి రాసుకోవాలి. ఎక్కువ సేపు ఎండలో ఉంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లై చేయడం మంచిది.
వేసవి అంటే చెమట, నూనె, మురికి చేరి చర్మాన్ని చికాకు పెట్టేస్తాయి.దీన్ని వల్ల బ్రేక్ అవుట్స్ వచ్చేస్తాయి. దాన్ని పోగొట్టుకోవడం కోసం రోజుకి రెండు సార్లు ఫేస్ వాష్ ముఖ్యం. సున్నితమైన డీ టాన్ ఫేస్ వాష్ ఉపయోగించాలి. ఇది చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. రంధ్రాలు మూసుకుపోకుండా చేస్తుంది. చర్మంలోని సహజ నూనె పోకుండా ఉంచుతుంది. చర్మం శుభ్రం చేసుకునేందుకు వేడి నీటిని అసలు ఉపయోగించొద్దు. ఇది చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎక్స్ ఫోలియేటింగ్ తప్పనిసరి. వేసవి నెలలో ఇది మరింత క్లిష్టమైనది. చర్మం ఎక్కువ నూనెని ఉత్పత్తి చేస్తుండటం వల్ల మృతకాణాలు చర్మంపై పేరుకుపోతాయి. రంధ్రాలు మూసుకుపోతాయి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయి రంధ్రాలు అణ్ లాగ్ అవుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుస్తుంది. సున్నితమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్, గ్లైకోలిక్ యాసిడ్‌తో ఎక్స్‌ఫోలియేటింగ్ క్లెన్సర్‌ని ఉపయోగించడం మేలు.
మెరిసే చర్మానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం. తేలికైణ నూనె లేని మాయుశ్చరైజర్ ఉపయోగించాలి. ఉదయం, సాయంత్రం ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని రాసుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉన్నవి రాసుకుంటే తేమని నిలుపుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇదే కాదు చక్కగా నీళ్ళు తాగాలి. కనీసం రోజు 3-4 లీటర్ల నీటిని తాగితే మంచిది.
మగవాళ్ళకి గడ్డం చాలా చిరాకు పెట్టేస్తుంది. దీని నుంచి బయటపడాలంటే గడ్డాన్ని మృదువుగా ఉంచుకోవాలి. ఆల్ఫా బిసాబోలోల్, విటమిన్ ఇ, బాదం నూనె వంటి సహజ పదార్థాలు కలిగి ఉన్న క్రీమ్స్ రాసుకోవాలి. ఇవి గడ్డానికి మృదుత్వాన్ని ఇస్తాయి.
వేసవిలో పెదవులు పొడిబారిపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. వాటికి అదనపు TLC ఇవ్వడం చాలా ముఖ్యం. పెదాలు పొడిబారకుండా కాపాడుకోవడానికి లిప్ బామ్ ఉపయోగించండి. పెదాలు మృదువుగా మారతాయి. షియా బటర్, కొబ్బరి నూనె వంటి పోషక పదార్థాలు కలిగి ఉన్న లిప్ బామ్స్ రాయడం ఉత్తమం.
సూర్యుని కిరణాలు చర్మాన్ని మాత్రమే కాదు జుట్టుని దెబ్బతీస్తాయి. పొడిగా, పెళుసుగా మార్చేస్తాయి. అందుకే జుట్టుకి కండిషనర్ ఉపయోగించాలి. లీవ్ ఇన్ కండిషనర్ లేదా హెయిర్ ఆయిల్/ వైటలైజర్ ని ఉపయోగించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ మూడు పానీయాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేస్తాయ్
Pimples: మామిడి పండ్లు తినగానే మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా?
Lipstick: ఇంట్లోనే సులభంగా లిప్ స్టిక్ తయారు చేసుకోండిలా!
Hair Fall: జుట్టు రాలే సమస్యకి బై బై చెప్పాలంటే ఈ పవర్ ఫుల్ స్మూతీ తాగేయండి
Hair Fall: ఒబేసిటీ వల్ల జుట్టు రాలిపోతుందా? దీన్ని అధిగమించడం ఎలా?
చర్మం ఎప్పుడూ జిడ్డుగా ఉంటోందా? కారణం ఇదే - ఈ జాగ్రత్తలు పాటించండి
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?